నేను పరదేశులను అన్యజనులలో క్రూరులను నీ మీదికి రప్పించుచున్నాను , వారు నీ జ్ఞాన శోభను చెరుపుటకై తమ ఖడ్గములను ఒరదీసి నీ సౌందర్యమును నీచపరతురు ,
జనములలో క్రూరులైన పరదేశులు అతనిని నరికి పారవేసిరి , కొండలలోను లోయ లన్నిటిలోను అతని కొమ్మలు పడెను , భూమి యందున్న వాగులలో అతని శాఖలు విరిగి పడెను, భూ జను లందరును అతని నీడను విడిచి అతనిని పడియుండ నిచ్చిరి.
శూరుల ఖడ్గములచేత నేను నీ సైన్యమును కూల్చెదను , వారందరును జనములలో భయంకరులు ; ఐగుప్తీయుల గర్వము నణచివేయగా దాని సైన్య మంతయు లయమగును .
క్రూరముఖము కలిగి వృద్ధులను ¸యౌవనస్థులను కటాక్షింపని జనమును గద్ద యెగిరి వచ్చునట్లు నీమీదికి రప్పించును.
నీ బాధను నీ ప్రయాసమును నీచేత చేయింపబడిన కఠినదాస్యమును కొట్టివేసి యెహోవా నిన్ను విశ్రమింపజేయు దినమున నీవు బబులోనురాజును గూర్చి అపహాస్యపు గీతము ఎత్తి యీలాగున పాడుదువు బాధించినవారు ఎట్లు నశించిపోయిరి? రేగుచుండిన పట్టణము ఎట్లు నాశనమాయెను?
దుష్టుల దుడ్డుకఱ్ఱను మానని హత్యచేత జనములను క్రూరముగా కొట్టిన ఏలికల రాజదండమును యెహోవా విరుగగొట్టియున్నాడు.
వారు ఆగ్రహపడి మానని బలాత్కారముచేత జనములను లోపరచిరి.
నీవు నాకు గండ్రగొడ్డలివంటివాడవు యుద్ధాయుధమువంటివాడవు నీవలన నేను జనములను విరుగగొట్టుచున్నాను నీవలన రాజ్యములను విరుగగొట్టుచున్నాను.
నీవలన గుఱ్ఱములను రౌతులను విరుగగొట్టుచున్నాను. నీవలన రథములను వాటి నెక్కినవారిని విరుగగొట్టుచున్నాను.
నీవలన స్త్రీలను పురుషులను విరుగగొట్టుచున్నాను నీవలన ముసలివారిని బాలురను విరుగగొట్టుచున్నాను నీవలన ¸యవనులను కన్యకలను విరుగగొట్టుచున్నాను.
నీవలన గొఱ్ఱలకాపరులను వారి గొఱ్ఱలమందలను విరుగగొట్టుచున్నాను నీవలన దున్నువారిని వారి దుక్కిటెద్దులను విరుగగొట్టుచున్నాను నీవలన ఏలికలను అధిపతులను విరుగగొట్టుచున్నాను.
ఆలకించుడి , తమవికాని ఉనికిపట్టులను ఆక్రమించవలెనని భూ దిగంతములవరకు సంచరించు ఉద్రేకముగల క్రూరులగు కల్దీయులను నేను రేపు చున్నాను .
వారు ఘోరమైన భీకరజనముగా ఉన్నారు, వారు ప్రభుత్వమును విధులను తమ యిచ్ఛవచ్చినట్లు ఏర్పరచుకొందురు .
వారి గుఱ్ఱములు చిరుతపులుల కంటె వేగముగా పరుగులెత్తును , రాత్రియందు తిరుగులాడు తోడేళ్ల కంటెను అవి చురుకైనవి ; వారి రౌతులు దూరము నుండి వచ్చి తటాలున జొరబడుదురు , ఎరను పట్టుకొనుటకై పక్షిరాజు వడిగా వచ్చునట్లు వారు పరుగులెత్తి వత్తురు .
వెనుక చూడకుండ బలాత్కారము చేయుటకై వారు వత్తురు , ఇసుక రేణువులంత విస్తారముగా వారు జనులను చెర పట్టు కొందురు .
అతని పర్వతములను హతమైనవారితో నింపుదును , నీ కొండలలోను నీ లోయలలోను నీ వాగు లన్నిటిలోను వారు ఖడ్గముచేత హతులై కూలుదురు .
నీవును నీ సైన్యమును నీతోనున్న జనులందరును ఇశ్రాయేలు పర్వతముల మీద కూలుదురు , నానా విధమైన క్రూర పక్షులకును దుష్ట మృగములకును ఆహారముగా నిన్ను ఇచ్చెదను .
ఆ దినమున గోగువారిని పాతిపెట్టుటకై సముద్రమునకు తూర్పుగా ప్రయాణస్థులు పోవు లోయలో ఇశ్రాయేలు దేశమున నేనొక స్థలము ఏర్పరచెదను ; గోగును అతని సైన్య మంతటిని అక్కడి జనులు పాతిపెట్టగా ప్రయాణస్థులు పోవుటకు వీలులేకుండును , ఆ లోయకు హమోన్గోగు అను పేరు పెట్టుదురు.
