ఆ పొడవానికి కలిగిన దినములన్నియు వాడు అపవిత్రుడైయుండును; వాడు అపవిత్రుడు గనుక ప్రత్యేకముగానే నివసింపవలెను; వాని నివాసము పాళెమునకు వెలుపల ఉండవలెను.
మీ దేవుడైన యెహోవా వాక్కును శ్రద్ధగా విని ఆయన దృష్టికి న్యాయమైనది చేసి, ఆయన ఆజ్ఞలకు విధేయులై ఆయన కట్టడలన్నిటిని అనుసరించి నడచినయెడల, నేను ఐగుప్తీయులకు కలుగ జేసిన రోగములలో ఏదియు మీకు రానియ్యను; నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే అనెను.
అది షోమ్రోనులోనున్న ప్రవక్తదగ్గర నా యేలినవాడుండవలెనని నేనెంతో కోరుచున్నాను; అతడు నా యేలినవానికి కలిగిన కుష్ఠరోగమును బాగుచేయునని తన యజమానురాలితో అనెను .
ఇశ్రాయేలు రాజు ఈ పత్రికను చదివి వస్త్రములు చింపుకొని చంపుటకును బ్రతికించుటకును నేను దేవుడనా ? ఒకనికి కలిగిన కుష్ఠరోగమును మాన్పుమని నాయొద్దకు ఇతడు పంపుటయేమి ? నాతో కలహమునకు కారణము అతడు ఎట్లు వెదకుచున్నాడో మీరు ఆలోచించుడనెను .
ఇశ్రాయేలు రాజు తన వస్త్రమును చింపుకొనిన సంగతి దైవ జనుడైన ఎలీషాకు వినబడినప్పుడు అతడు నీ వస్త్రములు నీ వెందుకు చింపుకొంటివి ? ఇశ్రాయేలులో ప్రవక్త యొకడున్నాడని అతనికి తెలియబడునట్లు అతని నాయొద్దకు రానిమ్ము అని రాజునకు వర్తమానము చేసెను .
అతడు పోయి దైవ జనుడు చెప్పినట్లు యొర్దాను నదిలో ఏడు మారులు మునుగగా అతని దేహము పసి పిల్ల దేహమువలెనై అతడు శుద్ధుడాయెను .
ఆయన గాయపరచి గాయమును కట్టును ఆయన గాయముచేయును, ఆయన చేతులే స్వస్థపరచును.
రోగులను స్వస్థపరచుడి, చనిపోయినవారిని లేపుడి, కుష్ఠరోగులను శుద్ధులనుగా చేయుడి, దయ్యములను వెళ్లగొట్టుడి. ఉచితముగా పొందితిరి ఉచితముగా ఇయ్యుడి.
గ్రుడ్డివారు చూపుపొందుచున్నారు, కుంటివారు నడుచుచున్నారు, కుష్ఠరోగులు శుద్ధులగుచున్నారు, చెవిటి వారు వినుచున్నారు, చనిపోయినవారు లేపబడుచున్నారు, బీదలకు సువార్త ప్రకటింపబడుచున్నది.
మరియు ప్రవక్తయైన ఎలీషా కాలమందు ఇశ్రాయేలు లో అనేక కుష్ఠరోగులుం డినను , సిరియ దేశస్థుడైన నయమాను తప్ప మరి ఎవడును శుద్ధి నొంద లేదని నేను మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను .
అప్పుడాయన మీరు వెళ్లి , కన్న వాటిని విన్నవాటిని యోహానుకు తెలుపుడి . గ్రుడ్డివారు చూపు పొందుచున్నారు , కుంటివారు నడుచుచున్నారు , కుష్ఠరోగులు శుద్ధులగుచున్నారు , చెవిటివారు వినుచున్నారు , చనిపోయినవారు లేపబడుచున్నారు , బీదలకు సువార్త ప్రకటింపబడుచున్నది ;
వారిలో ఒకడు తనకు స్వస్థత కలుగుట చూచి
గొప్ప శబ్దముతో దేవుని మహిమ పరచుచు, తిరిగి వచ్చి ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు, ఆయన పాదములయొద్ద సాగిలపడెను; వాడు సమరయుడు.
అందుకు యేసు పదిమంది శుద్ధులైరి కారా; ఆ తొమ్మండుగురు ఎక్కడ?
ఈ అన్యుడు తప్ప దేవుని మహిమపరచుటకు తిరిగి వచ్చినవాడెవడును అగపడలేదా అని చెప్పి
నీవు లేచిపొమ్ము, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరచెనని వానితో చెప్పెను.
అన్యాయస్థులు దేవుని రాజ్యమునకు వారసులు కానేరరని మీకు తెలియదా? మోసపోకుడి; జారులైనను విగ్రహారాధకులైనను వ్యభిచారులైనను ఆడంగితనముగలవారైనను పురుషసంయోగ
దొంగలైనను లోభులైనను త్రాగుబోతులైనను దూషకులైనను దోచుకొనువారైనను దేవుని రాజ్యమునకు వారసులు కానేరరు.
మీలో కొందరు అట్టివారై యుంటిరి గాని, ప్రభువైన యేసు క్రీస్తు నామమునను మన దేవుని ఆత్మయందును మీరు కడుగబడి, పరిశుద్ధపరచబడినవారై నీతిమంతులుగా తీర్చబడితిరి.