నీ కుమారు లందరు ఇక్కడనున్నారా అని యెష్షయిని అడుగగా అతడు-ఇంకను కడసారి వాడున్నాడు . అయితే వాడు గొఱ్ఱలను కాయుచున్నాడని చెప్పెను. అందుకు సమూయేలు -నీవు వాని పిలువనంపించుము , అతడిక్కడికి వచ్చు వరకు మనము కూర్చుందమని యెష్షయితో చెప్పగా
అతడు వాని పిలువనంపించి లోపలికి తోడుకొనివచ్చెను . అతడు ఎఱ్ఱనివాడును చక్కని నేత్రములు గలవాడును చూచుటకు సుందరమైనవాడునై యుండెను . అతడు రాగానే-నేను కోరుకొన్నవాడు ఇతడే , నీవు లేచి వానిని అభిషేకించుమని యెహోవా సెలవియ్యగా
నా సేవకుడైన దావీదుచేత నా జనులగు ఇశ్రాయేలీయులను ఫిలిష్తీయుల చేతిలో నుండియు, వారి శత్రువులందరి చేతిలోనుండియు విమోచించెదనని యెహోవా దావీదునుగూర్చి సెలవిచ్చియున్నాడు గనుక మీ కోరిక నెరవేర్చుకొనుడని వారితో చెప్పెను.
నీ తండ్రిని అతని సంతతిని విసర్జించి ఇశ్రాయేలీయులను తన జనులమీద నన్ను అధిపతిగా నిర్ణయించుటకై నన్ను యేర్పరచుకొనిన యెహోవా సన్నిధిని నేనాలాగు చేసితిని; యెహోవా సన్నిధిని నేను ఆట ఆడితిని.
తరువాత అతనిని తొలగించి దావీదును వారికి రాజుగా ఏర్పరచెను. మరియు ఆయననేను యెష్షయి కుమారుడైన దావీదును కనుగొంటిని; అతడు నా యిష్టానుసారుడైన మనుష్యుడు, అతడు నా ఉద్దేశములన్నియు నెరవేర్చునని చెప్పి అతనినిగూర్చి సాక్ష్యమిచ్చెను.
మోషే మిద్యాను యాజకుడైన యిత్రో అను తన మామ మందను మేపుచు, ఆ మందను అరణ్యము అవతలకు తోలుకొని దేవుని పర్వతమైన హోరేబుకు వచ్చెను.
కాగా రమ్ము, నిన్ను ఫరోయొద్దకు పంపెదను; ఇశ్రాయేలీయులైన నా ప్రజలను నీవు ఐగుప్తులోనుండి తోడుకొనిపోవలెననెను.
దావీదు బేత్లెహేములో తన తండ్రి గొఱ్ఱలను మేపుచు సౌలు నొద్దకు తిరిగి పోవుచు వచ్చుచు నుండెను.
ఆ ఫిలిష్తీయుడు ఉదయమునను సాయంత్రమునను బయలు దేరుచు నలువది దినములు తన్ను తాను అగుపరచుకొనుచు వచ్చెను .
యెష్షయి తన కుమారుడైన దావీదును పిలిచి -నీ సహోదరులకొరకు వేయించిన యీ గోధుమలలో ఒక తూమెడును ఈ పది రొట్టెలను తీసికొని దండులోనున్న నీ సహోదరులదగ్గరకు త్వరగా పొమ్ము.
మరియు ఈ పది జున్నుగడ్డలు తీసికొని పోయి వారి సహస్రా ధిపతికిమ్ము ; నీ సహోదరులు క్షేమముగానున్నారో లేదో సంగతి తెలిసికొని వారియొద్దనుండి ఆనవాలొకటి తీసికొని రమ్మనిచెప్పి పంపివేసెను.
సౌలును వారును ఇశ్రాయేలీయు లందరును ఏలా లోయలో ఫిలిష్తీయు లతో యుద్ధము చేయుచుండగా
దావీదు ఉదయమున లేచి ఒక కాపరికి గొఱ్ఱలను అప్పగించి ఆ వస్తువులను తీసికొని యెష్షయి తనకిచ్చిన ఆజ్ఞ చొప్పున ప్రయాణమైపోయెను ; అయితే అతడు కందకమునకు వచ్చునప్పటికి వారును వీరును పంక్తులుగా తీరి, జయము జయమని అరుచుచు యుద్ధమునకు సాగుచుండిరి .
