వారికి ఆపదలను విస్తరింపజేసెదను వారిమీద నా బాణములన్నిటిని వేసెదను.
వారు కరవుచేత క్షీణించుదురు మంటచేతను క్రూరమైన హత్యచేతను హరించి పోవుదురు బురదలో ప్రాకు పాముల విషమును మృగముల కోరలను వారిమీదికి రప్పించెదను.
బయట ఖడ్గమును లోపట భయమును ¸యవనులను కన్యకలను శిశువులను నెరిసిన తలవెండ్రుకలుగలవారిని నశింపజేయును.
వారిని దూరమునకు చెదరగొట్టెదను వారి పేరు మనుష్యులలో లేకుండ చేసెదననుకొందును వారి విరోధులు నిజము గ్రహింపకుందురేమో
అప్పుడు యెహోవా ఇశ్రాయేలీయుల యెదుట వారిని కలవరపరచగా యెహోషువ గిబియోను నెదుట మహా ఘోరముగా వారిని హతముచేసెను. బేత్‌హోరోనుకు పైకి పోవుమార్గమున అజేకావరకును మక్కేదావరకును యోధులు వారిని తరిమి హతము చేయుచు వచ్చిరి.
మరియు వారు ఇశ్రాయేలీయుల యెదుటనుండి బేత్‌హోరోనుకు దిగిపోవుత్రోవను పారిపోవుచుండగా, వారు అజేకాకు వచ్చువరకు యెహోవా ఆకాశమునుండి గొప్ప వడగండ్లను వారిమీద పడవేసెను గనుక వారు దానిచేత చనిపోయిరి. ఇశ్రాయేలీయులు కత్తివాత చంపిన వారికంటె ఆ వడగండ్లచేత చచ్చినవారు ఎక్కువ మందియయిరి.
వారు ఎదురుముఖములుగా ఏడుదినములు గుడారములు వేసికొని యుండిన తరువాత ఏడవ దినమందు యుద్ధమునకు కలిసికొనగా ఇశ్రాయేలువారు ఒక దినమందే సిరియనుల కాల్బలము లక్షమందిని హతము చేసిరి.
తక్కినవారు ఆఫెకు పట్టణములోనికి పారిపోగా అచ్చటనున్న యొకప్రాకారము శేషించినవారిలో ఇరువది యేడు వేలమంది మీద పడెను. బెన్హదదు పారిపోయి ఆ పట్టణమందు ప్రవేశించి ఆ యాగదులలో చొరగా
వారు వాగురలమీద నడచువారు తమ కాళ్లే వారిని వలలోనికి నడిపించును.
బోను వారి మడిమెను పట్టుకొనును వల వారిని చిక్కించుకొనును.
వారిని చిక్కించుకొనుటకై ఉరి నేలను ఉంచబడును వారిని పట్టుకొనుటకై త్రోవలో ఉచ్చు పెట్టబడును.
నలుదిక్కుల భీకరమైనవి వారికి భయము కలుగజేయును భయములు వారిని వెంటాడి తరుమును.
వారి బలము క్షీణించిపోవును వారిని కూల్చుటకు ఆపద కాచియుండును.
అది వారి దేహ అవయవములను భక్షించును మరణజ్యేష్ఠుడు వారి అవయవములను భక్షించును.
వారి ఆశ్రయమైన వారి గుడారములోనుండి పెరికివేయబడుదురు వారు భీకరుడగు రాజునొద్దకు కొనిపోబడుదురు.
వారికి అన్యులైనవారు వారి గుడారములో నివాసముచేయుదురు వారి నివాసస్థలముమీద గంధకము చల్లబడును.
క్రింద వారి వేళ్లు ఎండిపోవును పైన వారి కొమ్మలు నరకబడును.
ఇనుప ఆయుధము తప్పించుకొనుటకై వారు పారిపోగా ఇత్తడివిల్లు వారి దేహములగుండ బాణములను పోవిడుచును.
ఒకడు సింహము నొద్దనుండి తప్పించుకొనగా ఎలుగుబంటి యెదురైనట్టు , వాడు ఇంటిలోనికి పోయి గోడ మీద చెయ్యి వేయగా పాము వాని కరచినట్టు ఆ దినముండును.
నోవహు వయసుయొక్క ఆరువందల సంవత్సరము రెండవ నెల పదియేడవ దినమున మహాగాధజలముల ఊటలన్నియు ఆ దినమందే విడబడెను, ఆకాశపు తూములు విప్పబడెను.
అప్పుడు యెహోవా సొదొమమీదను గొమొఱ్ఱామీదను యెహోవాయొద్ద నుండి గంధకమును అగ్నిని ఆకాశమునుండి కురిపించి
అందుకు ఎవరిచేతి మీద రాజు ఆనుకొని యుండెనో ఆ యధిపతి యెహోవా ఆకాశమందు కిటికీలు తెరచినను ఆలాగు జరుగునా అని దైవజనునికి ప్రత్యుత్తరమీయగా అతడు నీవు కన్నులార దానిని చూచెదవు గాని దానిని తినకుందువని అతనితో చెప్పెను.
నా కోపాగ్ని రగులుకొనును పాతాళాగాధమువరకు అది దహించును అది భూమిని దాని పంటను కాల్చును పర్వతముల పునాదులను రవలబెట్టును.
అప్పుడు భూమి కంపించి అదిరెను పర్వతముల పునాదులు వణకెను ఆయన కోపింపగా అవి కంపించెను.
యెహోవా, నీ నాసికారంధ్రముల ఊపిరిని నీవు వడిగా విడువగా నీ గద్దింపునకు ప్రవాహముల అడుగు భాగములు కనబడెను. భూమి పునాదులు బయలుపడెను.
కావున భూమి మార్పునొందినను నడిసముద్రములలో పర్వతములు మునిగినను
వాటి జలములు ఘోషించుచు నురుగు కట్టినను ఆ పొంగునకు పర్వతములు కదలినను మనము భయపడము.(సెలా.)