యొర్దానునడుమ నిలుచుండగా
యెహొషువ 3:13

సర్వలోక నాధుడగు యెహోవా నిబంధన మందసమును మోయు యాజకుల అరకాళ్లు యొర్దాను నీళ్లను ముట్టగానే యొర్దాను నీళ్లు, అనగా ఎగువనుండి పారు నీళ్లు ఆపబడి యేకరాశిగా నిలుచును.

యెహొషువ 3:16

పైనుండి పారు నీళ్లు బహు దూరమున సారెతానునొద్దనున్న ఆదామను పురమునకు దగ్గర ఏక రాశిగా నిలిచెను. లవణసముద్రమను అరాబా సముద్రమునకు పారునవి బొత్తిగా ఆపబడెను.

యెహొషువ 3:17

జనులు యెరికో యెదుటను దాటగా యెహోవా నిబంధన మందసమును మోయు యాజకులు యొర్దానుమధ్య ఆరిన నేలను స్థిరముగా నిలిచిరి. జనులందరు యొర్దానును దాటుట తుద ముట్టువరకు ఇశ్రాయేలీయులందరు ఆరిన నేలమీద దాటుచు వచ్చిరి.

యెషయా 28:16
ప్రభువగు యెహోవా ఈలాగున సెలవిచ్చుచున్నాడు సీయోనులో పునాదిగా రాతిని వేసినవాడను నేనే అది పరిశోధింపబడిన రాయి అమూల్యమైన తలరాయి బహు స్థిరమైన పునాదియైన మూలరాయియైయున్నది విశ్వసించువాడు కలవరపడడు.
మోషే
సంఖ్యాకాండము 27:21-23
21

యాజకుడైన ఎలియాజరు ఎదుట అతడు నిలువగా అతడు యెహోవా సన్నిధిని ఊరీము తీర్పువలన అతనికొరకు విచారింపవలెను. అతడును అతనితో కూడ ఇశ్రాయేలీయులందరును, అనగా సర్వసమాజము అతని మాటచొప్పున తమ సమస్త కార్యములను జరుపుచుండవలెను.

22

యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు అతడు చేసెను. అతడు యెహోషువను తీసికొని యాజకుడైన ఎలియాజరు ఎదుటను సర్వసమాజము ఎదుటను అతని నిలువబెట్టి

23

అతనిమీద తన చేతులుంచి యెహోవా మోషేద్వారా ఆజ్ఞాపించినట్లు అతనికి ఆజ్ఞ యిచ్చెను.

ద్వితీయోపదేశకాండమ 31:9

మోషే ఈ ధర్మశాస్త్రమును వ్రాసి యెహోవా నిబంధన మందసమును మోయు యాజకులైన లేవీయులకును ఇశ్రాయేలీయుల పెద్దలందరికిని దాని నప్పగించి

త్వరపడి
నిర్గమకాండము 12:39

వారు ఐగుప్తులోనుండి తెచ్చిన పిండిముద్దతో పొంగని రొట్టెలుచేసి కాల్చిరి. వారు ఐగుప్తులోనుండి వెళ్లగొట్టబడి తడవుచేయలేకపోయిరి గనుక అది పులిసియుండలేదు, వారు తమ కొరకు వేరొక ఆహారమును సిద్ధపరచుకొనియుండలేదు.

కీర్తనల గ్రంథము 119:60
నీ ఆజ్ఞలను అనుసరించుటకు నేను జాగుచేయక త్వరపడితిని.
సామెతలు 27:1

రేపటి దినమునుగూర్చి అతిశయపడకుము ఏ దినమున ఏది సంభవించునో అది నీకు తెలియదు.

ప్రసంగి 9:10

చేయుటకు నీ చేతికి వచ్చిన యే పనినైనను నీ శక్తిలోపము లేకుండ చేయుము; నీవు పోవు పాతాళమునందు పనియైనను ఉపాయమైనను తెలివియైనను జ్ఞానమైనను లేదు.

2 కొరింథీయులకు 6:2

అనుకూల సమయమందు నీ మొర నాలకించితిని; రక్షణ దినమందు నిన్ను ఆదుకొంటిని అని ఆయన చెప్పుచున్నాడు గదా!

హెబ్రీయులకు 3:7

మరియు పరిశుద్ధాత్మ యిట్లు చెప్పుచున్నాడు.

హెబ్రీయులకు 3:8

నేడు మీరాయన శబ్దమును వినినయెడల, అరణ్యములో శోధన దినమందు కోపము పుట్టించినప్పటివలె మీ హృదయములను కఠినపరచుకొనకుడి.