
బలమునే నడికట్టుగా కట్టుకొనినవాడై తన శక్తిచేత పర్వతములను స్థిరపరచువాడు ఆయనె
ఆయనే సముద్రముల ఘోషను వాటి తరంగముల ఘోషను అణచువాడు జనముల అల్లరిని చల్లార్చువాడు.
వరదలు ఎలుగెత్తెను యెహోవా , వరదలు ఎలుగెత్తెను వరదలు తమ అలలను హోరెత్తునట్లు చేయుచున్నవి
విస్తారజలముల ఘోషలకంటెను బలమైన సముద్ర తరంగముల ఘోషలకంటెను ఆకాశమునందు యెహోవా బలిష్ఠుడు
జలములు తమ సరిహద్దులు మీరకుండునట్లు ఆయన సముద్రమునకు పొలిమేరను ఏర్పరచినప్పుడు భూమియొక్క పునాదులను నిర్ణయించినప్పుడు
అందుకాయన లేచి గాలిని గద్దించి–నిశ్శబ్దమై ఊరకుండు మని సముద్రముతో చెప్పగా, గాలి అణగి మిక్కిలి నిమ్మళ మాయెను.
అప్పుడాయన–మీరెందుకు భయపడు చున్నారు? మీరింకను నమ్మికలేకలేక యున్నారా? అని వారితో చెప్పెను.
వారు మిక్కిలి భయపడి–ఈయన ఎవరో, గాలియు సముద్రమును ఈయనకు లోబడు చున్నవని యొకనితో ఒకడు చెప్పుకొనిరి.
ఈ సంగతులలో ఏ విషయమందును యోబు ఏ పాపమును చేయలేదు, దేవుడు అన్యాయము చేసెనని చెప్పలేదు.
అందుకు యెహోవా అతడు నీ వశముననున్నాడు; అతని ప్రాణము మాత్రము నీవు ముట్టవద్దని సెలవిచ్చెను.
నరుల ఆగ్రహము నిన్ను స్తుతించును ఆగ్రహశేషమును నీవు ధరించుకొందువు.
సముద్రపు పొంగు నణచువాడవు నీవే దాని తరంగములు లేచునప్పుడు నీవు వాటిని అణచివేయుచున్నావు .
నీవు దాని వెళ్లగొట్టినప్పుడు మితముగా దానికి శిక్ష విధించితివి. తూర్పుగాలిని తెప్పించి కఠినమైన తుపాను చేత దాని తొలగించితివి
అక్కడ విస్తారమైన పందుల మంద కొండమీద మేయుచుండెను గనుక, వాటిలో చొచ్చుటకు తమకు సెలవిమ్మని ఆయనను వేడుకొనగా ఆయన సెలవిచ్చెను .
అప్పుడు దయ్యములు ఆ మనుష్యుని విడిచిపోయి పందులలో చొచ్చెను గనుక, ఆ మంద ప్రపాతమునుండి సరస్సులోనికి వడిగా పరుగెత్తి ఊపిరి తిరుగక చచ్చెను .
అతడు ఆదిసర్పమును, అనగా అపవాదియు సాతానును అను ఆ ఘటసర్పమును పట్టుకొని వెయ్యి సంవత్సరములు వానిని బంధించి అగాధములో పడవేసి,
ఆ వెయ్యి సంవత్సరములు గడచువరకు ఇక జనములను మోసపరచకుండునట్లు అగాధమును మూసి దానికి ముద్రవేసెను; అటు పిమ్మట వాడు కొంచెము కాలము విడిచిపెట్టబడవలెను.
వెయ్యి సంవత్సరములు గడచిన తరువాత సాతాను తానున్న చెరలోనుండి విడిపింపబడును.
భూమి నలుదిశలయందుండు జనములను, లెక్కకు సముద్రపు ఇసుకవలె ఉన్న గోగు మాగోగు అనువారిని మోసపరచి వారిని యుద్ధమునకు పోగుచేయుటకై వాడు బయలుదేరును.