సైన్యము సైన్యమునకు ఎదురై ఇశ్రాయేలీయులును ఫిలిష్తీయులును యుద్ధసన్నద్ధులై బయలుదేరు చుండిరి.
దావీదు తాను తెచ్చిన వస్తువులను సామగ్రిని కనిపెట్టువాని వశముచేసి , పరుగెత్తిపోయి సైన్యములో చొచ్చి కుశలప్రశ్నలు తన సహోదరుల నడిగెను.
అతడు వారితో మాటలాడుచుండగా గాతు ఫిలిష్తీయుడైన గొల్యాతు అను శూరుడు ఫిలిష్తీయుల సైన్యములోనుండి వచ్చి పై చెప్పిన మాటల చొప్పున పలుకగా దావీదు వినెను .
ఇశ్రాయేలీయు లందరు ఆ మనుష్యుని చూచి మిక్కిలి భయపడి వాని యెదుటనుండి పారిపోగా
ఇశ్రాయేలీయులలో ఒకడు -వచ్చుచున్న ఆ మనిషిని చూచితిరే ; నిజముగా ఇశ్రాయేలీయులను తిరస్కరించుటకై వాడు బయలుదేరుచున్నాడు , వానిని చంపినవానికి రాజు బహుగ ఐశ్వర్యము కలుగజేసి తన కుమార్తె నిచ్చి పెండ్లిచేసి వాని తండ్రి ఇంటి వారిని ఇశ్రాయేలీయులలో స్వతంత్రులుగా చేయు ననగా
దావీదు -జీవముగల దేవుని సైన్యములను తిరస్కరించుటకు ఈ సున్నతి లేని ఫిలిష్తీయుడు ఎంతటి వాడు? వాని చంపి ఇశ్రాయేలీయుల నుండి యీ నింద తొలగించిన వానికి బహుమతి యేమని తనయొద్ద నిలిచిన వారి నడుగగా
జనులు -వాని చంపినవానికి ఇట్లి ట్లు చేయబడునని అతని కుత్తరమిచ్చిరి .
అతడు వారి తో మాటలాడునది అతని పెద్ద న్నయగు ఏలీయాబునకు వినబడగా ఏలీయాబునకు దావీదు మీద కోపమువచ్చి అతనితో-నీవిక్కడి కెందుకు వచ్చితివి ? అరణ్యములోని ఆ చిన్న గొఱ్ఱె మందను ఎవరి వశము చేసితివి? నీ గర్వమును నీ హృదయపు చెడుతనమును నే నెరుగుదును ; యుద్ధము చూచుటకే గదా నీవు వచ్చితి వనెను.
అందుకు దావీదు -నేనేమి చేసితిని ? మాట మాత్రము పలికితినని చెప్పి
అతనియొద్దనుండి తొలగి , తిరిగి మరియొకని ఆ ప్రకారమే యడుగగా జనులు వానికి అదేప్రకారము ప్రత్యుత్తరమిచ్చిరి .
దావీదు చెప్పిన మాటలు నలుగురికిని తెలియగా జనులు ఆ సంగతి సౌలు తో తెలియ జెప్పిరి గనుక అతడు దావీదును పిలువ నంపెను .
ఈ ఫిలిష్తీయుని బట్టి యెవరి మనస్సును క్రుంగ నిమిత్తము లేదు . మీ దాసుడనైన నేను వానితో పోట్లాడుదునని దావీదు సౌలు తో అనగా
సౌలు -ఈ ఫిలిష్తీయుని ఎదుర్కొని వానితో పోట్లాడుటకు నీకు బలము చాలదు ; నీవు బాలుడవు , వాడు బాల్యమునుండి యుద్ధాభ్యాసము చేసినవాడని దావీదు తో అనెను .
అందుకు దావీదు సౌలు తో ఇట్లనెను -మీ దాసుడనైన నేను నా తండ్రియొక్క గొఱ్ఱలను కాయుచుండ సింహమును ఎలుగుబంటియును వచ్చి మందలోనుండి ఒక గొఱ్ఱపిల్లను ఎత్తికొని పోవుచుండగ.
