A. M. 3262-3278. B.C. 742-726. ఆహాజు
2 రాజులు 16:1

రెమల్యా కుమారుడైన పెకహు ఏలుబడిలో పదు నేడవ సంవత్సరమందు యూదా రాజైన యోతాము కుమారుడగు ఆహాజు ఏలనారంభించెను .

2 రాజులు 16:2-20
2

ఆహాజు ఏలనారంభించినప్పుడు ఇరువది యేండ్లవాడై యెరూషలేమునందు పదునారు సంవత్సరములు ఏలెను . తన పితరుడగు దావీదు తన దేవుడైన యెహోవా దృష్టికి నీతిగా ప్రవర్తించినట్లు అతడు ప్రవర్తింపక ఇశ్రాయేలు రాజులు ప్రవర్తించినట్లు ప్రవర్తించెను.

3

అతడు ఇశ్రాయేలీయుల ముందర నిలువకుండ యెహోవా వెళ్లగొట్టిన జనులు చేసిన హేయమైన క్రియలు చేయుచు, తన కుమారుని అగ్నిగుండమును దాటించెను .

4

మరియు అతడు ఉన్నత స్థలములలోను కొండ మీదను సమస్తమైన పచ్చని వృక్షముల క్రిందను బలులు అర్పించుచు ధూపము వేయుచు వచ్చెను.

5

సిరియా రాజైన రెజీనును ఇశ్రాయేలు రాజైన రెమల్యా కుమారుడగు పెకహును యెరూషలేముమీదికి యుద్ధమునకు వచ్చి అక్కడ నున్న ఆహాజును పట్టణమును ముట్టడివేసిరి గాని అతనిని జయింప లేక పోయిరి.

6

ఆ కాలమందు సిరియా రాజైన రెజీను ఏలతును మరల పట్టుకొని సిరియనుల వశముచేసి, ఏలతులోనుండి యూదావారిని వెళ్లగొట్టగా సిరియనులు ఏలతు పట్టణమునకు వచ్చి కాపురముండిరి . నేటి వరకును వారచ్చటనే యున్నారు.

7

ఇట్లుండగా ఆహాజు యెహోవా మందిర సంబంధమైనట్టియు రాజ నగరు సంబంధమైనట్టియు సామగ్రులలో కనబడిన వెండి బంగారములను తీసికొని అష్షూరు రాజునకు కానుకగా పంపి

8

నేను నీ దాసుడను నీ కుమారుడనైయున్నాను గనుక నీవు వచ్చి , నామీదికి లేచిన సిరియా రాజు చేతిలోనుండియు ఇశ్రాయేలు రాజు చేతిలోనుండియు నన్ను రక్షింపవలెనని అష్షూరు రాజైన తిగ్లత్పిలేసెరునొద్దకు దూతల నంపగా

9

అష్షూరు రాజు అతనిమాట అంగీకరించి , దమస్కు పట్టణముమీదికి వచ్చి దాని పట్టుకొని , రెజీనును హతముచేసి ఆ జనులను కీరు పట్టణమునకు చెరదీసికొని పోయెను.

10

రాజైన ఆహాజు అష్షూరు రాజైన తిగ్లత్పిలేసెరును కలిసికొనుటకై దమస్కు పట్టణమునకు వచ్చి , దమస్కు పట్టణమందు ఒక బలిపీఠమును చూచి , దాని పోలికెను , మచ్చును , దాని పని విధమంతయును యాజకుడైన ఊరియాకు పంపెను .

11

కాబట్టి యాజకుడైన ఊరియా రాజైన ఆహాజు దమస్కుపట్టణము నుండి పంపిన మచ్చునకు సమమైన యొక బలిపీఠమును కట్టించి , రాజైన ఆహాజు దమస్కునుండి తిరిగి రాకమునుపే సిద్ధపరచెను .

12

అంతట రాజు దమస్కునుండి వచ్చి బలిపీఠమును చూచి ఆ బలిపీఠమునొద్దకు వచ్చి దాని ఎక్కి

13

దహన బలిని నైవేద్యమును అర్పించి పానార్పణము చేసి, తాను అర్పించిన సమాధానబలిపశువుల రక్తమును దానిమీద ప్రోక్షించెను .

14

మరియు యెహోవా సన్నిధి నున్న యిత్తడి బలిపీఠము మందిరము ముంగిటి స్థలమునుండి అనగా తాను కట్టించిన బలిపీఠమునకును యెహోవా మందిరమునకును మధ్యనుండి తీయించి, తాను కట్టించిన దాని ఉత్తర పార్శ్వమందు దానిని ఉంచెను .

15

అప్పుడు రాజైన ఆహాజు యాజకుడైన ఊరియాకు ఆజ్ఞాపించినదేమనగా ఈ పెద్ద బలిపీఠము మీద ఉదయము అర్పించు దహనబలులను , సాయంత్రమున అర్పించు నైవేద్యములను రాజు చేయు దహనబలి నైవేద్యములను దేశపు జను లందరు అర్పించు దహనబలి నైవేద్యములను పానార్పణలను దహించి ,యే దహనబలి జరిగినను, ఏ బలిజరిగినను వాటి పశువుల రక్తమును దానిమీదనే ప్రోక్షింపవలెను . అయితే ఈ యిత్తడి బలిపీఠము దేవునియొద్ద నేను విచారణ చేయుట కుంచవలెను .

16

కాగా యాజకుడైన ఊరియా రాజైన ఆహాజు ఆజ్ఞ చొప్పున అంతయు చేసెను .

