నా దేహము పురుగులతోను మంటి పెల్లలతోను కప్పబడియున్నది.నా చర్మము మాని మరల పగులుచున్నది.
నా దినములు నేతగాని నాడెకంటెను వడిగా గతించుచున్నవి నిరీక్షణ లేక అవి క్షయమైపోవుచున్నవి.
నా జీవము వట్టి ఊపిరియే అని జ్ఞాపకముచేసికొనుము.నా కన్ను ఇకను మేలు చూడదు.
నా దినములు కొంచెమే గదా తిరిగి వెలుపలికి రాజాలని దేశమునకు
ఇటు అటు కొట్టుకొనిపోవుచున్న ఆకును నీవు వేధించెదవా?ఎండిపోయిన చెత్తను తరుముదువా?
మురిగి క్షీణించుచున్న వానిచుట్టు చిమ్మటకొట్టిన వస్త్రమువంటివానిచుట్టు గిఱిగీసి వానిని కనిపెట్టుచున్నావు.
నా ప్రాణము సమసిపోయెను నా దినములు తీరెను సమాధి నా నిమిత్తము సిద్ధమైయున్నది.
నీవు నాకు తండ్రివని గోతితోను నీవు నాకు తల్లివని చెల్లెలవని పురుగుతోను నేను మనవి చేయుచున్నాను.
నాకు నిరీక్షణాధారమేది?నా నిరీక్షణ యెవనికి కనబడును?
ధూళిలో విశ్రాంతి దొరకగా అది పాతాళపు అడ్డకమ్ములయొద్దకు దిగుచున్నది.