తిబెరికైసరు
లూకా 2:1

ఆ దినముల లో సర్వ లోకమునకు ప్రజాసంఖ్య వ్రాయవలెనని కైసరు ఔగుస్తు వలన ఆజ్ఞ ఆయెను .

పొంతిపిలాతు
లూకా 23:1-4
1

అంతట వారందరును లేచి ఆయనను పిలాతు నొద్దకు తీసికొనిపోయి

2

ఇతడు మా జనమును తిరుగబడ ప్రేరేపించుచు , కైసరునకు పన్ని య్య వద్దనియు , తానే క్రీస్తను ఒక రాజుననియు చెప్పగా మేము వింటిమని ఆయనమీద నేరము మోపసాగిరి .

3

పిలాతు నీవు యూదుల రాజువా అని ఆయనను అడుగగా ఆయన నీ వన్నట్టే అని అతనితో చెప్పెను .

4

పిలాతు ప్రధానయాజకుల తోను జనసమూహములతోను ఈ మనుష్యుని యందు నాకు ఏ నేరమును కనబడ లేదనెను .

లూకా 23:24-4
ఆదికాండము 49:10

షిలోహు వచ్చువరకు యూదా యొద్దనుండి దండము తొలగదు అతని కాళ్ల మధ్యనుండి రాజదండము తొలగదు ప్రజలు అతనికి విధేయులైయుందురు.

అపొస్తలుల కార్యములు 4:27

ఏవి జరుగవలెనని నీ హస్తమును నీ సంకల్పమును ముందు నిర్ణయించెనో,

అపొస్తలుల కార్యములు 23:26

యూదులు ఈ మనుష్యుని పట్టుకొని చంపబోయినప్పుడు, అతడు రోమీయుడని నేను విని, సైనికులతో వచ్చి అతనిని తప్పించితిని.

అపొస్తలుల కార్యములు 24:27

రెండు సంవత్సరములైన తరువాత ఫేలిక్సుకు ప్రతిగా పోర్కియు ఫేస్తు వచ్చెను. అప్పుడు ఫేలిక్సు యూదులచేత మంచి వాడనిపించుకొనవలెనని కోరి, పౌలును బంధకములలోనే విడిచిపెట్టి పోయెను.

అపొస్తలుల కార్యములు 26:30

అంతట రాజును అధిపతియు బెర్నీకేయు వారితోకూడ కూర్చుండినవారును లేచి అవతలకు పోయి

హేరోదు
లూకా 3:19

అయితే చతుర్థాధిపతియైన హేరోదుచేసిన సకల దుష్కార్యముల నిమిత్తమును, అతని సోదరుని భార్యయైన హేరోదియ నిమిత్తమును, యోహాను అతనిని గద్దించినందుకు

లూకా 9:7

చతుర్థాధిపతియైన హేరోదు జరిగిన కార్యము లన్నిటిని గూర్చి విని, యెటుతోచక యుండెను. ఏలయనగా కొందరు యోహాను మృతులలోనుండి లేచెననియు,

లూకా 23:6-11
6

పిలాతు ఈ మాట విని ఈ మనుష్యుడు గలిలయుడా అని అడిగి

7

ఆయన హేరోదు అధికారము క్రింద ఉన్న ప్రదేశపు వాడని తెలిసికొని హేరోదు నొద్దకు ఆయనను పంపెను . హేరోదు ఆ దినములలో యెరూషలేము లో ఉండెను .

8

హేరోదు యేసును చూచి మిక్కిలి సంతోషించెను . ఆయనను గూర్చి చాల సంగతులు విన్నందున ఆయన ఏదైనను ఒక సూచక క్రియ చేయగా చూడ నిరీక్షించి , బహుకాలమునుండి ఆయనను చూడ గోరెను .

9

ఆయనను చూచినప్పుడు చాల ప్రశ్నలువేసినను ఆయన అతనికి ఉత్తరమేమియు ఇయ్యలేదు .

10

ప్రధానయాజకులును శాస్త్రులును నిలువబడి ఆయనమీద తీక్షణముగా నేరము మోపిరి .

11

హేరోదు తన సైనికులతో కలిసి , ఆయనను తృణీకరించి అపహసించి , ఆయనకు ప్రశస్తమైన వస్త్రము తొడిగించి పిలాతునొద్దకు మరల పంపెను .

అతని
మత్తయి 14:3

ఏలయనగానీవు నీ సోదరుడైన ఫిలిప్పు భార్యయగు హేరోదియను ఉంచుకొనుట న్యాయము కాదని యోహాను చెప్పగా,

మార్కు 6:17

హేరోదు తన సహోదరుడగు ఫిలిప్పు భార్యయైన హేరోదియను పెండ్లిచేసికొనినందున యోహానునీ సహోదరుని భార్యను చేర్చుకొనుట నీకు న్యాయము కాదని హేరోదుతో చెప్పెను గనుక