
మోషే–మీరు చేయవలెనని యెహోవా ఆజ్ఞాపించినది ఇదే; అట్లు చేయుడి. అప్పుడు యెహోవా మహిమ మీకు కనబడుననెను.
మోషే అహరోనులు ప్రత్యక్షపు గుడారములోనికి పోయి వెలుపలికివచ్చి ప్రజలను దీవింపగా యెహోవా మహిమ ప్రజలకందరికి కనబడెను.
ఇశ్రాయేలీయుల దేవుని ప్రభావము తూర్పు దిక్కున కనబడెను ; దానినుండి పుట్టిన ధ్వని విస్తార జలముల ధ్వనివలె వినబడెను, ఆయన ప్రకాశముచేత భూమి ప్రజ్వరిల్లెను .
తూర్పు తట్టు చూచు గుమ్మపు మార్గమున యెహోవా తేజోమహిమ మందిరము లోనికి ప్రవేశించెను .
ఆత్మ నన్ను ఎత్తి లోపటి ఆవరణము లోనికి తీసికొని రాగా యెహోవా తేజోమహిమతో మందిరము నిండియుండెను .
అతడు ఉత్తరపు గుమ్మము మార్గముగా మందిరము ఎదుటికి నన్ను తోడుకొని వచ్చెను. అంతలో యెహోవా తేజోమహిమతో యెహోవా మందిరము నిండియుండుట చూచి నేను సాగిలపడగా
ఆ వాక్యము శరీరధారియై, కృపాసత్యసంపూర్ణుడుగా మనమధ్య నివసించెను; తండ్రివలన కలిగిన అద్వితీయకుమారుని మహిమవలె మనము ఆయన మహిమను కనుగొంటిమి
అయితే అతడు పరిశుద్ధాత్మతో నిండుకొనినవాడై ఆకాశమువైపు తేరిచూచి, దేవుని మహిమను యేసు దేవుని కుడిపార్శ్వమందు నిలిచియుండుటను చూచి
మనమందరమును ముసుకులేని ముఖముతో ప్రభువుయొక్క మహిమను అద్దమువలె ప్రతిఫలింపజేయుచు, మహిమనుండి అధిక మహిమను పొందుచు, ప్రభువగు ఆత్మచేత ఆ పోలికగానే మార్చబడుచున్నాము.
గనుక మేము మమ్మునుగూర్చి ప్రకటించుకొనుటలేదు గాని, క్రీస్తుయేసునుగూర్చి ఆయన ప్రభువనియు, మమ్మునుగూర్చి, యేసు నిమిత్తము మేము మీ పరిచారకులమనియు ప్రకటించుచున్నాము.
దానియందలి వెలుగు ధగధగ మెరయు సూర్యకాంతమువంటి అమూల్య రత్నమును పోలియున్నది.
ఆ పట్టణములో ప్రకాశించుటకై సూర్యుడైనను చంద్రుడైనను దానికక్కరలేదు; దేవుని మహిమయే దానిలో ప్రకాశించుచున్నది. గొఱ్ఱెపిల్లయే దానికి దీపము.