యెహోవామీద నీ భారము మోపుము ఆయన వానిని విడిపించునేమో వాడు ఆయనకు ఇష్టుడు గదా ఆయన వానిని తప్పించు నేమో అందురు.
యెహోవా, నా శ్రమ నీకే తెలిసియున్నది; నన్ను జ్ఞాపకము చేసికొనుము, నన్ను దర్శించుము, నన్ను హింసించువారికి నాకొరకై ప్రతిదండన చేయుము, నీవు దీర్ఘశాంతి కలిగినవాడవై నన్ను కొనిపోకుము, నీ నిమిత్తము నాకు నింద వచ్చుచున్నదని తెలిసి కొనుము.
అయితే వారు నన్ను పంపిన వానిని ఎరుగరు గనుక నా నామము నిమిత్తము వీటినన్నిటిని మీకు చేయుదురు.
నేను వచ్చి వారికి బోధింపకుండినయెడల, వారికి పాపము లేకపోవును; ఇప్పుడైతే వారి పాపమునకు మిషలేదు.
నన్ను ద్వేషించువాడు నా తండ్రినికూడ ద్వేషించుచున్నాడు.
ఎవడును చేయని క్రియలు నేను వారి మధ్య చేయకుండినయెడల వారికి పాపము లేకపోవును; ఇప్పుడైతే వారు నన్నును నా తండ్రిని చూచి ద్వేషించియున్నారు.
అప్పుడు వారు ఆయన ముఖముమీద ఉమి్మవేసి, ఆయనను గుద్దిరి;
కొందరు ఆయనను అర చేతులతో కొట్టిక్రీస్తూ, నిన్ను కొట్టినవాడెవడో ప్రవచింపు మనిరి.
ముండ్ల కిరీటమును అల్లి ఆయన తలకు పెట్టి, ఒక రెల్లు ఆయన కుడి చేతిలోనుంచి, ఆయనయెదుట మోకాళ్లూనియూదుల రాజా, నీకు శుభమని ఆయనను అపహసించి
ఆయన మీద ఉమి్మవేసి, ఆ రెల్లును తీసికొని దానితో ఆయనను తలమీద కొట్టిరి.
మరియు కుడివైపున ఒకడును ఎడమ వైపున ఒకడును ఇద్దరు బందిపోటు దొంగలు ఆయనతో కూడ సిలువవేయ బడిరి.
ఆ మార్గమున వెళ్లుచుండినవారు తలలూచుచు
దేవాలయమును పడగొట్టి మూడు దినములలో కట్టువాడా, నిన్ను నీవే రక్షించుకొనుము; నీవు దేవుని కుమారుడవైతే సిలువమీదనుండి దిగుమని చెప్పుచు ఆయనను దూషించిరి
ఆలాగే శాస్త్రులును పెద్దలును ప్రధానయాజకులును కూడ ఆయనను అపహసించుచు
వీడు ఇతరులను రక్షించెను, తన్ను తానే రక్షించుకొనలేడు; ఇశ్రాయేలు రాజుగదా, యిప్పుడు సిలువమీదనుండి దిగినయెడల వాని నమ్ముదుము.
వాడు దేవునియందు విశ్వాసముంచెను, నేను దేవుని కుమారుడనని చెప్పెను గనుక ఆయనకిష్టుడైతే ఆయన ఇప్పుడు వానిని తప్పించునని చెప్పిరి.
ఆయనతో కూడ సిలువవేయబడిన బందిపోటుదొంగలును ఆలాగే ఆయనను నిందించిరి.
హేరోదు తన సైనికులతో కలిసి , ఆయనను తృణీకరించి అపహసించి , ఆయనకు ప్రశస్తమైన వస్త్రము తొడిగించి పిలాతునొద్దకు మరల పంపెను .
ప్రజలు నిలువబడి చూచుచుండిరి ; అధికారులును వీడు ఇతరులను రక్షించెను ; వీడు దేవుడే ర్పరచుకొనిన క్రీస్తు అయిన యెడల తన్నుతాను రక్షించుకొనునని అపహసించిరి .
అంతట సైనికులు ఆయనయొద్దకు వచ్చి ఆయనకు చిరక నిచ్చి
నీవు యూదుల రాజు వైతే నిన్ను నీవే రక్షించుకొనుమని ఆయనను అపహసించిరి .
మనముకూడ ప్రతిభారమును, సుళువుగా చిక్కులబెట్టు పాపమును విడిచిపెట్టి, విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడునైన యేసువైపు చూచుచు, మన యెదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరుగెత్తుదము. ఆయన తనయెదుట ఉంచబడిన ఆనందముకొరకై అవమానమును నిర్లక్ష్యపెట్టి, సిలువను సహించి, దేవుని సింహాసనముయొక్క కుడిపార్శ్వమున ఆసీనుడైయున్నాడు.