
కోతకాలము రాకమునుపు పువ్వు వాడిపోయిన తరువాత ద్రాక్షకాయ ఫలమగుచుండగా ఆయన పోటకత్తులచేత ద్రాక్షతీగెలను నరికి వ్యాపించు లతాతంతులను కోసివేయును.
అవి కొండలలోని క్రూరపక్షులకును భూమిమీదనున్న మృగములకును విడువబడును వేసవికాలమున క్రూరపక్షులును శీతకాలమున భూమి మీదనున్న మృగములును వాటిని తినును.
నేను చూచినంత వరకు అక్రమమును దున్ని కీడును విత్తువారు దానినే కోయుదురు.
ప్రవక్తలు అబద్ధప్రవచనములు పలికెదరు, యాజకులు వారి పక్షమున ఏలుబడి చేసెదరు, ఆలాగు జరుగుట నా ప్రజలకు ఇష్టము; దాని ఫలము నొందునప్పుడు మీరేమి చేయుదురు?
వారు గాలిని విత్తియున్నారు గనుక ప్రళయవాయువు వారికి కోతయగును ; విత్తినది పైరు కాదు , మొలక కాదు, పంట యెత్తినది అది పంటకు వచ్చినయెడల అన్యులు దాని తినివేతురు .
ఇశ్రాయేలూ , అన్యజనులు సంతోషించునట్లు నీవు సంభ్రమపడి సంతోషింప వద్దు ; నీవు నీ దేవుని విసర్జించి వ్యభిచరించితివి , నీ కళ్లములన్నిటి మీదనున్న ధాన్యమును బట్టి నీవు పడుపుకూలిని ఆశించితివి .
కళ్ళములుగాని గానుగలు గాని వారికి ఆహారము నియ్యవు ; క్రొత్త ద్రాక్షారసము లేకపోవును .
ఎఫ్రాయిమీయులు ఐగుప్తునకు మరలుదురు , అష్షూరు దేశములో వారు అపవిత్రమైన వాటిని తిందురు , యెహోవా దేశములో వారు నివసింప కూడదు .
యెహోవాకు ద్రాక్షారస పానార్పణమును వారర్పిం పరు వారర్పించు బలులయందు ఆయన కిష్టము లేదు , వారు ఆహారముగా పుచ్చుకొనునది ప్రలాపము చేయువారి ఆహారమువలెనగును , దాని భుజించు వారందరు అపవిత్రులగుదురు ; తమ ఆహారము తమకే సరిపడును గాని అది యెహోవా మందిరము లోనికి రాదు .
నీతి ఫలించునట్లు మీరు విత్తనము వేయుడి ప్రేమయను కోత మీరు కోయుడి, యెహోవాను వెదకుటకు ఇదే సమయము గనుక ఆయన ప్రత్యక్షమై మీమీద నీతి వర్షము కురిపించునట్లు ఇదివరకెన్నడును దున్నని బీడుభూమి దున్నుడి .
నీ ప్రవర్తననాధారము చేసికొని నీ బలాఢ్యులను నమ్ముకొని నీవు చెడుతనపు పంటకై దున్నితివి గనుక మీరు పాపమను కోతకోసియున్నారు . అబద్ధమునకు ఫలము పొందియున్నారు .
నీ జనుల మీదికి అల్లరి వచ్చును ; షల్మాను యుద్ధముచేసి బేతర్బేలును పాడుచేసినట్లు ప్రాకారములుగల నీ పట్టణము లన్నియు పాడగును ; పిల్లల మీద తల్లులు నేలను పడవేయబడుదురు .
ఈలాగున మీరు చేసిన ఘోరమైన దుష్టక్రియలను బట్టి బేతేలు మీకు నాశన కారణమగును; ఉదయకాలమున ఇశ్రాయేలు రాజు కొట్టబడి నిర్మూలమగును .
