వెంటాడుదురు
విలాపవాక్యములు 3:52

ఒకడు పక్షిని తరుమునట్లు శత్రువులు నిర్నిమిత్తముగా నన్ను వెనువెంట తరుముదురు.

1 సమూయేలు 24:14

ఇశ్రాయేలీయుల రాజు ఎవని పట్టుకొన బయలుదేరి వచ్చియున్నాడు ? ఏపాటివానిని తరుముచున్నాడు ? చచ్చిన కుక్కను గదా? మిన్నల్లిని గదా?

2 రాజులు 25:4

కల్దీయులు పట్టణ ప్రాకారమును పడగొట్టగా సైనికులు రాత్రియందు రాజు తోటదగ్గర రెండు గోడల మధ్యనున్న ద్వారపు మార్గమున పారిపోయిరి.

2 రాజులు 25:5

అయితే కల్దీయులు పట్టణముచుట్టు ఉండగా రాజు మైదానమునకు పోవుమార్గమున వెళ్లిపోయెను; కల్దీయుల సైన్యము రాజును తరిమి, అతని సైన్యము అతనికి దూరముగా చెదరిపోయినందున యెరికో మైదానమందు అతని పట్టుకొనిరి.

యోబు గ్రంథము 10:16

నేను సంతోషించినయెడల ఎడతెగక నీ ఆశ్చర్యమైన బలమును నీవు నామీద చూపుదువు.

కీర్తనల గ్రంథము 140:11

కొండెములాడువారు భూమిమీద స్థిరపడకుందురుగాక ఆపత్తు బలాత్కారులను తరిమి వారిని పడద్రోయును గాక.

యిర్మీయా 16:16

ఇదే యెహోవా వాక్కు వారిని పట్టుకొనుటకు నేను చాల మంది జాలరులను పిలిపించెదను. తరువాత ప్రతి పర్వతముమీదనుండియు ప్రతి కొండమీద నుండియు మెట్టల సందులలోనుండియు వారిని వేటాడి తోలివేయుటకై అనేకులైన వేటగాండ్రను పిలిపించెదను.

యిర్మీయా 39:4

యూదులరాజైన సిద్కియాయు అతని యోధులందరును వారినిచూచి పారిపోయి, రాజు తోటమార్గమున రెండు గోడల మధ్యనున్న గుమ్మపుమార్గమున పోయిరి గాని రాజు మైదానపు మార్గమున వెళ్లిపోయెను.

యిర్మీయా 39:5

అయితే కల్దీయుల సేనవారిని తరిమి యెరికో దగ్గరనున్న మైదానములలో సిద్కియాను కలిసికొని పట్టుకొని, రాజు అతనికి శిక్ష విధింపవలెనని హమాతు దేశములో రిబ్లా పట్టణము దగ్గరనున్న బబులోనురాజైన నెబుకద్రెజరునొద్దకు వారు సిద్కియాను తీసికొనిపోయిరి

యిర్మీయా 52:7-9
7

పట్టణప్రాకారములు పడగొట్టబడగా సైనికులందరు పారిపోయి రాజుతోటకు దాపైన రెండు గోడల మధ్యనున్న ద్వారపు మార్గమున రాత్రియందు పట్టణములోనుండి బయలువెళ్లిరి; కల్దీయులు పట్టణమును చుట్టుకొని యుండగా సైనికులు యొర్దానునది మార్గముగా తర్లిపోయిరి.

8

కల్దీయుల దండు సిద్కియా రాజును తరిమి యెరికో మైదానములో అతని కలిసికొనగా అతని దండంతయు అతనియొద్దనుండి చెదరిపోయెను.

9

వారు రాజును పట్టుకొని హమాతు దేశమునందలి రిబ్లాపట్టణముననున్న బబులోను రాజునొద్దకు అతని తీసికొనిపోగా అతడు అచ్చటనే సిద్కియా రాజునకు శిక్షవిధించెను.

మా అంత్యదశ సమీపమాయెను
యిర్మీయా 1:12

యెహోవానీవు బాగుగా కనిపెట్టితివి; నేను చెప్పిన వాక్యమును నెరవేర్చుటకు నేను ఆతుర పడుచున్నాననెను.

యిర్మీయా 51:33

ఇశ్రాయేలు దేవుడును సైన్యములకధిపతియునగు యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు బబులోనుపురము చదరముచేయబడిన కళ్లమువలె ఆయెను ఇంక కొంతసేపటికి దానికి కోతకాలము వచ్చును.

