
యెహోవా యెదుట మౌనముగానుండి ఆయనకొరకు కనిపెట్టుకొనుము. తన మార్గమున వర్థిల్లువాని చూచి వ్యసనపడకుము దురాలోచనలు నెరవేర్చుకొనువాని చూచి వ్యసనపడకుము.
దాని చేసినది నీవే గనుక నోరు తెరవక నేను మౌనినైతిని.
ఊరకుండుడి నేనే దేవుడనని తెలిసికొనుడి అన్యజనులలో నేను మహోన్నతుడనగుదును భూమిమీద నేను మహోన్నతుడనగుదును
ప్రభువైన యెహోవా సెలవిచ్చునదేమనగా మందిరములో వారు పాడు పాటలు ఆ దినమున ప్రలాపములగును, శవములు లెక్కకు ఎక్కువగును, ప్రతి స్థలమందును అవి పారవేయబడును. ఊరకుండుడి.
అయితే యెహోవా తన పరిశు ద్ధాలయములో ఉన్నాడు, ఆయన సన్నిధిని లోకమంతయు మౌనముగా ఉండునుగాక.
వారు ఘోరమైన మరణము నొందెదరు; వారినిగూర్చి రోదనము చేయబడదు, వారు పాతిపెట్టబడక భూమిమీద పెంట వలె పడియుండెదరు, వారు ఖడ్గముచేతను క్షామముచేతను నశించెదరు; వారి శవములు ఆకాశపక్షులకును భూజంతు వులకును ఆహారముగా ఉండును.
యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడునేను ఈ ప్రజలకు నా సమాధానము కలుగనియ్యకయు వారియెడల నా కృపావాత్సల్యములను చూపకయు ఉన్నాను గనుక రోదనముచేయు ఇంటిలోనికి నీవు పోకుము, వారినిగూర్చి అంగలార్చుటకు పోకుము, ఎవరినిని ఓదార్చుటకు వెళ్లకుము; ఇదే యెహోవా వాక్కు
ఘనులేమి అల్పులేమి యీ దేశమందున్నవారు చనిపోయి పాతిపెట్టబడరు, వారి నిమిత్తము ఎవరును అంగలార్చకుందురు, ఎవరును తమ్మును తాము కోసికొనకుందురు, వారి నిమిత్తము ఎవరును తమ్మును తాము బోడి చేసికొనకుందురు.
చచ్చినవారినిగూర్చి జనులను ఓదార్చు టకు అంగలార్పు ఆహారము ఎవరును పంచిపెట్టరు; ఒకని తండ్రి యైనను తల్లియైనను చనిపోయెనని యెవరును వారికి ఓదార్పు పాత్రను త్రాగనియ్యకుందురు.
మీ శిరోభూషణములను తలలమీదనుండి తీయకయు, మీ పాదరక్షలను పాదములనుండి తీయకయు, అంగలార్చకయు, ఏడ్వకయు నుందురు, ఒకని నొకరుచూచి నిట్టూర్పులు విడుచుచు మీరు చేసిన దోషములనుబట్టి మీరు క్షీణించి పోవుదురు.
అప్పుడు మోషే అహరోనును అతని కుమారులైన ఎలియాజరు ఈతామారును వారితో–మీరు చావకుండునట్లును యెహోవా ఈ సర్వసమాజముమీద ఆగ్రహపడకుండునట్లును, మీరు తల విరియబోసికొనకూడదు; బట్టలను చింపుకొనకూడదు కాని, యెహోవా వారిని కాల్చినందుకు మీ సహోదరులైన ఇశ్రాయేలీయుల యింటివారందరు ఏడవ వచ్చును.
ప్రధానయాజకుడగుటకై తన సహోదరులలో ఎవరి తలమీద అభిషేకతైలము పోయబడునో, యాజకవస్త్రములు వేసికొనుటకు ఎవరు ప్రతిష్ఠింపబడునో అతడు తన తలకప్పును తీయరాదు; తన బట్టలను చింపుకొనరాదు;
అయితే దావీదు ఒలీవచెట్ల కొండ యెక్కుచు ఏడ్చుచు, తల కప్పుకొని పాదరక్షలులేకుండ కాలినడకను వెళ్ళెను; అతనియొద్దనున్న జనులందరును తలలు కప్పుకొని యేడ్చుచు కొండ యెక్కిరి.
అప్పుడు నేను చేసినట్లు మీరును చేయుదురు, మీ పెదవులు మూసికొనకయుందురు, జనుల ఆహారమును మీరు భుజింపకయుందురు.
ఆ పొడగల కుష్ఠరోగి వస్త్రములను చింపివేయవలెను; వాడు తల విరియబోసికొనవలెను; వాడు తన పైపెదవిని కప్పుకొని–అపవిత్రుడను అపవిత్రుడను అని బిగ్గరగా పలుకవలెను.
అప్పుడు ధీర్ఘదర్శులు సిగ్గునొందుదురు, సోదెగాండ్రు తెల్లబోవుదురు. దేవుడు తమకు ప్రత్యుత్తర మియ్యకుండుట చూచి నోరు మూసి కొందురు.
యెహోవాకు ద్రాక్షారస పానార్పణమును వారర్పిం పరు వారర్పించు బలులయందు ఆయన కిష్టము లేదు, వారు ఆహారముగా పుచ్చుకొనునది ప్రలాపము చేయువారి ఆహారమువలెనగును, దాని భుజించు వారందరు అపవిత్రులగుదురు; తమ ఆహారము తమకే సరిపడును గాని అది యెహోవా మందిరము లోనికి రాదు.
చచ్చినవారినిగూర్చి జనులను ఓదార్చు టకు అంగలార్పు ఆహారము ఎవరును పంచిపెట్టరు; ఒకని తండ్రి యైనను తల్లియైనను చనిపోయెనని యెవరును వారికి ఓదార్పు పాత్రను త్రాగనియ్యకుందురు.