లెబానో
జెకర్యా 10:10

ఐగుప్తు దేశములోనుండి వారిని మరల రప్పించి అష్షూరు దేశములోనుండి సమకూర్చి, యెక్కడను చోటు చాలనంత విస్తారముగా గిలాదు దేశము లోనికిని లెబానోను దేశము లోనికిని వారిని తోడుకొని వచ్చెదను.

యిర్మీయా 22:6

యూదారాజు వంశస్థులనుగూర్చి యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడునా యెన్నికలో నీవు గిలాదువలెనున్నావు, లెబానోను శిఖరమువలె ఉన్నావు; అయినను నిశ్చయముగా ఎడారిగాను నివాసులు లేని పట్టణములుగాను నేను నిన్ను చేయుదును.

యిర్మీయా 22:7

నీమీదికి వచ్చుటకై యొక్కొక్కడు తన ఆయుధములను పట్టుకొను సంహారకులను నేను ప్రతిష్టించుచున్నాను, వారు నీ దేవదారు చెట్లలో శ్రేష్ఠమైనవాటిని నరికి అగ్నిలో పడవేతురు.

యిర్మీయా 22:23

లెబానోను నివాసినీ, దేవదారు వృక్ష ములలో గూడు కట్టుకొనినదానా, ప్రసవించు స్త్రీకి కలుగు వేదనవంటి కష్టము నీకు వచ్చునప్పుడు నీవు బహుగా కేకలువేయుదువు గదా!

హబక్కూకు 2:8

బహు జనముల ఆస్తిని నీవు కొల్ల పెట్టి యున్నావు గనుక శేషించిన జనులు దేశములకును పట్టణములకును వాటిలోని నివాసులకును నీవు చేసిన నర హత్యనుబట్టియు బలాత్కారమునుబట్టియు నిన్ను కొల్ల పెట్టుదురు.

హబక్కూకు 2:17

లెబానోనునకు నీవు చేసిన బలాత్కారము నీమీదికే వచ్చును,పశువులను బెదరించిన బెదరు నీమీదనే పడును. దేశములకును పట్టణములకును వాటిలోని నివాసులకును నీవు చేసిన నర హత్యనుబట్టియు జరిగిన బలాత్కారమును బట్టియు ఇది సంభవించును.

హగ్గయి 1:8

పర్వతములెక్కి మ్రాను తీసికొని వచ్చి మీరు ఈ మందిరమును కట్టించినయెడల దానియందు నేను సంతోషించి నన్ను ఘనపరచుకొందునని యెహోవా సెలవిచ్చుచున్నాడు.

గ్నివచ్చి నీ దేవదారు వృక్షములను కాల్చివేయునట్లు
జెకర్యా 14:1

ఇదిగో యెహోవా దినము వచ్చుచున్నది, అందు మీయొద్ద దోచబడిన సొమ్ము పట్టణములోనే విభాగింపబడును.

జెకర్యా 14:2

ఏలయనగా యెరూషలేము మీద యుద్ధము చేయుటకు నేను అన్యజను లందరిని సమకూర్చబోవుచున్నాను; పట్టణము పట్టబడును, ఇండ్లు కొల్ల పెట్టబడును, స్త్రీలు చెరుపబడుదురు, పట్టణములో సగముమంది చెరపట్టబడి పోవుదురు; అయితే శేషించువారు నిర్మూలము కాకుండ పట్టణములో నిలుతురు.

ద్వితీయోపదేశకాండమ 32:22

నా కోపాగ్ని రగులుకొనును పాతాళాగాధమువరకు అది దహించును అది భూమిని దాని పంటను కాల్చును పర్వతముల పునాదులను రవులబెట్టును.

మత్తయి 24:1

యేసు దేవాలయమునుండి బయలుదేరి వెళ్లుచుండగా ఆయన శిష్యులు ఆ దేవాలయపు కట్టడములు ఆయనకు చూపింపవచ్చిరి.

మత్తయి 24:2

అందుకాయన– మీరు ఇవన్నియు చూచుచున్నారు గదా; రాతిమీద రాయి యొకటియైనను ఇక్కడ నిలిచియుండకుండ పడద్రోయబడునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానని వారితో అనెను.

లూకా 19:41-44
41

ఆయన పట్టణమునకు సమీపించి నప్పుడు దానిని చూచి దాని విషయమై యేడ్చి

42

–నీవును ఈ నీ దినమందైనను సమాధానసంబంధమైన సంగతులను తెలిసికొనిన యెడల నీకెంతో మేలు; గాని యిప్పుడవి నీ కన్నులకు మరుగు చేయబడియున్నవి.

43

(ప్రభువు) నిన్ను దర్శించిన కాలము నీవు ఎరు గకుంటివి గనుక నీ శత్రువులు నీ చుట్టు గట్టు కట్టి ముట్టడివేసి, అన్ని ప్రక్కలను నిన్ను అరికట్టి, నీ లోనున్న నీ పిల్లలతో కూడ నిన్ను నేల కలిపి

44

నీలో రాతి మీద రాయి నిలిచియుండ నియ్యని దినములు వచ్చునని చెప్పెను.

లూకా 21:23

ఆ దినములలో గర్భిణులకును పాలిచ్చువారికిని శ్రమ. భూమిమీద మిక్కిలి యిబ్బందియు ఈ ప్రజలమీద కోపమును వచ్చును.

లూకా 21:24

వారు కత్తివాత కూలుదురు; చెరపట్టబడిన వారై సమస్తమైన అన్యజనముల మధ్యకు పోవుదురు; అన్యజనముల కాలములు సంపూర్ణమగువరకు యెరూషలేము అన్యజనములచేత త్రొక్కబడును.