యెహెజ్కేలు 7:2-12
2

నర పుత్రుడా , ప్రకటింపుము; ఇశ్రాయేలీయుల దేశమునకు అంతము వచ్చియున్నది , నలు దిక్కుల దేశమునకు అంతము వచ్చేయున్నదని ప్రభువగు యెహోవా సెలవిచ్చుచున్నాడు ; ఇప్పుడు నీకు అంతము వచ్చేయున్నది .

3

నా కోపము నీమీద తెప్పించు నీ ప్రవర్తననుబట్టి నీకు తీర్పుతీర్చి , నీవు చేసిన సమస్త హేయకృత్యముల ఫలము నీమీదికి రప్పించుచున్నాను .

4

నీయెడల కటాక్ష ముంచకయు కనికరము చూపకయు నుందును, నేను యెహోవానై యున్నానని నీ వెరుగునట్లు నీ ప్రవర్తన ఫలము నీవు అనుభవింపజేసెదను , నీ హేయ కృత్యములు నీ మధ్యనే యుండనిత్తును .

5

ప్రభువైన యెహోవా సెలవిచ్చునదేమనగా దురదృష్టము వింతైన దురదృష్టము సంభవించుచున్నది ,

6

అంతము వచ్చుచున్నది , అంతమే వచ్చుచున్నది , అది నీ కొరకు కనిపెట్టుచున్నది , ఇదిగో సమీపమాయెను .

7

దేశ నివాసులారా , మీమీదికి దుర్ది నము వచ్చుచున్నది , సమయము వచ్చుచున్నది , దినము సమీపమాయెను , ఉత్సాహ ధ్వని కాదు శ్రమధ్వనియే పర్వతములమీద వినబడు చున్నది.

8

ఇంక కొంతసేపటికి నేను నా క్రోధమును నీమీద కుమ్మరింతును , నీమీద నా కోపమును నెరవేర్చుచు నీ ప్రవర్తననుబట్టి నీకు తీర్పుతీర్చి , నీ సమస్త హేయకృత్యముల ఫలము నీమీదికి రప్పించెదను .

9

యెహోవానగు నేనే నిన్ను మొత్తువాడనై యున్నానని నీవెరుగునట్లు నీ యెడల కటాక్ష ముంచకయు కనికరము చూపకయు నుందును, నీ ప్రవర్తన ఫలము నీవనుభవింపజేసెదను , నీ హేయకృత్యములు నీ మధ్య నుండనిత్తును .

10

ఇదిగో యిదే ఆ దినము , అది వచ్చేయున్నది , ఆ దుర్దినము ఉదయించు చున్నది , ఆ దండము పూచియున్నది , ఆ గర్వము చిగిరించియున్నది , బలాత్కారము పుట్టి దుష్టులను దండించునదాయెను .

11

వారిలో నైనను వారి గుంపులో నైనను వారి ఆస్తిలో నైనను వారికున్న ప్రభావములో నైనను ఏమియు శేషింపదు.

12

కాలము వచ్చుచున్నది , దినము సమీపమాయెను , వారి సమూహ మంతటి మీద ఉగ్రత నిలిచి యున్నది గనుక కొనువారికి సంతోషముండ పనిలేదు , అమ్మువానికి దుఃఖముండ పనిలేదు .

యెహెజ్కేలు 12:22

నరపుత్రుడా దినములు జరిగిపోవుచున్నవి, ప్రతి దర్శనము నిరర్థకమగుచున్నది అని ఇశ్రాయేలీయుల దేశములో మీరు చెప్పుకొను సామెత యేమిటి?

యెహెజ్కేలు 12:23

కావున నీవు వారికి ఈ మాట తెలియజేయుము ప్రభువగు యెహోవా సెలవిచ్చునదేమనగా ఇకమీదట ఇశ్రాయేలీయులలో ఎవరును ఈ సామెత పలుకకుండ నేను దానిని నిరర్థకము చేసెదను గనుక నీవు వారితో ఇట్లనుము దినములు వచ్చుచున్నవి, ప్రతిదర్శనము నెరవేరును

యెహెజ్కేలు 12:27

నరపుత్రుడా వీనికి కనబడిన దర్శనము నెరవేరుటకు బహుదినములు జరుగవలెననియు బహు కాలము జరిగినతరువాత కలుగు దానిని వీడు ప్రవచించుచున్నాడనియు ఇశ్రాయేలీయులు చెప్పుకొనుచున్నారు గదా

ఆమోసు 8:2
ఆమోసూ , నీకు కనబడుచున్న దేమని నన్నడుగగా -వేసవికాలపు పండ్ల గంప నాకు కనబడుచున్నదని నేనంటిని , అప్పుడు యెహోవా నాతో సెలవిచ్చినదేమనగా -నా జనులగు ఇశ్రాయేలీయులకు అంతము వచ్చేయున్నది , నేనికనువారిని విచారణచేయక మానను .