17

మరియు రాజైన ఆహాజు స్తంభముల అంచులను తీసివేసి వాటిమీదనున్న తొట్టిని తొలగించెను , ఇత్తడి యెడ్లమీద నున్న సముద్రమును దింపి రాతి కట్టు మీద దానిని ఉంచెను .

18

మరియు అతడు అష్షూరు రాజునుబట్టి విశ్రాంతిదినపు ఆచరణకొరకై మందిరములో కట్టబడిన మంటపమును, రాజు ఆవరణముగుండ పోవు ద్వారమును యెహోవా మందిరమునుండి తీసివేసెను .

19

ఆహాజుచేసిన యితర కార్యములనుగూర్చి యూదా రాజుల వృత్తాంతముల గ్రంథమందు వ్రాయబడి యున్నది.

20

ఆహాజు తన పితరులతో కూడ నిద్రించి దావీదు పురమందు తన పితరుల సమాధిలో పాతిపెట్టబడెను ; అతని కుమారుడైన హిజ్కియా అతనికి మారుగా రాజాయెను .

1దినవృత్తాంతములు 3:13

యోతామునకు ఆహాజు కుమారుడు, ఆహాజునకు హిజ్కియా కుమారుడు, హిజ్కియాకు మనష్షే కుమారుడు,

యెషయా 1:1

ఉజ్జియా యోతాము ఆహాజు హిజ్కియాయను యూదారాజుల దినములలో యూదాను గూర్చియు యెరూషలేమును గూర్చియు ఆమోజు కుమారుడగు యెష యాకు కలిగిన దర్శనము.

యెషయా 7:1-12
1

యూదా రాజైన ఉజ్జియా మనుమడును యోతాము కుమారుడునైన ఆహాజు దినములలో సిరియా రాజైన రెజీనును ఇశ్రాయేలు రాజును రెమల్యా కుమారుడునైన పెకహును యుద్ధము చేయవలెనని యెరూషలేముమీదికి వచ్చిరి గాని అది వారివలన కాకపోయెను

2

అప్పుడు సిరియనులు ఎఫ్రాయిమీయులను తోడుచేసికొనిరని దావీదు వంశస్థులకు తెలుపబడగా, గాలికి అడవి చెట్లు కదలినట్లు వారి హృదయమును వారి జనుల హృదయమును కదిలెను.

3

అప్పుడు యెహోవా యెషయాతో ఈలాగు సెలవిచ్చెను ఆహాజు నెదుర్కొనుటకు నీవును నీ కుమారుడైన షెయార్యాషూబును చాకిరేవు మార్గమున పై కోనేటి కాలువకడకు పోయి అతనితో ఈలాగు చెప్పుము

4

భద్రముసుమీ, నిమ్మళించుము; పొగ రాజుచున్న యీ రెండు కొరకంచు కొనలకు, అనగా రెజీనును, సిరియనులు, రెమల్యా కుమారుడును అనువారి కోపాగ్నికి జడియకుము, నీ గుండె అవియనీయకుము.

5

సిరియాయు, ఎఫ్రాయిమును, రెమల్యా కుమారుడును నీకు కీడుచేయవలెనని ఆలోచించుచు

6

మనము యూదా దేశముమీదికి పోయి దాని జనులను భయపెట్టి దాని ప్రాకారములను పడగొట్టి టాబెయేలను వాని కుమారుని దానికి రాజుగా నియమించెదము రండని చెప్పుకొనిరి.

7

అయితే ప్రభువైన యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు ఆ మాట నిలువదు, జరుగదు.

8

దమస్కు సిరియాకు రాజధాని; దమస్కునకు రెజీనురాజు; అరువదియయిదు సంవత్సరములు కాకమునుపు ఎఫ్రాయిము జనము కాకుండ నాశనమగును.

9

షోమ్రోను ఎఫ్రాయిమునకు రాజధాని; షోమ్రోనునకు రెమల్యా కుమారుడు రాజు; మీరు నమ్మకుండినయెడల స్థిరపడకయుందురు.

10

యెహోవా ఇంకను ఆహాజునకు ఈలాగు సెలవిచ్చెను

11

నీ దేవుడైన యెహోవావలన సూచన నడుగుము. అది పాతాళమంత లోతైనను సరే ఊర్థ్వలోకమంత ఎత్తయినను సరే.

12

ఆహాజు నేను అడుగను యెహోవాను శోధింపనని చెప్పగా

హొషేయ 1:1

ఉజ్జియా యోతాము ఆహాజు హిజ్కియా అను యూదా రాజుల దినములలోను , యెహోయాషు కుమారుడైన యరొబాము అను ఇశ్రాయేలు రాజు దినములలోను బెయేరి కుమారుడైన హోషేయ కు ప్రత్యక్షమైన యెహోవా వాక్కు .

మీకా 1:1

యోతాము ఆహాజు హిజ్కియా అను యూదా రాజుల దినములలో షోమ్రోనును గూర్చియు యెరూషలేమును గూర్చియు దర్శనరీతిగా మోరష్తీయుడైన మీకా కు ప్రత్యక్షమైన యెహోవా వాక్కు .

మత్తయి 1:9

ఉజ్జియా యోతామును కనెను, యోతాము ఆహాజును కనెను, ఆహాజు హిజ్కియాను కనెను;

తన పితరుడైన దావీదువలె
2 దినవృత్తాంతములు 17:3

యెహోవా అతనికి సహాయుడై యుండగా యెహోషాపాతు తన తండ్రియైన దావీదు ప్రారంభదినములలో నడచిన మార్గమందు నడచుచు