ఆల కించుడి
1 రాజులు 22:19-23
19

మీకాయా యిట్లనెను యెహోవా సెలవిచ్చిన మాట ఆలకించుము; యెహోవా సింహాసనాసీనుడై యుండగా పరలోకసైన్యమంతయు ఆయన కుడి పార్శ్వమునను ఎడమపార్శ్వమునను నిలిచియుండుట నేను చూచితిని

20

అహాబు రామోత్గిలాదుమీదికి పోయి అక్కడ ఓడిపోవునట్లుగా ఎవడు అతనిని ప్రేరేపించునని యెహోవా సెలవియ్యగా, ఒకడు ఈ విధముగాను మరియొకడు ఆ విధముగాను యోచన చెప్పుచుండిరి.

21

అంతలో ఒక ఆత్మ యెదుటికి వచ్చి యెహోవా సన్నిధిని నిలువబడి నేను అతనిని ప్రేరేపించెదననగా యెహోవా ఏ ప్రకారము నీవతని ప్రేరేపించుదువని అతని నడిగెను.

22

అందుకతడు నేను బయలుదేరి అతని ప్రవక్తల నోట అబద్ధమాడు ఆత్మగా ఉందునని చెప్పగా ఆయననీవు అతని ప్రేరేపించి జయము నొందుదువు; పోయి ఆ ప్రకారము చేయుమని అతనికి సెలవిచ్చెను.

23

యెహోవా నిన్నుగూర్చి కీడు యోచించి నీ ప్రవక్తల నోట అబద్ధమాడు ఆత్మను ఉంచియున్నాడు.

ఆమోసు 3:1

ఐగుప్తు దేశమునుండి యెహోవా రప్పించిన ఇశ్రాయేలీ యులారా , మిమ్మునుగూర్చియు ఆయన రప్పించిన కుటుంబమువారి నందరిని గూర్చియు ఆయన సెలవిచ్చిన మాట ఆలకించుడి .

ఆమోసు 3:8

సింహము గర్జించెను , భయ పడని వాడెవడు ? ప్రభువైన యెహోవా ఆజ్ఞ ఇచ్చియున్నాడు, ప్రవచింప కుండు వాడెవడు ?

మీకా 3:8-12
8

నేనైతే యాకోబు సంతతివారికి తమ దోషమును ఇశ్రాయేలీయులకు తమ పాపమును కనుపరచుటకై , యెహోవా ఆత్మావేశముచేత బలముతోను తీర్పు తీర్చు శక్తితోను ధైర్యముతోను నింపబడినవాడనైయున్నాను .

9

యాకోబు సంతతివారి ప్రధానులారా , ఇశ్రాయేలీ యుల యధిపతులారా , న్యాయమును తృణీకరించుచు దుర్నీతిని నీతిగా ఎంచువారలారా, యీ మాట ఆలకించుడి .

10

నరహత్య చేయుటచేత సీయోనును మీరు కట్టుదురు . దుష్టత్వము జరిగించుటచేత యెరూషలేమును మీరు కట్టుదురు.

11

జనుల ప్రధానులు లంచము పుచ్చుకొని తీర్పు తీర్చుదురు, వారి యాజకులు కూలికి బోధింతురు , ప్రవక్తలు ద్రవ్యము కొరకు సోదె చెప్పుదురు; అయినను వారు, యెహోవాను ఆధారము చేసికొని యెహోవా మన మధ్యనున్నాడు గదా , యే కీడును మనకు రానే రదని యనుకొందురు .

12

కాబట్టి చేను దున్నబడునట్లు మిమ్మునుబట్టి సీయోను దున్నబడును, యెరూషలేము రాళ్లకుప్పలగును , మందిరమున్న పర్వతము అరణ్యములోని ఉన్నతస్థలములవలె అగును.

సొదొమ
ఆదికాండము 13:13

సొదొమ మనుష్యులు దుష్టులును, యెహోవా దృష్టికి బహు పాపులునైయుండిరి.

ద్వితీయోపదేశకాండమ 32:32

వారి ద్రాక్షావల్లి సొదొమ ద్రాక్షావల్లి అది గొమొఱ్ఱా పొలములలో పుట్టినది. వారి ద్రాక్షపండ్లు పిచ్చి ద్రాక్షపండ్లు వాటి గెలలు చేదైనవి.

యిర్మీయా 9:26

ఐగుప్తీయులను యూదావారిని ఎదోమీయులను అమ్మోనీయులను మోయాబీయులను గడ్డపు ప్రక్క లను కత్తిరించుకొను అరణ్య నివాసులైన వారినందరిని నేను శిక్షించెదను, ఇదే యెహోవా వాక్కు.

యిర్మీయా 23:14

యెరూషలేము ప్రవక్తలు ఘోరమైన క్రియలు చేయగా నేను చూచితిని, వారు వ్యభిచారులు అసత్యవర్తనులు, ఎవడును తన దుర్మార్గతనుండి మరలక దుర్మార్గుల చేతులను బలపరచుదురు, వారందరు నా దృష్టికి సొదొమ వలెనైరి, దాని నివాసులు గొమొఱ్ఱావలెనైరి.

యెహెజ్కేలు 16:46

నీ యెడమ ప్రక్కను నివసించు షోమ్రోనును దాని కుమార్తెలును నీకు అక్కలు , నీ కుడిప్రక్కను నివసించు సొదొమయు దాని కుమార్తెలును నీకు చెల్లెండ్రు .

ఆమోసు 9:7

ఇశ్రాయే లీయులారా , మీరును కూషీయులును నా దృష్టికి సమానులు కారా ? నేను ఐగుప్తు దేశములోనుండి ఇశ్రాయేలీయులను , కఫ్తోరు దేశములో నుండి ఫిలిష్తీయులను , కీరుదేశములోనుండి సిరియనులను రప్పించితిని .

ప్రకటన 11:8

వారి శవములు ఆ మహాపట్టణపు సంత వీధిలో పడియుండును; వానికి ఉపమానరూపముగా సొదొమ అనియు ఐగుప్తు అనియు పేరు; అచ్చట వారి ప్రభువుకూడ సిలువవేయబడెను.