బాణములు చికిలిచేయుడి కేడెములు పట్టుకొనుడి బబులోనును నశింపజేయుటకు యెహోవా ఆలోచించుచున్నాడు మాదీయుల రాజుల మనస్సును దానిమీదికి రేపుచున్నాడు. అది యెహోవా చేయు ప్రతిదండన తన మందిరమునుగూర్చి ఆయన చేయు ప్రతిదండన.
జిమీ రాజులందరును ఏలాము రాజులందరును మాదీయుల రాజులందరును
యాపెతు కుమారులు గోమెరు మాగోగు మాదయి యావాను తుబాలు మెషెకు తీరసు అనువారు.
యాపెతు కుమారులు; గోమెరు మాగోగు మాదయి యావాను తుబాలు మెషెకు తీరసు అనువారు.
తన యేలుబడియందు మూడవ సంవత్సరమున తన అధిపతులకందరికిని సేవకులకును విందు చేయించెను. పారసీక దేశము యొక్కయు మాద్య దేశముయొక్కయు పరాక్రమశాలులును ఘనులును సంస్థానాధిపతులును అతని సన్నిధినుండగా
మొర్దెకై యొక్క బలమును గూర్చియు, అతడు సామర్థ్యముచేత చేసిన కార్యములన్నిటిని గూర్చియు, రాజు అతనిని ఘనపరచిన సంగతిని గూర్చియు మాదీయులయొక్కయు పారసీకులయొక్కయు రాజ్యసమాచార గ్రంథమందు వ్రాయబడియున్నది.
బెల్షస్సరు ఆజ్ఞ ఇయ్యగా వారు దానియేలునకు ఊదారంగు వస్త్రము తొడిగించి యతని
మెడను బంగారపు హారమువేసి ప్రభుత్వము చేయుటలో నతడు మూడవ యధికారియని చాటించిరి .
ఆ రాత్రియందే కల్దీయుల రాజగు బెల్షస్సరు హతుడాయెను .
మాదీయులయొక్కయు పారసీకులయొక్కయు పద్ధతి ననుసరించి స్థిరమగు శాసనముగా ఉండునట్లు దానిమీద సంతకము చేయుమని మనవిచేసిరి.
నేను ఊలయియను నది ప్రక్కను ఉన్నట్టు నాకు దర్శనము కలిగెను . నేను కన్ను లెత్తి చూడగా , ఒక పొట్టేలు ఆ నది ప్రక్కను నిలిచియుండెను ; దానికి రెండు కొమ్ములు , ఆ కొమ్ములు ఎత్తయినవి గాని యొకటి రెండవ దానికంటె ఎత్తుగా ఉండెను; ఎత్తుగలది దానికి తరువాత మొలిచినది .
ఆ పొట్టేలు కొమ్ముతో పశ్చిమముగాను ఉత్తరముగాను దక్షిణముగాను పొడుచుచుండుట చూచితిని . ఇట్లు జరుగగా దానిని ఎదిరించుటకైనను , అది పట్టకుండ తప్పించుకొనుటకైనను , ఏ జంతువునకును శక్తిలేకపోయెను ; అది తనకిష్టమైనట్టుగా జరిగించుచు బలము చూపుచు వచ్చెను.
నీవు చూచిన రెండు కొమ్ములు గల ఆ పొట్టేలున్నదే , అది మాదీయులయొక్కయు పారసీకులయొక్కయు రాజులను సూచించుచున్నది.
మాదీయుడగు అహష్వేరోషుయొక్క కుమారుడైన దర్యావేషు కల్దీయుల పైన రాజాయెను .