నా దినములు
యోబు గ్రంథము 7:6

నా దినములు నేతగాని నాడెకంటెను వడిగా గతించుచున్నవి నిరీక్షణ లేక అవి క్షయమైపోవుచున్నవి.

యోబు గ్రంథము 9:25

పరుగుమీద పోవువానికంటె నా దినములు త్వరగా గతించుచున్నవి క్షేమము లేకయే అవి గతించిపోవుచున్నవి.

యోబు గ్రంథము 9:26

రెల్లుపడవలు దాటిపోవునట్లు అవి జరిగిపోవును ఎరమీదికి విసురున దిగు పక్షిరాజువలె అవి త్వరపడిపోవును.

యెషయా 38:10

నా దినముల మధ్యాహ్నకాలమందు నేను పాతాళ ద్వారమున పోవలసి వచ్చెను. నా ఆయుశ్శేషము పోగొట్టుకొని యున్నాను.

యోచన
సామెతలు 16:9

ఒకడు తాను చేయబోవునది హృదయములో యోచించుకొనును యెహోవా వాని నడతను స్థిరపరచును

సామెతలు 19:21

నరుని హృదయములో ఆలోచనలు అనేకములుగా పుట్టును యెహోవాయొక్క తీర్మానమే స్థిరము.

ప్రసంగి 9:10

చేయుటకు నీ చేతికి వచ్చిన యే పనినైనను నీ శక్తిలోపము లేకుండ చేయుము; నీవు పోవు పాతాళమునందు పనియైనను ఉపాయమైనను తెలివియైనను జ్ఞానమైనను లేదు.

యెషయా 8:10

ఆలోచన చేసికొనినను అది వ్యర్థమగును మాట పలికినను అది నిలువదు. దేవుడు మాతోనున్నాడు.

విలాపవాక్యములు 3:37

ప్రభువు సెలవులేనిది మాట యిచ్చి నెరవేర్చగలవా డెవడు?

రోమీయులకు 1:13

సహో దరులారా , నేను ఇతరులైన అన్యజనులలో ఫలము పొందినట్లు మీలో కూడ ఫలమేదైనను పొందవలెనని అనేక పర్యాయములు మీయొద్దకు రానుద్దేశించితిని; గాని యిది వరకు ఆటంకపర చబడితిని;ఇది మీకు తెలియకుండుట నా కిష్టములేదు

2 కొరింథీయులకు 1:15-17
15

మరియు ఈ నమి్మకగలవాడనై మీకు రెండవ కృపావరము లభించునట్లు మొదట మీయొద్దకు వచ్చి,

16

మీ యొద్దనుండి మాసిదోనియకు వెళ్లి మాసిదోనియ నుండి మరల మీయొద్దకు వచ్చి, మీచేత యూదయకు సాగనంపబడవలెనని ఉద్దేశించితిని.

17

కావున నేనీలాగు ఉద్దేశించి చపలచిత్తుడనుగా నడుచుకొంటినా? అవును అవునని చెప్పుచు, కాదు కాదనునట్టు ప్రవర్తింపవలెనని నా యోచనలను శరీరానుసారముగా యోచించుచున్నానా?

యాకోబు 4:13-15
13

నేడైనను రేపైనను ఒకానొక పట్టణమునకు వెళ్లి అక్కడ ఒక సంవత్సరముండి వ్యాపారముచేసి లాభము సంపాదింతము రండని చెప్పుకొనువారలారా,

14

రేపేమి సంభవించునో మీకు తెలియదు. మీ జీవమేపాటిది? మీరు కొంతసేపు కనబడి అంతలో మాయమైపోవు ఆవిరి వంటివారే.

15

కనుకప్రభువు చిత్తమైతే మనము బ్రదికియుండి ఇది అది చేతమని చెప్పుకొనవలెను.