నేను దానిని తరిమి చంపి దాని నోటనుండి ఆ గొఱ్ఱను విడిపించితిని ; అది నా మీదికి రాగా దాని గడ్డము పట్టుకొని దానిని కొట్టి చంపితిని .
మీ దాసుడనైన నేను ఆ సింహమును ఎలుగుబంటిని చంపితినే , జీవముగల దేవుని సైన్యములను తిరస్కరించిన యీ సున్నతిలేని ఫిలిష్తీయుడు వాటిలో ఒకదానివలె అగుననియు ,
సింహముయొక్క బలమునుండియు , ఎలుగుబంటి యొక్క బలమునుండియు నన్ను రక్షించిన యెహోవా ఈ ఫిలిష్తీయుని చేతిలోనుండికూడను నన్ను విడిపించుననియు చెప్పెను . అందుకు సౌలు -పొమ్ము ; యెహోవా నీకు తోడుగానుండునుగాక అని దావీదు తో అనెను .
పిమ్మట సౌలు తన యుద్ధవస్త్రములను దావీదునకు ధరింపజేసి , రాగి శిరస్త్రాణమొకటి అతనికి కట్టి , యుద్ధకవచము తొడిగించెను .
ఈ సామగ్రి దావీదునకు వాడుక లేదు గనుక తాను తొడిగిన వాటిపైన కత్తి కట్టుకొని వెళ్ల కలిగినది లేనిది చూచుకొనిన తరువాత దావీదు -ఇవి నాకు వాడుక లేదు , వీటితో నేను వెళ్ల లేనని సౌలు తో చెప్పి వాటిని తీసివేసి
తన కఱ్ఱ చేత పట్టుకొని యేటి లోయలో నుండి అయిదు నున్నని రాళ్లను ఏరుకొని తనయొద్దనున్న చిక్కములో నుంచుకొని వడిసెల చేతపట్టుకొని ఆ ఫిలిష్తీయుని చేరువకు పోయెను.
డాలు మోయు వాడు తనకు ముందు నడువగా ఆ ఫిలిష్తీయుడు బయలుదేరి దావీదు దగ్గరకు వచ్చి
చుట్టు పారచూచి దావీదును కనుగొని , అతడు బాలుడై యెఱ్ఱటివాడును రూపసియునై యుండుట చూచి అతని తృణీకరించెను .
ఫిలిష్తీయుడు -కఱ్ఱ తీసికొని నీవు నా మీదికి వచ్చుచున్నావే , నేను కుక్కనా ? అని దావీదు తో చెప్పి తన దేవతల పేరట దావీదును శపించెను .
నా దగ్గరకు రమ్ము , నీ మాంసమును ఆకాశ పక్షులకును భూ మృగములకును ఇచ్చివేతునని ఆ ఫిలిష్తీయుడు దావీదు తో అనగా
దావీదు -నీవు కత్తియు ఈటెయు బల్లెమును ధరించుకొని నా మీదికి వచ్చుచున్నావు అయితే నీవు తిరస్కరించిన ఇశ్రాయేలీయుల సైన్యములకధిపతియగు యెహోవా పేరట నేను నీమీదికి వచ్చుచున్నాను .
ఈ దినమున యెహోవా నిన్ను నా చేతికి అప్పగించును ; నేను నిన్ను చంపి నీ తల తెగవేతును ; ఇశ్రాయేలీయులలో దేవు డున్నాడని లోక నివాసులందరును తెలిసికొనునట్లు నేను ఈ దినమున ఫిలిష్తీయులయొక్క కళేబరములను ఆకాశ పక్షులకును భూ మృగములకును ఇత్తును .
అప్పుడు యెహోవా కత్తిచేతను ఈటెచేతను రక్షించువాడు కాడని యీ దండు వారందరు తెలిసికొందురు ; యుద్ధము యెహోవాదే ; ఆయన మిమ్మును మా చేతికి అప్పగించునని చెప్పెను.
