మీరు ఇచ్ఛయించిన మస్తకివృక్షమునుగూర్చి వారు సిగ్గుపడుదురు మీకు సంతోషకరములైన తోటలనుగూర్చి మీ ముఖ ములు ఎఱ్ఱబారును
మరియు రాజైన యోషీయా దినములలో యెహోవా నాకీలాగు సెలవిచ్చెనుద్రోహినియగు ఇశ్రాయేలు చేయుకార్యము నీవు చూచితివా? ఆమె ఉన్నతమైన ప్రతి కొండమీదికిని పచ్చని ప్రతి చెట్టు క్రిందికిని పోవుచు అక్కడ వ్యభిచారము చేయుచున్నది.
నీ దేవుడైన యెహోవామీద తిరుగుబాటు చేయుచు, నా మాటను అంగీకరింపక ప్రతి పచ్చని చెట్టు క్రింద అన్యులతో కలిసి కొనుటకు నీవు ఇటు అటు పోయిన నీ దోషము ఒప్పుకొనుము; ఇదే యెహోవా వాక్కు.
తమ విగ్రహముల మధ్యను తాము కట్టిన బలిపీఠముల చుట్టును ఎత్తయిన కొండ లన్నిటి మీదను సకల పర్వతముల నడి కొప్పులమీదను పచ్చని చెట్లన్నిటి క్రిందను , పుష్టిపారిన మస్తకి వృక్షము లన్నిటి క్రిందను , తమ విగ్రహము లన్నిటికి పరిమళ ధూపమువేసిన చోటులన్నిటిలోను పడి వారి జనులు హతులై యుండు కాలమున నేనే యెహోవానై యున్నానని మీరు తెలిసికొందురు .
మరియు నీ వస్త్రములలో కొన్ని తీసి, చిత్రముగా అలకరింపబడిన ఉన్నత స్థలములను ఏర్పరచి, వాటిమీద పండుకొని వ్యభిచారము చేసితివి; అట్టి కార్యములు ఎంతమాత్రమును జరుగకూడనివి, అట్టివియు నిక జరుగవు.
ప్రతి అడ్డదోవను నీ బలిపీఠము కట్టి నీ సౌందర్యమును హేయక్రియకు వినియోగపరచి నీ యొద్దకు వచ్చినవారికందరికిని నీ పాదములు తెరచి వారితో బహుగా వ్యభిచరించితివి.
వారికిచ్చెదనని నేను ప్రమాణ పూర్వకముగా చెప్పిన దేశము లోనికి నేను వారిని రప్పించిన తరువాత, ఎత్తయిన యొక కొండనేగాని , దట్టమైన యొక వృక్షమునేగాని తాము చూచినప్పుడెల్లను బలులు అర్పించుచు , అర్పణలను అర్పించుచు , అక్కడ పరిమళ ధూపము ప్రతిష్ఠించుచు , పానార్పణములు చేయుచు నాకు కోపము పుట్టించిరి.
మీరు పోవుచున్న ఉన్నతస్థలము లేమిటని నేనడిగితిని ; కాబట్టి ఉన్నతస్థలమను పేరు నేటి వరకు వాడుకలో నున్నది.
నీవు నన్ను లక్ష్యము చేయక హిత్తీయుడగు ఊరియా భార్యను నీకు భార్యయగునట్లు తీసికొనినందున నీ యింటివారికి సదాకాలము యుద్ధము కలుగును.
నా మాట ఆలకించుము; యెహోవానగు నేను సెలవిచ్చునదేమనగా నీ యింటివారి మూలముననే నేను నీకు అపాయము పుట్టింతును; నీవు చూచుచుండగా నేను నీ భార్యలను తీసి నీ చేరువ వానికప్పగించెదను.
పగటియందు వాడు వారితో శయనించును. నీవు ఈ కార్యము రహస్యముగా చేసితివి గాని ఇశ్రాయేలీయులందరు చూచుచుండగా పగటియందే నేను చెప్పినదానిని చేయింతును అనెను.
నేను హృదయమున పరస్త్రీని మోహించినయెడల నా పొరుగువాని ద్వారమున నేను పొంచియున్న యెడల
నా భార్య వేరొకని తిరుగలి విసరును గాక ఇతరులు ఆమెను కూడుదురు గాక.
వారు అక్షయుడగు దేవుని మహిమను క్షయమగు మనుష్యులయొక్కయు , పక్షులయొక్కయు , చతుష్పాద జంతువులయొక్కయు , పురుగులయొక్కయు , ప్రతిమాస్వరూపముగా మార్చిరి .
ఈ హేతువుచేత వారు తమ హృదయముల దురాశలను అనుసరించి , తమ శరీరములను పరస్పరము అవమాన పరచుకొనునట్లు దేవుడు వారిని అపవిత్రతకు అప్పగించెను .
అట్టివారు దేవుని సత్యమును అసత్యమునకు మార్చి , సృష్టికర్తకు ప్రతిగా సృష్టమును పూజించి సేవించిరి . యుగముల వరకు ఆయన స్తోత్రార్హుడై యున్నాడు , ఆమేన్ .
అందువలన దేవుడు తుచ్ఛమైన అభిలాషలకు వారిని అప్పగించెను . వారి స్త్రీలు సయితము స్వాభావికమైన ధర్మమును విడిచి స్వాభావిక విరుద్ధమైన ధర్మమును అనుసరించిరి .
అటువలె పురుషులు కూడ స్త్రీయొక్క స్వాభావికమైన ధర్మమును విడిచి , పురుషుల తో పురుషులు అవాచ్యమైనది చేయుచు , తమ తప్పిదమునకు తగిన ప్రతిఫలమును పొందుచు ఒకరియెడల ఒకరు కామతప్తులైరి .
మరియు వారు తమ మనస్సులో దేవునికి చోటియ్య నొల్లకపోయిరి గనుక చేయరాని కార్యములు చేయుటకు దేవుడు భ్రష్ట మనస్సుకు వారినప్పగించెను .