త్రాగుబోతులగు ఎఫ్రాయిమీయుల అతిశయ కిరీటమునకు శ్రమ వాడిపోవుచున్న పుష్పమువంటివారి సుందర భూషణమునకు శ్రమ ద్రాక్షారసమువలన కూలిపోయినవారి ఫలవంతమైన లోయ తలమీదనున్న కిరీటమునకు శ్రమ.
క్షణమాత్రములోనే వారు పాడైపోవుదురు మహాభయముచేత వారు కడముట్ట నశించుదురు.
మేలుకొనినవాడు తాను కన్న కల మరచిపోవునట్లు ప్రభువా, నీవు మేలుకొని వారి బ్రదుకును తృణీకరింతువు.
ఎఫ్రాయిమూ , నిన్ను నేనేమి చేతును ? యూదా , నిన్ను నేనేమి చేతును ? తెల్లవారగానే కనబడు మేఘము ఎగిరిపోవునట్లును, ప్రాతఃకాలమున పడు మంచు ఆరిపోవునట్లును మీ భక్తి నిలువకపోవును .
అరణ్యములో ద్రాక్షపండ్లు దొరికినట్లు ఇశ్రాయేలువారు నాకు దొరికిరి ; చిగురుపెట్టు కాలమందు అంజూరపు చెట్టుమీద తొలి ఫలము దొరికినట్లు మీ పితరులు నాకు దొరికిరి . అయితే వారు బయల్పెయోరు నొద్దకు వచ్చి ఆ లజ్జాకరమైన దేవతకు తమ్మును తాము అప్పగించుకొనిరి ; తాము మోహించినదానివలెనే వారు హేయు లైరి .
ఎఫ్రాయిముయొక్క కీర్తి పక్షివలె ఎగిరిపోవును ; జననమైనను , గర్భముతో ఉండుటయైనను, గర్భము ధరించుటయైనను వారికుండదు.
ఎఫ్రాయిము మొత్తబడెను , వారి వేరు ఎండిపోయెను , వారు ఫల మియ్యరు . వారు పిల్లలు కని నను వారి గర్భనిధిలోనుండివచ్చు సొత్తును నేను నాశనము చేసెదను.
ఎఫ్రాయిము మాటలాడినప్పుడు భయము కలిగెను; అతడు ఇశ్రాయేలువారిలో తన్ను గొప్ప చేసికొనెను; తరువాత బయలు దేవతనుబట్టి అపరాధియై అతడు నాశనమొందెను .
నిజముగా ఎఫ్రాయిము తన సహోదరు లలో ఫలాభివృద్ధినొందును . అయితే తూర్పుగాలి వచ్చును , యెహోవా పుట్టించు గాలి అరణ్యములోనుండి లేచును ; అది రాగా అతని నీటిబుగ్గలు ఎండిపోవును , అతని ఊటలు ఇంకిపోవును , అతని ధననిధులను అతనికి ప్రియమైన వస్తువు లన్నిటిని శత్రువు కొల్లపెట్టును .
ఏలయనగా ఇతడు గడ్డిపువ్వువలె గతించిపోవును.
సూర్యుడుదయించి, వడగాలి కొట్టి, గడ్డిని మాడ్చివేయగా దాని పువ్వు రాలును, దాని స్వరూప సౌందర్యమును నశించును; ఆలాగే ధనవంతుడును తన ప్రయత్నములలో వాడి పోవును.
వేసవికాలపు పండ్లను ఏరుకొనిన తరువాతను, ద్రాక్షపండ్ల పరిగె ఏరుకొనిన తరువాతను ఏలాగుండునో నా స్థితి ఆలాగే యున్నది. ద్రాక్షపండ్ల గెల యొకటియు లేకపోయెను , నా ప్రాణమున కిష్టమైన యొక క్రొత్త అంజూరపుపండైనను లేకపోయెను.
అయితే నీ కోటలన్నియు అకాలపు పండ్లు గల అంజూరపు చెట్లవలె ఉన్నవి; ఒకడు వాటిని కదిలింపగానే పండ్లు తినవచ్చినవానినోట పడును;
పెద్ద గాలిచేత ఊగులాడు అంజూరపు చెట్టునుండి అకాలపు కాయలు రాలినట్టు ఆకాశ నక్షత్రములు భూమిమీద రాలెను.