నేను మీకు పగవాడనవుదును; మీ శత్రువుల యెదుట మీరు చంపబడెదరు; మీ విరోధులు మిమ్మును ఏలెదరు; మిమ్మును ఎవరును తరుమకపోయినను మీరు పారిపోయెదరు.
ఏలయనగా నీ దేవుడైన యెహోవా దహించు అగ్నియు రోషముగల దేవుడునైయున్నాడు.
మీరు పిల్లలను పిల్లల పిల్లలను కని ఆ దేశమందు బహు కాలము నివసించిన తరువాత మిమ్మును మీరు పాడుచేసికొని, యే స్వరూపము కలిగిన విగ్రహమునైనను చేసి నీ దేవుడైన యెహోవాకు కోపము పుట్టించి ఆయన కన్నుల యెదుట కీడు చేసినయెడల
మీరు ఈ యొర్దాను దాటి స్వాధీనపరచుకొనబోవు దేశములో ఉండకుండ త్వరలోనే బొత్తిగా నశించిపోదురని భూమ్యాకాశములను మీమీద సాక్షులుగా ఉంచుచున్నాను. ఆ దేశమందు బహు దినములుండక మీరు బొత్తిగా నశించిపోదురు.
మరియు యెహోవా జనములలో మిమ్మును చెదరగొట్టును; యెహోవా ఎక్కడికి మిమ్మును తోలివేయునో అక్కడి జనములలో మీరు కొద్దిమందే మిగిలియుందురు.
యెహోవా నీ శత్రువుల యెదుట నిన్ను ఓడించును. ఒక్కమార్గమున వారి యెదుటికి బయలుదేరి నీవు యేడు మార్గముల వారి యెదుటనుండి పారిపోయి, భూరాజ్యములన్నిటి లోనికి యిటు అటు చెదరగొట్టబడుదువు.
కాబట్టి యెహోవా కోపాగ్ని ఇశ్రాయేలీయులమీద మండెను; ఆయన దోచుకొనువారిచేతికి వారిని అప్పగించెను. వారు ఇశ్రాయేలీయులను దోచుకొనిరి; ఆయన వారి చుట్టునున్నవారి శత్రువులచేతికి వారిని అప్పగించెను గనుక వారు తమ శత్రువుల యెదుట నిలువలేకపోయిరి.
అందునుగూర్చి యెహోవా కోపము ఇశ్రాయేలీయులమీద మండగా ఆయన అరా మ్నహరాయిముయొక్క రాజైన కూషన్రిషాతాయిము చేతులకు దాసులగుటకై వారిని అమి్మవేసెను. ఇశ్రాయేలీయులు ఎనిమిది సంవత్సరములు కూషన్రిషాతాయిమునకు దాసులుగానుండిరి
యెహోవా కోపాగ్ని ఇశ్రాయేలీయుల మీద మండగా ఆయన ఫిలిష్తీయుల చేతికిని అమ్మోనీయుల చేతికిని వారినప్పగించెను గనుక
వారు ఆ సంవత్సరము మొదలుకొని ఇశ్రాయేలీయులను, అనగా యొర్దాను అవతల నున్న గిలాదునందలి అమోరీయుల దేశములో కాపురమున్న ఇశ్రాయేలీయులను పదునెనిమిది సంవత్సరములు చితుకగొట్టి అణచివేసిరి.
