యెహోవాయే నీకు దేవుడై యున్నాడనియు, నీవు ఆయన మార్గములయందు నడిచి, ఆయన కట్టడలను ఆయన ఆజ్ఞలను ఆయన విధులను అనుసరించి, ఆయన మాట విందుననియు నేడు ఆయనతో మాట యిచ్చితివి.
మరియు యెహోవా నీతో చెప్పినట్లు నీవే తనకు స్వకీయ జనమైయుండి తన ఆజ్ఞలన్నిటిని గైకొందువనియు,
తాను సృజించిన సమస్త జనములకంటె నీకు కీర్తి ఘనత పేరు కలుగునట్లు నిన్ను హెచ్చించుదునని ఆయన సెలవిచ్చినట్లు నీవు నీ దేవుడైన యెహోవాకు ప్రతిష్ఠిత జనమై యుందువనియు యెహోవా ఈ దినమున ప్రకటించెను.
యెహోవా , నేను నిజముగా నీ సేవకుడను , నీ సేవకుడను నీ సేవకురాలి కుమారుడనైయున్నాను నీవు నాకట్లు విప్పియున్నావు .
ఎన్నటికిని మరువబడని నిత్యనిబంధన చేసికొని యెహోవాను కలిసికొందము రండని చెప్పుకొనుచు సీయోనుతట్టు అభిముఖులై ఆచ్చటికి వెళ్లు మార్గము ఏదని అడుగుచు వచ్చెదరు ఇదే యెహోవా వాక్కు.
కాబట్టి ఆ కాలమున అన్యజను లనేకులు వచ్చి సీయోనులోనుండి ధర్మశాస్త్రమును , యెరూషలేములో నుండి యెహోవా వాక్కును బయలువెళ్లును ; యాకోబు దేవుని మందిరము నకు యెహోవా పర్వతము నకు మనము వెళ్లుదము రండి , ఆయన తనమార్గములవిషయమై మనకు బోధించును , మనము ఆయన త్రోవలలో నడుచుకొందము అని చెప్పుకొందురు .
సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చునదేమనగా జనములును అనేక పట్టణముల నివాసులును ఇంకను వత్తురు .
ఒక పట్టణపువారు మరియొక పట్టణపువారి యొద్దకు వచ్చి ఆలస్యముచేయక యెహొవాను శాంతిపరచుటకును , సైన్యములకు అధిపతియగు యెహోవాను వెదకుటకును మనము పోదము రండి అని చెప్పగా వారుమేము ను వత్తుమందురు .
అనేక జనములును బలముగల జనులును యెరూషలేములో సైన్యములకు అధిపతియగు యెహోవాను వెదకుటకును , యెహోవాను శాంతిపరచుటకును వత్తురు .
సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చునదేమనగా ఆ దినములలో ఆయా భాషలు మాటలాడు అన్యజనులలో పదేసి మంది యొక యూదుని చెంగు పట్టుకొని దేవుడు మీకు తోడుగా ఉన్నాడను సంగతి మాకు వినబడినది గనుక మేము మీతో కూడ వత్తుమని చెప్పుదురు .
ఆ మూడవ భాగమును నేను అగ్నిలోనుండి వెండిని తీసి శుద్ధపరచి నట్లు శుద్ధపరతును . బంగారమును శోధించి నట్లు వారిని శోధింతును ; వారు నా నామమునుబట్టి మొఱ్ఱపెట్టగా నేను వారి మొఱ్ఱను ఆలకింతును . వీరు నా జనులని నేను చెప్పుదును , యెహోవా మా దేవుడని వారు చెప్పుదురు .
వారు తమకిష్టము వచ్చినట్లు మా శరీరములమీదను మా పశువులమీదను అధికారము చూపుచున్నారు గనుక మాకు చాల శ్రమలు కలుగుచున్నవి.
మేము ఒప్పుకొని చెప్పినదానినిబట్టి ఒక స్థిరమైన నిబంధనచేసికొని వ్రాయించుకొనగా, మా ప్రధానులును లేవీయులును యాజకులును దానికి ముద్రలు వేసిరి. దానికి ముద్రలు వేసినవారెవరనగా, అధికారియగు హకల్యా కుమారుడైన నెహెమ్యా సిద్కీయా
శెరాయా అజర్యా యిర్మీయా
పషూరు అమర్యా మల్కీయా
హట్టూషు షెబన్యా మల్లూకు.
హారిము మెరేమోతు ఓబద్యా
దానియేలు గిన్నెతోను బారూకు
మెషుల్లాము అబీయా మీయామిను
మయజ్యా బిల్గయి షెమయా వీరందరును యాజకులుగా ఉండువారు
లేవీయులు ఎవరనగా, అజన్యా కుమారుడైన యేషూవ హేనాదాదు కుమారులైన బిన్నూయి కద్మీయేలు
వారి సహోదరులైన షెబన్యా హోదీయా కెలీటా పెలాయా హానాను
మీకా రెహోబు హషబ్యా
జక్కూరు షేరేబ్యా షెబన్యా
హోదీయా బానీ బెనీను అనువారు.
జనులలో ప్రధానులెవరనగా పరోషు పహత్మోయాబు ఏలాము జత్తూ బానీ
బున్నీ అజ్గాదు బేబై
అదోనీయా బిగ్వయి ఆదీను
అటేరు హిజ్కియా అజ్ఞూరు
హోదీయా హాషుము బేజయి
హారీపు అనాతోతు నేబైమగ్పీ
యాషు మెషుల్లాము హెజీరు
మెషేజబెయేలు సాదోకు యద్దూవ
పెలట్యా హానాను అనాయా
హోషేయ హనన్యా హష్షూబు హల్లోహేషు పిల్హా షోబేకు
రెహూము హషబ్నా మయశేయా
అహీయా హానాను ఆనాను
మల్లూకు హారిము బయనా అనువారు.
అయితే జనులలో మిగిలినవారు,
అనగా దేవుని ధర్మశాస్త్రమునకు విధేయులగునట్లు దేశపుజనులలో ఉండకుండ తమ్మును తాము వేరుపరచుకొనిన యాజకులు లేవీయులు ద్వారపాలకులు గాయకులు నెతీనీయులు అందరును, దేవుని దాసుడైన మోషేద్వారా నియమించబడిన దేవుని ధర్మశాస్త్రము ననుసరించి నడుచుకొనుచు, మన ప్రభువైన యెహోవా నిబంధనలను కట్టడలను ఆచరించుదుమని శపథము పూని ప్రమాణము చేయుటకు కూడిరి.
వారి భార్యలు వారి కుమారులు వారి కుమార్తెలు తెలివియు బుద్ధియుగలవారెవరో వారును ఈ విషయములో ప్రధానులైన తమ బంధువులతో కలిసిరి.
ఇదియుగాక మొదట ప్రభువునకును, దేవుని చిత్తమువలన మాకును, తమ్మును తామే అప్పగించుకొనిరి; యింతగా చేయుదురని మేమనుకొనలేదు.
ఈ పద్ధతిచొప్పున నడుచుకొనువారికందరికి, అనగా దేవుని ఇశ్రాయేలునకు సమాధానమును కృపయు కలుగును గాక.
అయితే మీరు చీకటిలోనుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మును పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురముచేయు నిమిత్తము, ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజకసవ