యథార్థవంతులు
కీర్తనల గ్రంథము 52:6

నీతిమంతులు చూచి భయభక్తులు కలిగి

కీర్తనల గ్రంథము 58:10

ప్రతిదండన కలుగగా నీతిమంతులు చూచి సంతోషించుదురు భక్తిహీనుల రక్తములో వారు తమ పాదములను కడుగుకొందురు.

కీర్తనల గ్రంథము 58:11

కావున నిశ్చయముగా నీతిమంతులకు ఫలము కలుగుననియు నిశ్చయముగా న్యాయము తీర్చు దేవుడు లోకములో నున్నాడనియు మనుష్యులు ఒప్పుకొందురు.

యోబు గ్రంథము 22:19

మన విరోధులు నిశ్చయముగా నిర్మూలమైరనియు వారి సంపదను అగ్ని కాల్చివేసెననియు పలుకుచు

యెషయా 66:10
యెరూషలేమును ప్రేమించువారలారా, మీరందరు ఆమెతో సంతోషించుడి ఆనందించుడి. ఆమెనుబట్టి దుఃఖించువారలారా, మీరందరు ఆమెతో ఉత్సహించుడి
యెషయా 66:11
ఆదరణకరమైన ఆమె స్తన్యమును మీరు కుడిచి తృప్తి నొందెదరు ఆమె మహిమాతిశయము అనుభవించుచు ఆనందించె దరు.
యెషయా 66:14
మీరు చూడగా మీ హృదయము ఉల్లసించును మీ యెముకలు లేతగడ్డివలె బలియును యెహోవా హస్తబలము ఆయన సేవకులయెడల కను పరచబడును ఆయన తన శత్రువులయెడల కోపము చూపును.
iniquity
కీర్తనల గ్రంథము 63:11

రాజు దేవునిబట్టి సంతోషించును. ఆయనతోడని ప్రమాణముచేయు ప్రతివాడును అతిశయిల్లును అబద్ధములాడువారి నోరు మూయబడును.

కీర్తనల గ్రంథము 112:10
భక్తిహీనులు దాని చూచి చింతపడుదురు వారు పండ్లుకొరుకుచు క్షీణించి పోవుదురు భక్తిహీనుల ఆశ భంగమైపోవును.
నిర్గమకాండము 11:7

యెహోవా ఐగుప్తీయులను ఇశ్రాయేలీయులను వేరుపరచునని మీకు తెలియబడునట్లు, మనుష్యులమీదగాని జంతువులమీదగాని ఇశ్రాయేలీయులలో ఎవరిమీదనైనను ఒక కుక్కయు తన నాలుక ఆడించదు.

యోబు గ్రంథము 5:15

బలాఢ్యుల నోటి ఖడ్గమునుండి, వారి చేతిలోనుండి ఆయన దరిద్రులను రక్షించును.

యోబు గ్రంథము 5:16

కావున బీదలకు నిరీక్షణ కలుగును అక్రమము నోరు మూసికొనును.

సామెతలు 10:11

నీతిమంతుని నోరు జీవపు ఊట భక్తిహీనుల నోరు బలాత్కారము మరుగుపరచును.

రోమీయులకు 3:19

ప్రతి నోరు మూయబడునట్లును , సర్వ లోకము దేవుని శిక్షకు పాత్రమగునట్లును , ధర్మశాస్త్రము చెప్పుచున్న వాటి నన్నిటిని ధర్మశాస్త్రమునకు లోనైన వారితో చెప్పుచున్నదని యెరుగుదుము .