సమాప్త మాయెను
నిర్గమకాండము 40:33

మరియు అతడు మందిరమునకును బలిపీఠమునకును చుట్టు ఆవరణమును ఏర్పరచి ఆవరణ ద్వారపు తెరను వేసెను. ఆలాగున మోషే పని సంపూర్తి చేసెను.

ఎజ్రా 6:15

రాజైన దర్యావేషు ఏలుబడియందు ఆరవ సంవత్సరము అదారు నెల మూడవనాటికి మందిరము సమాప్తి చేయబడెను.

జెకర్యా 4:9

జెరుబ్బాబెలు చేతులు ఈ మందిరపు పునాది వేసియున్నవి, అతని చేతులు ముగించును, అప్పుడు సైన్యములకు అధిపతియగు యెహోవా నన్ను మీయొద్దకు పంపియున్నాడని నీవు తెలిసికొందువు.

తన తండ్రియైన దావీదు ప్రతిష్ఠించిన
2 సమూయేలు 8:7-11
7

హదదెజెరు సేవకులకున్న బంగారు డాళ్లు దావీదు పట్టుకొని యెరూషలేమునకు తీసికొని వచ్చెను.

8

మరియు బెతహు బేరోతై అను హదదెజెరు పట్టణములలో దావీదు రాజు విస్తారమైన యిత్తడిని పట్టుకొనెను.

9

దావీదు హదదెజెరు దండు అంతయు ఓడించిన సమాచారము హమాతు రాజైన తోయికి వినబడెను.

10

హదదెజెరునకును తోయికిని యుద్ధములు జరుగుచుండెను గనుక దావీదు హదదెజెరుతో యుద్ధము చేసి అతనిని ఓడించి యుండుట తోయి విని, తన కుమారుడగు యోరాము చేతికి వెండి బంగారు ఇత్తడి వస్తువులను కానుకలుగా అప్పగించి కుశల ప్రశ్నలడిగి దావీదుతోకూడ సంతోషించుటకై అతనిని దావీదు నొద్దకు పంపెను.

11

రాజైన దావీదు తాను జయించిన జనములయొద్ద పట్టుకొనిన వెండి బంగారములతో వీటినిచేర్చి యెహోవాకు ప్రతిష్ఠించెను.

1దినవృత్తాంతములు 18:7

మరియు హదరెజెరు సేవకులు పట్టుకొనియున్న బంగారు డాళ్లను దావీదు తీసికొని యెరూషలేమునకు చేర్చెను.

1దినవృత్తాంతములు 18:8

హదరెజెరుయొక్క పట్టణములైన టిబ్హతులో నుండియు, కూనులోనుండియు దావీదు బహు విస్తారమైన యిత్తడిని తీసికొని వచ్చెను. దానితో సొలొమోను ఇత్తడి సముద్రమును స్తంభములును ఇత్తడి వస్తువులను చేయించెను.

1దినవృత్తాంతములు 18:10

హదరెజెరునకును తోహూకును విరోధము కలిగియుండెను గనుక రాజైన దావీదు హదరెజెరుతో యుద్ధముచేసి అతని నోడించినందుకై దావీదుయొక్క క్షేమము తెలిసికొనుటకును, అతనితో శుభవచనములుపలుకుటకును, బంగారముతోను వెండితోను ఇత్తడితోను చేయబడిన సకల విధములైన పాత్రలనిచ్చి, తోహూ తన కుమారుడైన హదోరమును అతనియొద్దకు పంపెను.

1దినవృత్తాంతములు 18:11

ఈ వస్తువులను కూడ రాజైన దావీదు తాను ఎదోమీయులయొద్దనుండియు, మోయాబీయులయొద్దనుండియు, అమ్మోనీయులయొద్ద నుండియు, ఫిలిష్తీయుల యొద్దనుండియు, అమాలేకీయులయొద్ద నుండియు తీసికొనిన వెండి బంగారములతో పాటుగా యెహోవాకు ప్రతిష్ఠించెను.

1దినవృత్తాంతములు 26:26-28
26

యెహోవా మందిరము ఘనముగా కట్టించుటకై రాజైన దావీదును పితరుల యింటి పెద్దలును సహస్రాధిపతులును శతాధిపతులును సైన్యాధిపతులును

27

యుద్ధములలో పట్టుకొని ప్రతిష్ఠించిన కొల్లసొమ్ము ఉన్న బొక్కసములకు షెలోమీతును వాని సహోదరులును కావలి కాయువారైరి.

28

దీర్ఘదర్శి సమూయేలును కీషు కుమారుడైన సౌలును నేరు కుమారుడైన అబ్నేరును సెరూయా కుమారుడైన యోవాబును ప్రతిష్ఠించిన సొమ్మంతయు షెలోమీతు చేతిక్రిందను వాని సహోదరుల చేతిక్రిందను ఉంచబడెను.

1దినవృత్తాంతములు 28:11-18
11

అప్పుడు దావీదు మంటపమునకును మందిరపు కట్టడమునకును బొక్కసపు శాలలకును మేడ గదులకును లోపలి గదులకును కరుణాపీఠపు గదికిని యెహోవా మందిరపు ఆవరణములకును

12

వాటి చుట్టునున్న గదులకును దేవుని మందిరపు బొక్కసములకును ప్రతిష్ఠిత వస్తువుల బొక్కసములకును తాను ఏర్పాటుచేసి సిద్ధపరచిన మచ్చులను తన కుమారుడైన సొలొమోనునకు అప్పగించెను.