దేశమును పవిత్రపరచుచు ఇశ్రాయేలీయులు ఏడు నెలలు వారిని పాతిపెట్టుచుందురు .
నేను ఘనత వహించు దినమున దేశపు జను లందరు వారిని పాతిపెట్టుదురు ; దానివలన వారు కీర్తి నొందెదరు ; ఇదే యెహోవా వాక్కు .
దేశమును పవిత్రపరచుటకై దానిలోనున్న కళేబరములను పాతిపెట్టువారిని , దేశమును సంచరించి చూచుచు వారితోకూడ పోయి పాతిపెట్టువారిని నియమించెదరు. ఏడు నెలలైన తరువాత దేశమునందు తనికీ చేసెదరు.
దేశమును సంచరించి చూచువారు తిరుగు లాడుచుండగా మనుష్య శల్య మొకటియైనను కనబడిన యెడల పాతిపెట్టువారు హమోన్గోగు లోయ లో దానిని పాతిపెట్టు వరకు అక్కడ వారేదైన ఒక ఆనవాలు పెట్టుదురు .
మరియు హమోనా అను పేరుగల ఒక పట్టణ ముండును. ఈలాగున వారు దేశమును పవిత్రపరచుదురు .
నర పుత్రుడా , ప్రభువైన యెహోవా సెలవిచ్చునదేమనగా సకలజాతుల పక్షులకును భూ మృగముల కన్నిటికిని యీ సమాచారము తెలియజేయుము నేను మీ కొరకు వధించు బలికి నలుదిక్కులనుండి కూడి రండి ; ఇశ్రాయేలీయుల పర్వతముల మీద నొక గొప్ప బలి జరుగును, మీరు మాంసము తిందురు రక్తము త్రాగుదురు ;
బలాఢ్యుల మాంసము తిందురు , భూపతుల రక్తమును , బాషానులో క్రొవ్విన పొట్లేళ్ల యొక్కయు గొఱ్ఱపిల్లల యొక్కయు మేకలయొక్కయు కోడెలయొక్కయు రక్తము త్రాగుదురు .
నేను మీ కొరకు బలి వధింప బోవుచున్నాను, మీరు కడుపార క్రొవ్వు తిందురు , మత్తు కలుగునంతగా రక్తము త్రాగుదురు .
నే నేర్పరచిన పంక్తిని కూర్చుండి గుఱ్ఱములను రౌతులను బలాఢ్యులను ఆయుధ స్థులను మీరు కడుపార భక్షింతురు, ఇదే ప్రభువగు యెహోవా వాక్కు .
వారిలో చంపబడినవారు బయట వేయబడెదరు వారి శవములు కంపు కొట్టును వారి రక్తమువలన కొండలు కరగిపోవును .
ఆకాశ సైన్య మంతయు క్షీణించును కాగితపు చుట్టవలె ఆకాశవైశాల్యములు చుట్టబడును . ద్రాక్షావల్లినుండి ఆకు వాడి రాలునట్లు అంజూరపుచెట్టునుండి వాడినది రాలునట్లు వాటి సైన్య మంతయు రాలిపోవును .
నిజముగా ఆకాశమందు నా ఖడ్గము మత్తిల్లును ఎదోము మీద తీర్పుతీర్చుటకు నేను శపించిన జనము మీద తీర్పుతీర్చుటకు అది దిగును
యెహోవా ఖడ్గము రక్త మయమగును అది క్రొవ్వుచేత కప్పబడును గొఱ్ఱపిల్లలయొక్కయు మేకలయొక్కయు రక్తము చేతను పొట్లేళ్ల మూత్రగ్రంథులమీది క్రొవ్వుచేతను కప్పబడును ఏలయనగా బొస్రాలో యెహోవా బలి జరిగించును ఎదోము దేశములో ఆయన మహా సంహారము చేయును.
వాటితోకూడ గురుపోతులును వృషభములును కోడెలును దిగిపోవుచున్నవి ఎదోమీయుల భూమి రక్తముతో నానుచున్నది వారి మన్ను క్రొవ్వుతో బలిసియున్నది .
జనులు యెహోవా దృష్టికి పాపము చేసిరి గనుక నేను వారి మీదికి ఉపద్రవము రప్పింపబోవుచున్నాను; వారు గ్రుడ్డి వారివలె నడిచెదరు, వారి రక్తము దుమ్మువలె కారును,వారి మాంసము పెంటవలె పారవేయబడును.
యెహోవా ఉగ్రత దినమున తమ వెండి బంగారములు వారిని తప్పింప లేకపోవును, రోషాగ్నిచేత భూమియంతయు దహింప బడును, హఠాత్తుగా ఆయన భూనివాసులనందరిని సర్వ నాశనము చేయబోవుచున్నాడు.