
కాబట్టి యేసు, తనను నమి్మన యూదులతోమీరు నా వాక్యమందు నిలిచినవారైతే నిజముగా నాకు శిష్యులై యుండి సత్యమును గ్రహించెదరు;
అందుకు వారు ఆయనతోమా తండ్రి అబ్రాహామనిరి; యేసుమీరు అబ్రాహాము పిల్లలైతే అబ్రాహాము చేసిన క్రియలు చేతురు.
బాహ్యమునకు యూదుడైనవాడు యూదుడు కాడు ; శరీర మందు బాహ్యమైన సున్నతి సున్నతి కాదు .
అయితే అంతరంగమందు యూదుడైన వాడే యూదుడు . మరియు సున్నతి హృదయ సంబంధమైనదై ఆత్మ యందు జరుగునదే గాని అక్షరమువలన కలుగునది కాదు . అట్టివానికి మెప్పు మనుష్యుల వలన కలుగదు దేవుని వలననే కలుగును.
అయితే దేవుని మాట తప్పిపోయినట్టు కాదు ; ఇశ్రాయేలు సంబంధులందరును ఇశ్రాయేలీయులు కారు.
ఎందుకనగా శరీరమును ఆస్పదము చేసికొనక దేవునియొక్క ఆత్మవలన ఆరాధించుచు, క్రీస్తుయేసునందు అతిశయపడుచున్న మనమే సున్నతి ఆచరించువారము.
యెహోవాచేత నిర్దోషి అని యెంచబడినవాడు ఆత్మలో కపటములేనివాడు ధన్యుడు.
ఇశ్రాయేలుయెడల శుద్ధహృదయులయెడల నిశ్చయముగా దేవుడు దయాళుడైయున్నాడు.
ప్రభువు దయాళుడని మీరు రుచిచూచియున్న యెడల
ఆయన పాపము చేయలేదు; ఆయన నోటను ఏ కపటమును కనబడలేదు.
వీరినోట ఏ అబద్ధమును కనబడలేదు; వీరు అనింద్యులు.