దాని కుడిచేతిలో దీర్ఘాయువును దాని యెడమచేతిలో ధనఘనతలును ఉన్నవి.
నీతిమంతుని యిల్లు గొప్ప ధననిధి భక్తిహీనునికి కలుగు వచ్చుబడి శ్రమకు కారణము.
నీకాలములో నియమింపబడినది స్థిరముగా నుండును రక్షణ బాహుళ్యమును బుద్ధిజ్ఞానముల సమృద్ధియు కలుగును యెహోవా భయము వారికి ఐశ్వర్యము.
కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెదకుడి; అప్పు డవన్నియు మీకనుగ్రహింపబడును.
దుఃఖపడినవారమైనట్లుండియు ఎల్లప్పుడు సంతోషించువారము; దరిద్రులమైనట్లుండియు అనేకులకు ఐశ్వర్యము కలిగించువారము; ఏమియులేనివారమైనట్లుండియు సమస్తమును కలిగినవారము.
నాకు సమస్తమును సమృద్ధిగా కలిగియున్నది . మీరు పంపిన వస్తువులు ఎపఫ్రొదితు వలన పుచ్చుకొని యేమియు తక్కువలేక యున్నాను ; అవి మనోహరమైన సువాసనయు , దేవునికి ప్రీతికరమును ఇష్టమునైన యాగమునై యున్నవి .
కాగా దేవుడు తన ఐశ్వర్యము చొప్పున క్రీస్తు యేసు నందు మహిమ లో మీ ప్రతి అవసరమును తీర్చును .
సంతుష్టి సహితమైన దైవభక్తి గొప్పలాభసాధనమై యున్నది.
మనమీలోకములోనికి ఏమియు తేలేదు, దీనిలోనుండి ఏమియు తీసికొని పోలేము.
కాగా అన్నవస్త్రములు గలవారమై యుండి వాటితో తృప్తిపొందియుందము .
నీతి సమాధానము కలుగజేయును నీతివలన నిత్యమును నిమ్మళము నిబ్బరము కలుగును. అప్పుడు నా జనుల విశ్రమ స్థలమునందును ఆశ్రయ స్థానములయందును సుఖకరమైన నివాసములయందును నివసించెదరు
వస్త్రమును కొరికివేయునట్లు చిమ్మట వారిని కొరికివేయును బొద్దీక గొఱ్ఱెబొచ్చును కొరికివేయునట్లు వారిని కొరికివేయును అయితే నా నీతి నిత్యము నిలుచును నా రక్షణ తర తరములుండును .
ఆ దినములు తక్కువ చేయబడక పోయిన యెడల ఏ శరీరియు తప్పించుకొనడు. ఏర్పరచ బడినవారి నిమిత్తము ఆ దినములు తక్కువ చేయబడును.
ఆ కాలమందు ఎవడైననుఇదిగో క్రీస్తు ఇక్కడ ఉన్నాడు, అక్కడ ఉన్నాడు అని చెప్పినయెడల నమ్మ కుడి.
అబద్ధపు క్రీస్తులును అబద్ధపు ప్రవక్తలును వచ్చి, సాధ్యమైతే ఏర్పరచబడిన వారిని సహితము మోసపరచుటకై గొప్ప సూచక క్రియలను మహత్కార్యములను కనబరచెదరు.