కన్నులెత్తి చుట్టు చూడుము వీరందరు కూడుకొని నీయొద్దకు వచ్చుచున్నారు నీ కుమారులు దూరమునుండి వచ్చుచున్నారు నీ కుమార్తెలు చంకనెత్తబడి వచ్చుచున్నారు.
ఇశ్రాయేలీయుల జన సంఖ్య అ మితమై లెక్క లేని సముద్రపు ఇసుకంత విస్తారమగును ; ఏ స్థలమందు మీరు నా జనులు కారన్నమాట జనులు వారితో చెప్పుదురో ఆ స్థలముననేమీరు జీవముగల దేవుని కుమారులైయున్నారని వారితో చెప్పుదురు .
దేవుడు ఈ రాళ్లవలన అబ్రాహామునకు పిల్లలను పుట్టింపగలడని మీతో చెప్పుచున్నాను.
అయితే పైనున్న యెరూషలేము స్వతంత్రముగా ఉన్నది; అది మనకుతల్లి.
ఇందుకు కనని గొడ్రాలా సంతోషించుము, ప్రసవవేదన పడనిదానా, బిగ్గరగా కేకలువేయుము; ఏలయనగా పెనిమిటిగలదాని పిల్లలకంటె పెనిమిటిలేనిదాని పిల్లలు ఎక్కువమంది ఉన్నారు అని వ్రాయబడియున్నది.
సహోదరులారా, మనమును ఇస్సాకువలె వాగ్దానమునుబట్టి పుట్టిన కుమారులమై యున్నాము.
యెహోవా సీయోనును ఆదరించుచున్నాడు దాని పాడైన స్థలములన్నిటిని ఆదరించి దాని అరణ్యస్థలములను ఏదెనువలె చేయుచున్నాడు దాని యెడారి భూములు యెహోవా తోటవలె నగునట్లు చేయుచున్నాడు ఆనంద సంతోషములును కృతజ్ఞతాస్తుతియు సంగీత గానమును దానిలో వినబడును
గొడ్రాలా, పిల్లలు కననిదానా , జయగీతమెత్తుము ప్రసవవేదన పడనిదానా, జయకీర్తన నెత్తి ఆనంద పడుము సంసారిపిల్లలకంటె విడువబడినదాని పిల్లలు విస్తారమగుదురని యెహోవా సెలవిచ్చుచున్నాడు.
నీ గుడారపు స్థలమును విశాలపరచుము నీ నివాసస్థలముల తెరలు నిరాటంకముగ సాగనిమ్ము, నీ త్రాళ్లను పొడుగుచేయుము నీ మేకులను దిగగొట్టుము.
అప్పుడు యోసేపు పుత్రులు యెహోషువతో మాకేల ఒక్క చీటితో ఒక్క వంతునే స్వాస్థ్యముగా ఇచ్చితివి? మేము ఒక గొప్ప జనమేగదా? ఇదివరకు యెహోవా మమ్మును దీవించెనని మనవిచేయగా
యెహోషువ మీరు గొప్ప జనము గనుక ఎఫ్రాయిమీయులయొక్క మన్యము మీకు ఇరుకుగా నున్న యెడల మీరు అడవికి పోయి అక్కడ పెరిజ్జీయుల దేశములోను రెఫాయీయుల దేశములోను మీకు మీరే చెట్లు నరకుకొనుడని వారితో చెప్పెను.
అందుకు యోసేపు పుత్రులు ఆ మన్యము మాకుచాలదు; అదియుగాక పల్లపుచోటున నివసించు కనానీయులకందరికి, అనగా బేత్షెయానులోనివారికిని దాని పురములలోని వారికిని యెజ్రెయేలు లోయలోని వారికిని ఇనుప రథములున్నవనిరి.
అంతట ప్రవక్తల శిష్యులు ఎలీషా యొద్దకు వచ్చి ఇదిగో నీయొద్ద మాకున్న స్థలము ఇరుకుగా నున్నది;