నాయొద్దకు వీణ వాయించగల యొకనిని తీసికొనిరమ్ము . వాద్యకుడొకడు వచ్చి వాయించుచుండగా యెహోవా హస్తము అతనిమీదికి వచ్చెను గనుక అతడు ఈ మాట ప్రకటన చేసెను.
ఈ జనులమార్గమున నడువకూడదని యెహోవా బహు బలముగా నాతో చెప్పియున్నాడు; నన్ను గద్దించి యీ మాట సెలవిచ్చెను
యాజకుడునగు యెహెజ్కేలు నకు ప్రత్యక్షముకాగా అక్కడనే యెహోవా హస్తము అతనిమీదికి వచ్చెను .
ఆత్మ నన్నెత్తి తోడు కొనిపోగా నా మనస్సునకు కలిగిన రౌద్రాగ్నిచేత బహుగా వ్యాకులపడుచు కొట్టుకొనిపోయినప్పుడు , యెహోవా హస్తము నా మీద బలముగా వచ్చెను .
అతడు నీ నడుము బిగించుకొని నా దండమును చేత పట్టుకొని పొమ్ము ; ఎవరైనను నీకు ఎదురుపడిన యెడల వారికి నమస్కరింప వద్దు ; ఎవరైనను నీకు నమస్కరించిన యెడల వారికి ప్రతి మర్యాద చేయవద్దు ; అక్కడికి పోయి నా దండమును ఆ బాలుని ముఖము మీద పెట్టుమని గేహజీకి ఆజ్ఞ ఇచ్చి పంపెను.
అంతట ప్రవక్తయగు ఎలీషా ప్రవక్తల శిష్యులలో ఒకనిని పిలువనంపించి అతనితో ఇట్లనెను నీవు నడుము బిగించుకొని యీ తైలపుగిన్నె చేత పట్టుకొని రామోత్గిలాదునకు పోయి
పౌరుషము తెచ్చుకొని నీ నడుము బిగించుకొనుము నేను నీకు ప్రశ్న వేయుదును నీవు దానిని నాకు తెలియజెప్పుము.
కాబట్టి నీవు నడుముకట్టు కొని నిలువబడి నేను నీకాజ్ఞాపించునదంతయు వారికి ప్రకటనచేయుము; భయపడకుము లేదా నేను వారి యెదుట నీకు భయము పుట్టింతును.
ఏలా గనగా మీ నడుమునకు సత్యమను దట్టి కట్టుకొని నీతియను మైమరువు తొడుగుకొని
కాబట్టి మీ మనస్సు అను నడుముకట్టుకొని నిబ్బరమైన బుద్ధిగలవారై, యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు తేబడు కృపవిషయమై సంపూర్ణ నిరీక్షణ కలిగియుండుడి.
అందుకాయనఆలాగైతే కైసరువి కైసరునకును, దేవునివి దేవునికిని చెల్లించుడని వారితో చెప్పెను.
అందరిని సన్మానించుడి, సహోదరులను ప్రేమించుడి, దేవునికి భయపడుడి, రాజును సన్మానించుడి.