మత్తులారా , మేలుకొని కన్నీరు విడువుడి ద్రాక్షారస పానము చేయువారలారా , రోదనము చేయుడి.క్రొత్త ద్రాక్షారసము మీ నోటికి రాకుండ నాశ మాయెను ,
లెక్క లేని బలమైన జనాంగము నా దేశము మీదికి వచ్చియున్నది వాటి పళ్లు సింహపు కోరలవంటివి వాటి కాటు ఆడుసింహపు కాటువంటిది .
అవి నా ద్రాక్షచెట్లను పాడుచేసి యున్నవి నా అంజూరపు చెట్లను తుత్తునియలుగా కొరికి యున్నవి బెరడు ఒలిచి వాటిని పారవేయగా చెట్లకొమ్మలు తెలుపాయెను
పెనిమిటి పోయిన యౌవనురాలు గోనెపట్ట కట్టుకొని అంగలార్చునట్లు నీవు అంగలార్చుము .
నైవేద్యమును పానార్పణమును యెహోవా మందిరములోనికి రాకుండ నిలిచి పోయెను . యెహోవాకు పరిచర్యచేయు యాజకులు అంగలార్చు చున్నారు .
పొలము పాడైపోయెను భూమి అంగలార్చుచున్నది ధాన్యము నశించెను క్రొత్త ద్రాక్షారసము లేకపోయెను తైలవృక్షములు వాడిపోయెను .
భూమిమీది పైరు చెడిపోయెను గోధుమ కఱ్ఱలను యవల కఱ్ఱలను చూచి సేద్యగాండ్లారా , సిగ్గునొందుడి .ద్రాక్షతోట కాపరులారా , రోదనము చేయుడి .
ద్రాక్షచెట్లు చెడిపోయెను అంజూరపుచెట్లు వాడిపోయెను దానిమ్మచెట్లును ఈతచెట్లును జల్దరుచెట్లును తోట చెట్ల న్నియు వాడిపోయినవి నరులకు సంతోషమేమియు లేకపోయెను .
మోసపోకుడి, దేవుడు వెక్కిరింపబడడు; మనుష్యుడు ఏమివిత్తునో ఆ పంటనే కోయును.
ఏలాగనగా తన శరీరేచ్ఛలనుబట్టి విత్తువాడు తన శరీరమునుండి క్షయమను పంట కోయును,ఆత్మనుబట్టి విత్తువాడు ఆత్మనుండి నిత్యజీవమను పంటకోయును.
కావున ప్రభువగు యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు ఆలకించుడి నా సేవకులు భోజనముచేయుదురు గాని మీరు ఆకలిగొనెదరు నా సేవకులు పానము చేసెదరు గాని మీరు దప్పిగొనెదరు. నా సేవకులు సంతోషించెదరు గాని మీరు సిగ్గుపడెదరు
నా సేవకులు హృదయానందముచేత కేకలు వేసెదరుగాని మీరు చింతాక్రాంతులై యేడ్చెదరు మనోదుఃఖముచేత ప్రలాపించెదరు.
అనేకులు తూర్పునుండియు పడమటనుండియు వచ్చి అబ్రాహాముతో కూడను, ఇస్సాకుతో కూడను, యాకోబుతో కూడను, పరలోకరాజ్యమందు కూర్చుందురు గాని
రాజ్య సంబంధులు వెలుపటి చీకటిలోనికి త్రోయబడుదురు; అక్కడ ఏడ్పును పండ్లు కొరుకుటయు నుండునని మీతో చెప్పుచున్నాననెను.
నీ కాఠిన్యమును , మార్పు పొందని నీ హృదయమును అనుసరించి , ఉగ్రత దినమందు , అనగా దేవుని న్యాయమైన తీర్పు బయలుపరచబడు దినమందు నీకు నీవే ఉగ్రతను సమకూర్చుకొనుచున్నావు .
అయితే భేదములు పుట్టించి , సత్యమునకు లోబడక దుర్నీతికి లోబడువారిమీదికి దేవుని ఉగ్రతయు రౌద్రమును వచ్చును.
దుష్క్యార్యము చేయు ప్రతి మనుష్యుని ఆత్మకు , మొదట యూదునికి గ్రీసుదేశస్థునికికూడ , శ్రమయు వేదనయు కలుగును.