దేవుని వలన అతనికి రక్షణ యేమియు దొరకదని నన్నుగూర్చి చెప్పువారు అనేకులు (సెలా.)
నేను చిన్నవాడనై యుంటిని ఇప్పుడు ముసలివాడనై యున్నాను అయినను నీతిమంతులు విడువబడుట గాని వారి సంతానము భిక్షమెత్తుట గాని నేను చూచియుండలేదు.
ఏలయనగా యెహోవా న్యాయమును ప్రేమించువాడు ఆయన తన భక్తులను విడువడు వారెన్నటెన్నటికి కాపాడబడుదురు గాని భక్తిహీనుల సంతానము నిర్మూలమగును.
నన్ను ద్వేషించువారందరు కూడి నామీద గుసగుసలాడుచున్నారు నశింపజేయవలెనని వారు నాకు కీడుచేయ నాలోచించుచున్నారు.
కుదురని రోగము వానికి సంభవించియున్నది వాడు ఈ పడక విడిచి తిరిగిలేవడని చెప్పుకొనుచున్నారు.
నీ దేవుడు ఏమాయెనని నా శత్రువులు దినమెల్ల అడుగుచున్నారు. వారు తమ దూషణలచేత నా యెముకలు విరుచుచున్నారు.
వీడు ఇతరులను రక్షించెను, తన్ను తానే రక్షించుకొనలేడు; ఇశ్రాయేలు రాజుగదా, యిప్పుడు సిలువమీదనుండి దిగినయెడల వాని నమ్ముదుము.
వాడు దేవునియందు విశ్వాసముంచెను, నేను దేవుని కుమారుడనని చెప్పెను గనుక ఆయనకిష్టుడైతే ఆయన ఇప్పుడు వానిని తప్పించునని చెప్పిరి.
ఇంచుమించు మూడు గంటలప్పుడు యేసుఏలీ, ఏలీ, లామా సబక్తానీ అని బిగ్గరగా కేకవేసెను. ఆ మాటకు నా దేవా, నా దేవా నన్నెందుకు చెయ్యి విడిచితివని అర్థము.
తక్కినవారుఊరకుండుడి ఏలీయా అతని రక్షింపవచ్చునేమో చూత మనిరి.
వారు సింహమువలె ముక్కలుగా చీల్చివేయకుండ నన్ను తప్పించుము.
దేవుని మరచువారలారా, దీని యోచించుకొనుడి లేనియెడల నేను మిమ్మును చీల్చివేయుదును తప్పించువాడెవడును లేకపోవును
నేనును నా పితరులును ఇతరదేశముల జనులకందరికిని ఏమేమి చేసితిమో మీరెరుగరా? ఆ దేశ జనుల దేవతలు వారి దేశములను నా చేతిలోనుండి యేమాత్రమైనను రక్షింప చాలియుండెనా?
మీ దేవుడు మిమ్మును నా చేతిలోనుండి విడిపింపగలడనుకొనుటకు, నా పితరులు బొత్తిగా నిర్మూలము చేసిన ఆ యా దేశస్థుల సకల దేవతలలోను తన జనులను నా చేతిలోనుండి విడిపింప గలిగిన దేవుడొకడైన యుండెనా?
బాకాను పిల్లంగ్రోవిని పెద్దవీణను వీణను సుంఫోనీయను విపంచికను సకల విధములగు వాద్య ధ్వనులను మీరు విను సమయములో సాగిలపడి , నేను చేయించిన ప్రతిమకు నమస్కరించుటకు సిద్ధముగా ఉండిన యెడల సరే మీరు నమస్క రింపని యెడల తక్షణమే మండుచున్న వేడిమిగల అగ్ని గుండము లో మీరు వేయబడుదురు ; నా చేతిలో నుండి మిమ్మును విడిపింపగల దేవుడెక్కడ నున్నాడు?