యెహోవా నా ఆశ్రయము, నా కేడెము నా హృదయము ఆయనయందు నమ్మికయుంచెన గనుక నాకు సహాయము కలిగెను. కావున నా హృదయము ప్రహర్షించుచున్నది కీర్తనలతో నేను ఆయనను స్తుతించుచున్నాను.
అయితే ఆయన మూలముగా మీరు క్రీస్తుయేసు నందున్నారు.
అతిశయించువాడు ప్రభువునందే అతిశయింపవలెను అని వ్రాయబడినది నెరవేరునట్లు దేవుని మూలముగా ఆయన మనకు జ్ఞానమును నీతియు పరిశుద్ధతయు విమోచనమునాయెను.
అందుకునా కృప నీకు చాలును, బలహీనతయందు నాశక్తి పరిపూర్ణమగుచున్నదని ఆయన నాతో చెప్పెను. కాగా క్రీస్తు శక్తి నామీద నిలిచియుండు నిమిత్తము, విశేషముగా నా బలహీనతలయందె
నేనెప్పుడు బలహీనుడనో అప్పుడే బలవంతుడను గనుక క్రీస్తు నిమిత్తము నాకు కలిగిన బలహీనతలలోను నిందలలోను ఇబ్బందులలోను హింసలలోను ఉపద్రవములలోను నేను సంతోషించుచున్నాను.
నన్ను బలపరచువాని యందే నేను సమస్తమును చేయగలను .
నా విశ్వాస్యతయు నా కృపయు అతనికి తోడైయుండును . నా నామమునుబట్టి అతని కొమ్ము హెచ్చింపబడును .
భక్తిహీనుల కొమ్ములనన్నిటిని నేను విరుగగొట్టెదను నీతిమంతుల కొమ్ములు హెచ్చింపబడును.
మరియు హన్నా విజ్ఞాపనచేసి యీలాగనెను- నా హృదయము యెహోవాయందు సంతోషించుచున్నది .యెహోవాయందు నాకు మహా బలముకలిగెను నీవలని రక్షణను బట్టి సంతోషించుచున్నాను నావిరోధుల మీద నేను అతిశయపడుదును .
యెహోవాతో వాదించువారు నాశనమగుదురు పరమండలములోనుండి ఆయన వారిపైన యురుమువలె గర్జించును లోకపు సరిహద్దులలో నుండువారికి ఆయన తీర్పు తీర్చును తాను నియమించిన రాజునకు ఆయన బల మిచ్చును తాను అభిషేకించినవానికి అధిక బలము కలుగజేయును.