అప్పుడు నేనిట్లనుకొంటిని నా గూటియొద్దనే నేను చచ్చెదను హంసవలె నేను దీర్ఘాయువుగలవాడనవుదును.
నా వేళ్లచుట్టు నీళ్లు వ్యాపించును మంచు నా కొమ్మలమీద నిలుచును.
నాకు ఎడతెగని ఘనత కలుగును నా చేతిలో నా విల్లు ఎప్పటికిని బలముగానుండును.
నేను సర్వదా దొరసానినై యుందునని నీవనుకొని వీటిని ఆలోచింప కపోతివి వాటి ఫలమేమవునో మనస్సునకు తెచ్చుకొనకపోతివి .
వారిట్లందురు నేను ద్రాక్షారసము తెప్పించెదను మనము మద్యము నిండారులగునట్లు త్రాగుదము రండి నేడు జరిగినట్టు రేపు మరి లక్షణముగా జరుగును.
రాజు -బబులోనను ఈ మహా విశాలపట్టణము నా బలా ధికారమును నా ప్రభావ ఘనతను కనపరచుటకై నా రాజధాని నగరముగా నేను కట్టించినది కాదా అని తనలో తాననుకొనెను .
నా ప్రాణముతో ప్రాణమా , అనేక సంవత్సరములకు ,విస్తారమైన ఆస్తి నీకు సమకూర్చబడియున్నది ; సుఖించుము , తినుము , త్రాగుము , సంతోషించుమని చెప్పుకొందునను కొనెను .
నాకు కలిగిన ప్రత్యక్షతలు బహు విశేషముగా ఉన్నందున నేను అత్యధికముగా హెచ్చిపోకుండు నిమిత్తము నాకు శరీరములో ఒక ముల్లు, నేను అత్యధికముగా హెచ్చిపోకుండు నిమిత్తము, నన్ను నలగగొట్టుటకు సాతానుయొక్క దూతగా ఉంచబడెను.
తన ద్రవ్యము వడ్డికియ్యడు నిరపరాధిని చెరుపుటకై లంచము పుచ్చుకొనడు ఈ ప్రకారము చేయువాడు ఎన్నడును కదల్చబడడు.
సదాకాలము యెహోవాయందు నా గురి నిలుపుచున్నాను. ఆయన నా కుడి పార్శ్వమందు ఉన్నాడు గనుక నేను కదల్చబడను.