
ఇశ్రాయేలు రాజును ఏలా కుమారుడునైన హోషేయ యేలుబడిలో మూడవ సంవత్సరమందు యూదా రాజును ఆహాజు కుమారుడునైన హిజ్కియా యేలనారంభించెను.
అతడు ఏలనారంభించినప్పుడు ఇరువది యయిదేం డ్లవాడై యెరూషలేమునందు ఇరువది తొమ్మిది సంవత్సరములు ఏలెను. అతని తల్లి జెకర్యా కుమార్తె; ఆమెకు అబీ అని పేరు.
తన పితరుడైన దావీదు చేసినట్లు అతడు యెహోవా దృష్టికి పూర్ణముగా నీతి ననుసరించెను.
యోతామునకు ఆహాజు కుమారుడు, ఆహాజునకు హిజ్కియా కుమారుడు, హిజ్కియాకు మనష్షే కుమారుడు,
ఉజ్జియా యోతాము ఆహాజు హిజ్కియాయను యూదారాజుల దినములలో యూదాను గూర్చియు యెరూషలేమును గూర్చియు ఆమోజు కుమారుడగు యెష యాకు కలిగిన దర్శనము.
ఉజ్జియా యోతాము ఆహాజు హిజ్కియా అను యూదా రాజుల దినములలోను, యెహోయాషు కుమారుడైన యరొబాము అను ఇశ్రాయేలు రాజు దినములలోను బెయేరి కుమారుడైన హోషేయ కు ప్రత్యక్షమైన యెహోవా వాక్కు.
యోతాము ఆహాజు హిజ్కియా అను యూదా రాజుల దినములలో షోమ్రోనును గూర్చియు యెరూషలేమును గూర్చియు దర్శనరీతిగా మోరష్తీయుడైన మీకా కు ప్రత్యక్షమైన యెహోవా వాక్కు.
ఉజ్జియా యోతామును కనెను, యోతాము ఆహాజును కనెను, ఆహాజు హిజ్కియాను కనెను;
హిజ్కియా మనష్షేను కనెను, మనష్షే ఆమోనును కనెను, ఆమోను యోషీయాను కనెను;
దేవుని ప్రత్యక్షత విషయమందు తెలివి కలిగిన జెకర్యా దినములలో అతడు దేవుని ఆశ్రయించెను, అతడు యెహోవాను ఆశ్రయించినంతకాలము దేవుడు అతని వర్ధిల్లజేసెను.
నా నిమిత్తము నమ్మకమైన సాక్ష్యము పలుకుటకు యాజకుడైన ఊరియాను యెబెరెక్యాయు కుమారుడైన జెకర్యాను సాక్షులనుగా పెట్టెదనని నాతో చెప్పగా