ఆ ఫిలిష్తీయుడు లేచి దావీదును కలియుటకై అతనికి ఎదురు పోగా దావీదు వానిని ఎదుర్కొనుటకు సైన్యముతట్టు త్వరగా పరుగెత్తిపోయి
తన సంచి లో చెయ్యి వేసి అందులోనుండి రాయి యొకటి తీసి వడిసెలతో విసరి ఆ ఫిలిష్తీయుని నుదుట కొట్టెను . ఆ రాయి వాని నుదురు చొచ్చినందున వాడు నేలను బోర్లపడెను .
దావీదు ఫిలిష్తీయుని కంటె బలాఢ్యుడై ఖడ్గము లేకయే వడిసెలతోను రాతితోను ఆ ఫిలిష్తీయుని కొట్టి చంపెను .
వాడు బోర్లపడగా దావీదు పరుగెత్తిపోయి ఫిలిష్తీయుని మీద నిలుచుండి వాని కత్తి వర దూసి దానితో వాని చంపి వాని తలను తెగవేసెను . ఫిలిష్తీయులు తమ శూరుడు చచ్చుట చూచి పారిపోయిరి .
అప్పుడు ఇశ్రాయేలు వారును యూదావారును లేచి -జయము జయమని అరచుచు లోయ వరకును షరాయిము ఎక్రోను వరకును ఫిలిష్తీయులను తరుమగా ఫిలిష్తీయులు హతులై షరాయిము ఎక్రోను మార్గమున గాతు ఎక్రోను అను పట్టణములవరకు కూలిరి .
అప్పుడు ఇశ్రాయేలీయులు ఫిలిష్తీయులను తరుముట మాని తిరిగి వచ్చి వారి డేరాలను దోచుకొనిరి .
అయితే దావీదు ఆ ఫిలిష్తీయుని ఆయుధములను తన డేరాలో ఉంచుకొని అతని తలను తీసికొని యెరూషలేమునకు వచ్చెను .
కాబట్టి నీవు నా సేవకుడగు దావీదుతో ఈలాగు చెప్పుము సైన్యములకధిపతియగు యెహోవా నీకు సెలవిచ్చునదేమనగా గొఱ్ఱల కాపులోనున్న నిన్ను గొఱ్ఱలదొడ్డిలోనుండి తీసి ఇశ్రాయేలీయులను నా జనులమీద అధిపతిగా నియమించితిని.
ఏలీయా అచ్చటనుండి పోయిన తరువాత అతనికి షాపాతు కుమారుడైన ఎలీషా కనబడెను. అతడు తన ముందరనున్న పండ్రెండు అరకల యెడ్లచేత దుక్కి దున్నించుచు పండ్రెండవ అరక తాను తోలుచుండెను. ఏలీయా అతని చేర బోయి తన దుప్పటి అతనిమీద వేయగా
అతడు ఎడ్లను విడిచి ఏలీయా వెంట పరుగెత్తి నేను పోయి నా తలిదండ్రులను ముద్దుపెట్టుకొని తిరిగి వచ్చి నిన్ను వెంబడించెదనని చెప్పి అతనిని సెలవడుగగా అతడుపోయి రమ్ము, నావలన నీకు నిర్బంధము లేదని చెప్పెను.
యేసు గలిలయ సముద్రతీరమున నడుచుచుండగా, పేతురనబడిన సీమోను అతని సహోదరుడైన అంద్రెయ అను ఇద్దరు సహోదరులు సముద్రములో వలవేయుట చూచెను; వారు జాలరులు.
ఆయననా వెంబడి రండి, నేను మిమ్మును మనుష్యులను పట్టుజాలరులనుగా చేతునని వారితో చెప్పెను;
వెంటనే వారు తమ వలలు విడిచిపెట్టి ఆయనను వెంబడించిరి.
ఆయన అక్కడనుండి వెళ్లి జెబెదయి కుమారుడైన యాకోబు, అతని సహోదరుడైన యోహాను అను మరి యిద్దరు సహోదరులు తమ తండ్రి యైన జెబెదయి యొద్ద దోనెలో తమ వలలు బాగుచేసి కొనుచుండగా చూచి వారిని పిలిచెను.
వంటనే వారు తమ దోనెను తమ తండ్రిని విడిచిపెట్టి ఆయనను వెంబ డించిరి.