13

మరియు యాజకులును లేవీయులును సేవచేయవలసిన వంతుల పట్టీయును, యెహోవా మందిరపు సేవనుగూర్చిన పట్టీయును, యెహోవా మందిరపు సేవోపకరణముల పట్టీయును దావీదు అతనికప్పగించెను.

14

మరియు ఆయా సేవాక్రమములకు కావలసిన బంగారు ఉపకరణములన్నిటిని చేయుటకై యెత్తుప్రకారము బంగారమును, ఆయా సేవాక్రమములకు కావలసిన వెండి ఉపకరణములన్నిటిని చేయుటకై యెత్తు ప్రకారము వెండిని దావీదు అతని కప్పగించెను.

15

బంగారు దీపస్తంభములకును వాటి బంగారు ప్రమిదెలకును ఒక్కొక్క దీపస్తంభమునకును దాని ప్రమిదెలకును కావలసినంత బంగారమును ఎత్తు ప్రకారముగాను, వెండి దీపస్తంభములలో ఒక్కొక దీపస్తంభమునకును, దాని దాని ప్రమిదెలకును కావలసినంత వెండిని యెత్తు ప్రకారముగాను,

16

సన్నిధిరొట్టెలు ఉంచు ఒక్కొక బల్లకు కావలసినంత బంగారమును ఎత్తు ప్రకారముగాను, వెండిబల్లలకు కావలసినంత వెండిని,

17

ముండ్ల కొంకులకును గిన్నెలకును పాత్రలకును కావలసినంత అచ్చ బంగారమును, బంగారు గిన్నెలలో ఒక్కొక గిన్నెకు కావలసినంత బంగారమును ఎత్తు ప్రకారముగాను వెండి గిన్నెలలో ఒక్కొక గిన్నెకు కావలసినంత వెండిని యెత్తు ప్రకారముగాను,

18

ధూపపీఠమునకు కావలసినంత పుటము వేయబడిన బంగారమును ఎత్తు ప్రకారముగాను, రెక్కలు విప్పుకొని యెహోవా నిబంధన మందసమును కప్పు కెరూబుల వాహనముయొక్క మచ్చునకు కావలసినంత బంగారమును అతని కప్పగించెను.

1దినవృత్తాంతములు 29:2-8
2

నేను బహుగా ప్రయాసపడి నా దేవుని మందిరమునకు కావలసిన బంగారపు పనికి బంగారమును, వెండిపనికి వెండిని, యిత్తడిపనికి ఇత్తడిని, యినుపపనికి ఇనుమును, కఱ్ఱపనికి కఱ్ఱలను, గోమేధికపురాళ్లను, చెక్కుడురాళ్లను, వింతైన వర్ణములుగల పలువిధములరాళ్లను, మిక్కిలి వెలగల నానావిధ రత్నములను తెల్లచలువరాయి విశేషముగా సంపాదించితిని.

3

మరియు నా దేవుని మందిముమీద నాకు కలిగియున్న మక్కువచేత నేను ఆ ప్రతిష్ఠితమైన మందిరము నిమిత్తము సంపాదించియుంచిన వస్తువులు గాక, నా స్వంతమైన బంగారమును వెండిని నా దేవుని మందిరము నిమిత్తము నేనిచ్చెదను.

4

గదుల గోడల రేకుమూతకును బంగారపు పనికిని బంగారమును, వెండిపనికి వెండిని పనివారు చేయు ప్రతివిధమైన పనికి ఆరువేల మణుగుల ఓఫీరు బంగారమును పదునాలుగువేల మణుగుల పుటము వేయబడిన వెండిని ఇచ్చుచున్నాను

5

ఈ దినమున యెహోవాకు ప్రతిష్ఠితముగా మనఃపూర్వకముగా ఇచ్చు వారెవరైన మీలో ఉన్నారా?

6

అప్పుడు పితరుల యిండ్లకు అధిపతులును ఇశ్రాయేలీయుల గోత్రపు అధిపతులును సహస్రాధిపతులును శతాధిపతులును రాజు పనిమీద నియమింపబడిన అధిపతులును కలసి

7

మనఃపూర్వకముగా దేవుని మందిరపుపనికి పదివేల మణుగుల బంగారమును ఇరువదివేల మణుగుల బంగారపు ద్రాములను ఇరువదివేల మణుగుల వెండిని ముప్పదియారువేల మణుగుల యిత్తడిని రెండులక్షల మణుగుల యినుమును ఇచ్చిరి.

8

తమయొద్ద రత్నములున్నవారు వాటిని తెచ్చి యెహోవా మందిరపు బొక్కసముమీదనున్న గెర్షోనీయుడైన యెహీయేలునకు ఇచ్చిరి.

2 దినవృత్తాంతములు 5:1

సొలొమోను యెహోవా మందిరమునకు తాను చేసిన పనియంతయు సమాప్తముచేసి, తన తండ్రియైన దావీదు ప్రతిష్ఠించిన వెండిని బంగారమును ఉపకరణములన్నిటిని దేవుని మందిరపు బొక్కసములలో చేర్చెను.