మరియు అమ్మోనీయులు యూదాదేశస్థులతోను బెన్యామీనీయులతోను ఎఫ్రాయిమీయులతోను యుద్ధముచేయుటకు యొర్దానును దాటిరి గనుక ఇశ్రాయేలీయులకు మిక్కిలి శ్రమ కలిగెను
అప్పుడు ఇశ్రాయేలీయులు మేము నీ సన్నిధిని పాపము చేసియున్నాము, మా దేవుని విడిచి బయలులను పూజించి యున్నామని యెహోవాకు మొఱ్ఱపెట్టగా
యెహోవా ఐగుప్తీయుల వశములోనుండియు అమోరీయుల వశములో నుండియు అమ్మోనీయుల వశములోనుండియు ఫిలిష్తీయుల వశములోనుండియు మాత్రము గాక
సీదోనీయులును అమాలేకీయులును మాయోనీయులును మిమ్మును బాధపరచినప్పుడు వారి వశములోనుండియు నేను మిమ్మును రక్షించితిని గదా
అయితే మీరు నన్ను విసర్జించి అన్య దేవతలను పూజించితిరి గనుక నేను ఇకను మిమ్మును రక్షింపను.
పోయి మీరు కోరుకొనిన దేవతలకు మొఱ్ఱపెట్టుకొనుడి; మీ శ్రమకాలమున అవి మిమ్మును రక్షించునేమో అని ఇశ్రాయేలీయులతో సెలవిచ్చెను.
అష్షూరీయులకు శ్రమ వారు నా కోపమునకు సాధనమైన దండము నా దుడ్డుకఱ్ఱ నా ఉగ్రత వారిచేతిలో ఉన్నది.
భక్తిహీనులగు జనములమీదికి నేను వారిని పంపెదను దోపుడుసొమ్ము దోచుకొనుటకును కొల్లపెట్టుటకును వీధులను త్రొక్కించుటకును నా ఉగ్రతకు పాత్రులగు జనులనుగూర్చి వారి కాజ్ఞాపించెదను.
ఏలయనగా మన దేవుడు దహించు అగ్నియైయున్నాడు.
యెహోయాహాజు దినములన్నియు సిరియారాజైన హజాయేలు ఇశ్రాయేలువారిని బాధపెట్టెను.
హజాయేలు నా యేలినవాడవైన నీవు కన్నీళ్లు రాల్చెదవేమని అతని నడుగగా ఎలీషా యీలాగు ప్రత్యుత్తరమిచ్చెను ఇశ్రాయేలువారి గట్టి స్థలములను నీవు కాల్చి వేయుదువు ; వారి యౌవనస్థులను కత్తిచేత హతము చేయుదువు; వారి పిల్లలను నేలకు వేసి కొట్టి చంపుదువు; వారి గర్భిణుల కడుపులను చింపి వేయుదువు గనుక నీవు వారికి చేయబోవు కీడును నే నెరిగియుండుటచేత కన్నీళ్లు రాల్చుచున్నాను.
అందుకు హజాయేలు కుక్కవంటివాడనగు నీ దాసుడనైన నేను ఇంత కార్యము చేయుటకు ఎంతటి వాడను అని అతనితో అనగా , ఎలీషా నీవు సిరియా మీద రాజవగుదువని యెహోవా నాకు బయలుపరచి యున్నాడనెను .
అంతట సిరియారాజైన హజాయేలు గాతు పట్టణము మీదికి పోయి యుద్ధముచేసి దాని పట్టుకొనిన తరువాత అతడు యెరూషలేముమీదికి రాదలచియుండగా
హజాయేలుయొక్క ఖడ్గమును తప్పించుకొనువారిని యెహూ హతముచేయును; యెహూ యొక్క ఖడ్గమును తప్పించుకొనువారిని ఎలీషా హతము చేయును.
సిరియారాజైన హజాయేలు మరణము కాగా అతని కుమారుడైన బెన్హదదు అతనికి మారుగా రాజాయెను.
అంతట యెహోయాహాజు కుమారుడైన యెహోయాషు హజాయేలు కుమారుడైన బెన్హదదు తన తండ్రియైన యెహోయాహాజు చేతిలోనుండి యుద్ధమందు పట్టుకొనిన పట్టణములను మరల తీసికొనెను. యెహోయాషు అతని ముమ్మారు జయించి ఇశ్రాయేలు పట్టణములను మరల వశపరచుకొనెను.