ప్రతిష్టించు
యెహెజ్కేలు 45:1-6
1

మీరు చీట్లువేసి దేశమును విభాగించునప్పుడు భూమిలో ఒక భాగమును ప్రతిష్ఠితార్పణముగా యెహోవాకు ప్రతిష్ఠింపవలెను . దానికి ఇరువది యైదు వేల కొల కఱ్ఱల నిడివియు పది వేల కొలకఱ్ఱల వెడల్పును ఉండవలెను, ఈ సరిహద్దు లన్నిటిలోగానున్న భూమి ప్రతిష్ఠితమగును .

2

దానిలో పరిశుద్ధస్థలము నకు ఐదు వందల కొలకఱ్ఱల చచ్చౌకము ఏర్పడవలెను ; దానికి నలుదిశల ఏబది మూరల మైదానముండవలెను ,

3

కొలువబడిన యీ స్థలము నుండి ఇరువది యైదు వేల కొలకఱ్ఱల నిడివియు పది వేల కొలకఱ్ఱల వెడుల్పునుగల యొకచోటు కొలిచివేయవలెను . అందులో మహా పరిశుద్ధస్థలముగా ఉన్న పరిశుద్ధస్థల ముండును .

4

యెహోవాకు పరిచర్యచేయుటకై ఆయన సన్నిధికి వచ్చి పరిచర్యచేయుచున్న యాజకులకు ఏర్పాటైన ఆ భూమి ప్రతిష్ఠిత స్థలముగా ఎంచబడును ; అది వారి యిండ్లకు నివేశమై పరిశుద్ధస్థలమునకు ప్రతిష్ఠితముగా ఉండును . మందిరములో పరిచర్య చేయుచున్న లేవీయులు ఇండ్లు కట్టుకొని నివసించునట్లు

5

ఇరువది యైదు వేల కొలకఱ్ఱల నిడివియు పది వేల కొలకఱ్ఱల వెడల్పును గల యొక ప్రదేశమును వారికి స్వాస్థ్యముగా ఇరువది గదులను ఏర్పాటు చేయవలెను.

6

మరియు పట్టణమునకై అయిదు వేల కొలకఱ్ఱల వెడల్పును ఇరువది యైదు వేల కొలకఱ్ఱల నిడివియుగల యొక ప్రదేశము ఏర్పాటు చేయవలెను. అది ప్రతిష్ఠితమగు భాగమునకు సరిగా ఉండవలెను, ఇశ్రాయేలీయుల కందరికి అది స్వాస్థ్యముగా ఉండును .

పరిశుద్ధస్థలము
యెహెజ్కేలు 48:35

దాని కైవారము పదునెనిమిదివేల కొలకఱ్ఱల పరిమాణము. యెహోవా యుండు స్థలమని నాటనుండి ఆ పట్టణమునకు పేరు.

యెషయా 12:6

సీయోను నివాసీ, ఉత్సాహధ్వని బిగ్గరగా చేయుము నీ మధ్యనున్న ఇశ్రాయేలుయొక్క పరిశుద్ధ దేవుడు ఘనుడై యున్నాడు.

యెషయా 33:20-22
20

ఉత్సవకాలములలో మనము కూడుకొనుచున్న సీయోను పట్టణమును చూడుము నిమ్మళమైన కాపురముగాను తియ్యబడని గుడారముగాను నీ కన్నులు యెరూషలేమును చూచును దాని మేకులెన్నడును ఊడదీయబడవు దాని త్రాళ్లలో ఒక్కటియైనను తెగదు.

21

అచ్చట యెహోవా ప్రభావముగలవాడై మన పక్షముననుండును, అది విశాలమైన నదులును కాలువలును ఉన్న స్థలముగా ఉండును అందులో తెడ్ల ఓడ యేదియు నడువదు గొప్ప ఓడ అక్కడికి రాదు .

22

యెహోవా మనకు న్యాయాధిపతి యెహోవా మన శాసనకర్త యెహోవా మన రాజు ఆయన మనలను రక్షించును.

జెకర్యా 2:11

ఆ దినమున అన్యజనులనేకులు యెహోవాను హత్తుకొని నాకు జనులగుదురు, నేను మీ మధ్య నివాసముచేతును; అప్పుడు యెహోవా నన్ను మీ యొద్దకు పంపియున్నాడని మీరు తెలిసికొందురు.

జెకర్యా 2:12

మరియు తనకు స్వాస్థ్యమని యెహోవా ప్రతిష్ఠితమైన దేశములో యూదాను స్వతంత్రించుకొనును, యెరూషలేమును ఆయన ఇకను కోరుకొనును.

2 కొరింథీయులకు 6:16

దేవుని ఆలయమునకు విగ్రహములతో ఏమిపొందిక? మనము జీవముగల దేవుని ఆలయమై యున్నాము; అందుకు దేవుడీలాగు సెలవిచ్చుచున్నాడు.నేను వారిలో నివసించి సంచరింతును, నేను వారి దేవుడనై యుందును వారు నా ప్రజలైయుందురు.

ఎఫెసీయులకు 2:20-22
20

క్రీస్తుయేసే ముఖ్యమైన మూలరాయియై యుండగా అపొస్తలులును ప్రవక్తలును వేసిన పునాదిమీద మీరు కట్టబడియున్నారు.

21

ప్రతి కట్టడమును ఆయనలో చక్కగా అమర్చబడి, ప్రభువునందు పరిశుద్ధమైన దేవాలయమగుటకు వృద్ధిపొందుచున్నది.

22

ఆయనలో మీరు కూడ ఆత్మమూలముగా దేవునికి నివాసస్థలమై యుండుటకు కట్టబడుచున్నారు.

కొలొస్సయులకు 2:9

ఏలయనగా దేవత్వముయొక్క సర్వపరిపూర్ణత శరీరముగా క్రీస్తునందు నివసించుచున్నది;

ప్రకటన 21:3

అప్పుడు -ఇదిగో దేవుని నివాసము మనుష్యులతో కూడ ఉన్నది, ఆయన వారితో కాపురముండును, వారాయన ప్రజలైయుందురు, దేవుడు తానే వారి దేవుడైయుండి వారికి తోడైయుండును.

ప్రకటన 21:22

దానిలో ఏ దేవాలయమును నాకు కనబడలేదు. సర్వాధికారియైన దేవుడగు ప్రభువును గొఱ్ఱెపిల్లయు దానికి దేవాలయమైయున్నారు.

ప్రకటన 22:3

ఇకమీదట శాపగ్రస్తమైనదేదియు దానిలో ఉండదు, దేవునియొక్కయు గొఱ్ఱెపిల్లయొక్కయు సింహాసనము దానిలో ఉండును.