వాడు దేవునిమీదికి చేయి చాపును సర్వశక్తుడగువానిని ధిక్కరించి మాటలాడును.
మూర్ఖుడై ఆయనను మార్కొనును తన కేడెముల గుబకలతో ఆయనమీదికి పరుగెత్తును.
వాని ముఖము క్రొవ్వు పట్టియున్నది వాని చిరుప్రక్కలపైని క్రొవ్వుకండలు పెరిగియున్నవి.
ఆయన మహావివేకి, అధిక బలసంపన్నుడు ఆయనతో పోరాడ తెగించి హానినొందనివాడెవడు?
ఏలయనగా శరీరానుసారమైన మనస్సు దేవునికి విరోధమైయున్నది ; అది దేవుని ధర్మశాస్త్రమునకు లోబడదు , ఏమాత్రమును లోబడనేరదు .
కాగా శరీర స్వభావము గలవారు దేవుని సంతోషపరచ నేరరు .
దౌర్జన్యము చేయుట నీకు సంతోషమా? దుష్టుల ఆలోచనమీద దయా దృష్టియుంచుట సంతోషమా? నీ హస్తకృత్యములను తృణీకరించుట నీకు సంతోషమా?
దోపిడిగాండ్ర కాపురములు వర్థిల్లును దేవునికి కోపము పుట్టించువారు నిర్భయముగానుందురువారు తమ బాహుబలమే తమకు దేవుడనుకొందురు.
చెడ్డ మాటలు పలుకకుండ నీ నాలుకను కపటమైన మాటలు పలుకకుండ నీ పెదవులను కాచుకొనుము.
యెహోవా సెలవిచ్చునదేమనగా -నన్నుగూర్చి మీరు బహు గర్వపు మాటలు పలికి-నిన్నుగూర్చి యేమి చెప్పితి మని మీరడుగుదురు .
ఎవడైనను నోటికి కళ్లెము పెట్టుకొనక తన హృదయమును మోసపరచుకొనుచు భక్తిగలవాడనని అనుకొనిన యెడల వాని భక్తి వ్యర్థమే.
అనేకవిషయములలో మన మందరము తప్పిపోవుచున్నాము. ఎవడైనను మాటయందు తప్పనియెడల అట్టివాడు లోపము లేనివాడై,తన సర్వశరీరమును స్వాధీనమందుంచుకొన శక్తిగలవాడగ
గుఱ్ఱములు మనకు లోబడుటకై నోటికి కళ్లెముపెట్టి, వాటి శరీరమంతయు త్రిప్పుదుము గదా
ఓడలనుకూడ చూడుడి; అవి ఎంతో గొప్పవై పెనుగాలికి కొట్టుకొని పోబడినను, ఓడ నడుపువాని ఉద్దేశముచొప్పున మిక్కిలి చిన్నదగు చుక్కానిచేత త్రిప్పబడును.
ఆలాగుననే నాలుకకూడ చిన్న అవయవమైనను బహుగా అదిరిపడును. ఎంత కొంచెము నిప్పు ఎంత విస్తారమైన అడవిని తగులబెట్టును!
నాలుక అగ్నియే, నాలుక మన అవయవములలో ఉంచబడిన పాపప్రపంచమై సర్వశరీరమునకు మాలిన్యము కలుగజేయుచు, ప్రకృతి చక్రమునకు చిచ్చుపెట్టును; అది నరకముచేత చిచ్చు పెట్టబడును.