కాబట్టి వెళ్లుము, నేను నీ నోటికి తోడైయుండి, నీవు ఏమి పలుకవలసినది నీకు బోధించెదనని అతనితో చెప్పెను.
కీర్తనల గ్రంథము 25:4

యెహోవా, నీ మార్గములను నాకు తెలియజేయుము నీత్రోవలను నాకు తేటపరచుము.

కీర్తనల గ్రంథము 25:5

నన్ను నీ సత్యము ననుసరింపజేసి నాకు ఉపదేశము చేయుము. నీవే నా రక్షణకర్తవైన దేవుడవు దినమెల్ల నీకొరకు కనిపెట్టుచున్నాను.

కీర్తనల గ్రంథము 32:9

బుద్ధి జ్ఞానములులేని గుఱ్ఱమువలెనైనను కంచరగాడిదవలెనైనను మీరు ఉండకుడి అవి నీ దగ్గరకు తేబడునట్లు వాటి నోరు వారుతోను కళ్లెముతోను బిగింపవలెను.

కీర్తనల గ్రంథము 143:10

నీవే నా దేవుడవు నీ చిత్తానుసారముగా ప్రవర్తించుటకు నాకు నేర్పుము దయగల నీ ఆత్మ సమభూమిగల ప్రదేశమందు నన్ను నడిపించును గాక.

యెషయా 49:2

నా నోరు వాడిగల ఖడ్గముగా ఆయన చేసియున్నాడు తన చేతి నీడలో నన్ను దాచియున్నాడు నన్ను మెరుగుపెట్టిన అంబుగా చేసి తన అంబులపొదిలో మూసిపెట్టియున్నాడు .

యెషయా 50:4

అలసినవానిని మాటలచేత ఊరడించు జ్ఞానము నాకు కలుగునట్లు శిష్యునికి తగిన నోరు యెహోవా నాకు దయచేసి యున్నాడు శిష్యులు వినునట్లుగా నేను వినుటకై ఆయన ప్రతి యుదయమున నాకు విను బుద్ధి పుట్టించుచున్నాడు.

యిర్మీయా 1:9

అప్పుడు యెహోవా చేయి చాపి నా నోరుముట్టి యీలాగు సెలవిచ్చెనుఇదిగో నేను నీ నోట నా మాటలు ఉంచియున్నాను.

మత్తయి 10:19

వారు మిమ్మును అప్పగించునప్పుడు, ఏలాగు మాటాడుదుము? ఏమి చెప్పుదుము? అని చింతింపకుడి; మీరేమి చెప్పవలెనో అది ఆ గడియలోనే మీకను గ్రహింపబడును.

మత్తయి 10:20

మీ తండ్రి ఆత్మ మీలో ఉండి మాటలాడుచున్నాడే గాని మాటలాడువారు మీరు కారు.

మార్కు 13:11

వారు మిమ్మును అప్పగించుటకు కొనిపోవు నప్పుడు మీరుఏమి చెప్పుదుమా అని ముందుగా చింతింపకుడి, ఆ గడియలోనే మీకేది ఇయ్యబడునో అదే చెప్పుడి; చెప్పువాడు పరిశుద్ధాత్మయే గాని మీరు కారు.

లూకా 11:1

ఆయన యొక చోట ప్రార్థన చేయుచుండెను . ప్రార్థన చాలించిన తరువాత ఆయన శిష్యులలో ఒకడు ప్రభువా , యోహాను తన శిష్యులకు నేర్పినట్టుగా మాకును ప్రార్థనచేయ నేర్పుమని ఆయన నడిగెను .

లూకా 12:11

వారు సమాజమందిరముల పెద్దలయొద్దకును అధిపతులయొద్దకును అధికారులయొద్దకును మిమ్మును తీసికొని పోవునప్పుడు మీరు ఏలాగు ఏమి ఉత్తర మిచ్చెదమా , యేమి మాటలాడుదుమా అని చింతిం పకుడి ,

లూకా 12:12

మీరేమి చెప్పవలసినదియు పరిశు ద్ధాత్మ ఆ గడియలోనే మీకు నేర్పుననెను .

లూకా 21:14

కాబట్టి మేమేమి సమాధానము చెప్పుదుమా అని ముందుగా చింతింపకుందుమని మీ మనస్సులో నిశ్చయించుకొనుడి .

లూకా 21:15

మీ విరోధు లందరు ఎదురాడుటకును , కాదనుటకును వీలు కాని వాక్కును జ్ఞానమును నేను మీకు అనుగ్రహింతును .

యోహాను 14:26

ఆదరణకర్త, అనగా తండ్రి నా నామమున పంపబోవు పరిశుద్ధాత్మ సమస్తమును మీకు బోధించి నేను మీతో చెప్పిన సంగతులన్నిటిని మీకు జ్ఞాపకము చేయును.

ఎఫెసీయులకు 6:19

మరియు నేను దేనినిమిత్తము రాయబారినై సంకెళ్లలో ఉన్నానో, ఆ సువార్త మర్మమును ధైర్యముగా తెలియజేయుటకు నేను మాటలాడ నోరుతెరచునప్పుడు