ఎరుగుదును
కీర్తనల గ్రంథము 104:12
వాటి ఒడ్డున ఆకాశపక్షులు వాసము చేయును కొమ్మల నడుమ అవి సునాదము చేయును.
కీర్తనల గ్రంథము 147:9
పశువులకును అరచుచుండు పిల్ల కాకులకును ఆయన ఆహారమిచ్చువాడు.
ఆదికాండము 1:20-22
20

దేవుడు - జీవముకలిగి చలించువాటిని జలములు సమృద్ధిగా పుట్టించును గాకనియు, పక్షులు భూమిపైని ఆకాశవిశాలములో ఎగురును గాకనియు పలికెను.

21

దేవుడు జలములలో వాటి వాటి జాతి ప్రకారము జలములు సమృద్ధిగా పుట్టించిన మహా మత్స్యములను, జీవముకలిగి చలించు వాటినన్నిటిని, దాని దాని జాతి ప్రకారము రెక్కలుగల ప్రతి పక్షిని సృజించెను. అది మంచిదని దేవుడు చూచెను.

22

దేవుడు - మీరు ఫలించి అభివృద్ధిపొంది సముద్ర జలములలో నిండియుండుడనియు, పక్షులు భూమిమీద విస్తరించును గాకనియు, వాటిని ఆశీర్వదించెను.

యోబు గ్రంథము 38:41

తిండిలేక తిరుగులాడుచు కాకి పిల్లలు దేవునికి మొఱ్ఱపెట్టునప్పుడు కాకికి ఆహారము సిద్ధపరచువాడెవడు?

యోబు గ్రంథము 39:13-18
13

నిప్పుకోడి సంతోషముచేత రెక్కలనాడించును. రెక్కలును వెండ్రుకలును దానికున్నందున అది వాత్సల్యము కలదిగానున్నదా?

14

లేదు సుమీ, అది నేలను దాని గుడ్లను పెట్టును ధూళిలో వాటిని కాచును.

15

దేనిపాదమైన వాటిని త్రొక్క వచ్చుననియైనను అడవిజంతువు వాటిని చితక ద్రొక్కవచ్చుననియైనను అనుకొనకయేయున్నది.

16

తన పిల్లలు తనవికానట్టు వాటియెడల అది కాఠిన్యము చూపును దాని కష్టము వ్యర్థమైనను దానికి చింతలేదు

17

దేవుడు దానిని తెలివిలేనిదిగా జేసెను ఆయన దానికి వివేచనాశక్తి ననుగ్రహించియుండలేదు.

18

అది లేచునప్పుడు గుఱ్ఱమును దాని రౌతును తిరస్కరించును.

యోబు గ్రంథము 39:26-30
26

డేగ నీ జ్ఞానముచేతనే ఎగురునా? అది నీ ఆజ్ఞవలననే తన రెక్కలు దక్షిణదిక్కునకు చాచునా?

27

పక్షిరాజు నీ ఆజ్ఞకు లోబడి ఆకాశవీధికెక్కునా? తన గూడు ఎత్తయినచోటను కట్టుకొనునా?

28

అది రాతికొండమీద నివసించును కొండపేటుమీదను ఎవరును ఎక్కజాలని యెత్తు చోటను గూడు కట్టుకొనును.

29

అక్కడనుండియే తన యెరను వెదకును. దాని కన్నులు దానిని దూరమునుండి కనిపెట్టును.

30

దాని పిల్లలు రక్తము పీల్చును హతులైనవారు ఎక్కడనుందురో అక్కడనే అది యుండును.

మత్తయి 6:26

ఆకాశపక్షులను చూడుడి; అవి విత్తవు కోయవు కొట్లలో కూర్చుకొనవు; అయినను మీ పరలోకపు తండ్రి వాటిని పోషించు చున్నాడు; మీరు వాటికంటె బహు శ్రేష్టులు కారా?

మత్తయి 10:29-31
29

రెండు పిచ్చుకలు కాసుకు అమ్మబడును గదా; అయినను మీ తండ్రి సెలవులేక వాటిలో ఒకటైనను నేలను పడదు.

30

మీ తలవెండ్రుకలన్నియు లెక్కింపబడియున్నవి

31

గనుక మీరు భయపడకుడి; మీరనేకమైన పిచ్చుకలకంటె శ్రేష్ఠులు.

లూకా 12:24

కాకుల సంగతి విచారించి చూడుడి . అవి విత్తవు , కోయవు , వాటికి గరిసె లేదు , కొట్టు లేదు ; అయినను దేవుడు వాటిని పోషించుచున్నాడు ; మీరు పక్షుల కంటె ఎంతో శ్రేష్ఠులు .

అడవి
యెషయా 56:9
పొలములోని సమస్త జంతువులారా, అడవిలోని సమస్త మృగములారా, భక్షించుటకు రండి.
యెహెజ్కేలు 14:15

బాటసారులు సంచరింప కుండ ఆ దేశము నిర్జనమై పాడగు నట్లు నేను దానిమీదికి దుష్ట మృగములను రప్పించగా

యెహెజ్కేలు 14:16

ఆ ముగ్గురు దానిలో ఉండినను ఆ దేశము పాడై పోవును ; నా జీవముతోడు వారు తమ్మును మాత్రమే రక్షించుకొందురుగాని కుమాళ్ల నైనను కుమార్తెల నైనను రక్షింప జాలకుందురు , ఇదే ప్రభువగు యెహోవా వాక్కు .