అప్పుడతడు నేను నిలుచున్న చోటునకు వచ్చెను ; అతడు రాగానే నేను మహా భయమొంది సాష్టాంగపడితిని ; అతడు-నర పుత్రుడా , యీ దర్శనము అంత్య కాలమును గూర్చినదని తెలిసికొను మనెను .
ఈ దర్శనము కలుగగా దానియేలను నేను మూర్ఛిల్లి కొన్నాళ్లు వ్యాధిగ్రస్తుడనైయుంటిని ; పిమ్మట నేను కుదురై రాజు కొరకు చేయవలసిన పని చేయుచువచ్చితిని . ఈ దర్శనమును గూర్చి విస్మయముగలవాడనైతిని గాని దాని సంగతి తెలుపగలవాడెవడును లేక పోయెను.
నేను ఒంటరినై యా గొప్ప దర్శనమును చూచితిని ; చూచినందున నాలో బల మేమియు లేకపోయెను , నా సొగసు వికార మాయెను , బలము నా యందు నిలువ లేదు .
నేను అతని మాటలు వింటిని ; అతని మాటలు విని నేను నేలను సాష్టాంగపడి గాఢనిద్ర పొందినవాడనైతిని.
పేతురును అతనితో కూడ ఉన్నవారును నిద్ర మత్తుగా ఉండిరి. వారు మేలుకొనినప్పుడు, ఆయన మహిమను ఆయనతో కూడ నిలిచియున్న యిద్దరు పురుషులను చూచిరి.
ఆయన ప్రార్థన చాలించి లేచి తన శిష్యుల యొద్దకు వచ్చి , వారు దుఃఖము చేత నిద్రించుట చూచి
అప్పుడొకడు చేతితో నన్ను ముట్టి నా మోకాళ్లను అఱ చేతులను నేలమోపి నన్ను నిలువబెట్టి
అప్పుడు నర స్వరూపియగు ఒకడు నా పెదవులను ముట్టగా నేను నోరు తెరచి నాయెదుట నిలిచియున్న వానితో ఇట్లంటిని నా యేలినవాడా , యీ దర్శనమువలన నాకు వేదన కలిగి నందున నా బలము తొలగిపోయెను ,
అతడు మరల నన్ను ముట్టి నన్ను బలపరచి -నీవు బహు ప్రియుడవు , భయ పడకుము ,
ప్రొద్దుగ్రుంకబోయినప్పుడు అబ్రామునకు గాఢనిద్రపట్టెను. భయంకరమైన కటికచీకటి అతని కమ్మగా
గాఢనిద్ర మనుష్యులకు వచ్చు సమయమున రాత్రి కలలవలన పుట్టు తలంపులలో అది కలిగెను.
ఆయన నాతో మాటలాడి నప్పుడు ఆత్మ నాలోనికివచ్చి నన్ను నిలువబెట్టెను ; అప్పుడు నాతో మాటలాడినవాని స్వరము వింటిని .
నాతో మాటలాడుచున్న దూత తిరిగి వచ్చి నిద్రపోయిన యొకని లేపినట్లు నన్ను లేపి
ఇప్పుడైతే దేవుడు మన పితరులకు చేసిన వాగ్దానము విషయమైన నిరీక్షణనుగూర్చి నేను విమర్శింపబడుటకు నిలిచియున్నాను.