రాజైన ఆహాజు అష్షూరు రాజైన తిగ్లత్పిలేసెరును కలిసికొనుటకై దమస్కు పట్టణమునకు వచ్చి , దమస్కు పట్టణమందు ఒక బలిపీఠమును చూచి , దాని పోలికెను , మచ్చును , దాని పని విధమంతయును యాజకుడైన ఊరియాకు పంపెను .
కాబట్టి యాజకుడైన ఊరియా రాజైన ఆహాజు దమస్కుపట్టణము నుండి పంపిన మచ్చునకు సమమైన యొక బలిపీఠమును కట్టించి , రాజైన ఆహాజు దమస్కునుండి తిరిగి రాకమునుపే సిద్ధపరచెను .
అంతట రాజు దమస్కునుండి వచ్చి బలిపీఠమును చూచి ఆ బలిపీఠమునొద్దకు వచ్చి దాని ఎక్కి
దహన బలిని నైవేద్యమును అర్పించి పానార్పణము చేసి, తాను అర్పించిన సమాధానబలిపశువుల రక్తమును దానిమీద ప్రోక్షించెను .
మరియు యెహోవా సన్నిధి నున్న యిత్తడి బలిపీఠము మందిరము ముంగిటి స్థలమునుండి అనగా తాను కట్టించిన బలిపీఠమునకును యెహోవా మందిరమునకును మధ్యనుండి తీయించి, తాను కట్టించిన దాని ఉత్తర పార్శ్వమందు దానిని ఉంచెను .
అప్పుడు రాజైన ఆహాజు యాజకుడైన ఊరియాకు ఆజ్ఞాపించినదేమనగా ఈ పెద్ద బలిపీఠము మీద ఉదయము అర్పించు దహనబలులను , సాయంత్రమున అర్పించు నైవేద్యములను రాజు చేయు దహనబలి నైవేద్యములను దేశపు జను లందరు అర్పించు దహనబలి నైవేద్యములను పానార్పణలను దహించి ,యే దహనబలి జరిగినను, ఏ బలిజరిగినను వాటి పశువుల రక్తమును దానిమీదనే ప్రోక్షింపవలెను . అయితే ఈ యిత్తడి బలిపీఠము దేవునియొద్ద నేను విచారణ చేయుట కుంచవలెను .
కాగా యాజకుడైన ఊరియా రాజైన ఆహాజు ఆజ్ఞ చొప్పున అంతయు చేసెను .
మరియు నా పేరు పెట్టబడిన మందిరమును అప విత్రపరచుటకు దానిలో హేయమైనవాటిని పెట్టిరి.
మంటి బలిపీఠమును నాకొరకు చేసి, దానిమీద నీ దహన బలులను సమాధానబలులను నీ గొఱ్ఱలను నీ యెద్దులను అర్పింపవలెను. నేను నా నామమును జ్ఞాపకార్థముగానుంచు ప్రతి స్థలములోను నీయొద్దకు వచ్చి నిన్ను ఆశీర్వదించెదను.
మీ దేవుడైన యెహోవా మీ సమస్త గోత్రములలో తన నామమును స్థాపించుకొనుటకు నివాసస్థానముగా ఏర్పరచుకొను స్థలమును వెదకి అక్కడికే యాత్రలు చేయుచుండవలెను.
అతడు నా నామఘనతకొరకు ఒక మందిరమును కట్టించును; అతని రాజ్య సింహాసనమును నేను నిత్యముగా స్థిరపరచెదను;
నీ దాసుడనైన నేను చేయు ప్రార్థనను దయతో అంగీకరించునట్లు నా నామము అక్కడ ఉండునని యే స్థలమునుగూర్చి నీవు సెలవిచ్చితివో ఆ స్థలమైన యీ మందిరముతట్టు నీ నేత్రములు రేయింబగలు తెరవబడి యుండునుగాక.
అతనితో ఈలాగు సెలవిచ్చెను నా సముఖమందు నీవు చేసిన ప్రార్థన విన్నపములను నేను అంగీకరించితిని, నా నామమును అక్కడ సదాకాలము ఉంచుటకు నీవు కట్టించిన యీ మందిరమును పరిశుద్ధపరచియున్నాను; నా దృష్టియు నా మనస్సును ఎల్లప్పుడు అక్కడ ఉండును.
యూదా గోత్రమును తాను ప్రేమించిన సీయోను పర్వతమును ఆయన కోరుకొనెను .
తాను అంతరిక్షమును కట్టినట్లు తాను భూమిని నిత్యముగా స్థాపించినట్లు ఆయన తన పరిశుద్ధమందిరమును కట్టించెను
యెహోవా సీయోనును ఏర్పరచుకొనియున్నాడు. తనకు నివాసస్థలముగా దానిని కోరుకొనియున్నాడు.
ఇది నేను కోరినస్థానము, ఇది నిత్యము నాకు విశ్రమ స్థానముగా నుండును ఇక్కడనే నేను నివసించెదను