సమూయేలు తైలపు కొమ్మును తీసి వాని సహోదరుల యెదుట వానికి అభిషేకము చేసెను. నాటనుండి యెహోవా ఆత్మ దావీదు మీదికి బలముగా వచ్చెను . తరువాత సమూయేలు లేచి రామాకు వెళ్లిపోయెను .
పరిశుద్ధస్థల సంబంధమైన తులముచొప్పున , అచ్చమైన గోపరసము ఐదు వందల తులములును సుగంధముగల లవంగిపట్ట సగము , అనగా రెండువందల ఏబది తులముల యెత్తును
నిమ్మగడ్డి నూనె రెండువందల ఏబది తులముల యెత్తును, లవంగిపట్ట ఐదు వందల తులములును ఒలీవ నూనె సంభారమును మూడు పళ్లును తీసికొని
వాటిని ప్రతిష్ఠా భిషేక తైలము , అనగా సుగంధద్రవ్యమేళకుని పనియైన పరిమళసంభారముగా చేయవలెను . అది ప్రతిష్ఠా భిషేక తైల మగును .
ఆ తైలముతో నీవు సాక్ష్యపు గుడారమును సాక్ష్యపు మందసమును
బల్లను దాని ఉపకరణము లన్నిటిని దీప వృక్షమును దాని ఉపకరణములను ధూప వేదికను
దహన బలిపీఠమును దాని ఉపకరణము లన్నిటిని గంగాళమును దాని పీటను అభిషేకించి
అవి అతిపరిశుద్ధమైనవిగా ఉండునట్లు వాటిని ప్రతిష్ఠింపవలెను . వాటిని తగులు ప్రతివస్తువు ప్రతిష్ఠితమగును .
మరియు అహరోనును అతని కుమారులును నాకు యాజకులైయుండునట్లు నీవు వారిని అభిషేకించి ప్రతిష్ఠింపవలెను .
మరియు నీవు ఇశ్రాయేలీ యులతో ఇది మీ తరతరములకు నాకు ప్రతిష్ఠా భిషేక తైలమై యుండవలెను ;
దానిని నర శరీరము మీద పోయ కూడదు ; దాని మేళనము చొప్పున దాని వంటిదేనినైనను చేయ కూడదు . అది ప్రతిష్ఠితమైనది , అది మీకు ప్రతిష్ఠితమైనదిగా నుండవలెను .
దానివంటిది కలుపువాడును అన్యుని మీద దానిని పోయువాడును తన ప్రజల లోనుండి కొట్టివేయబడవలెనని చెప్పుము .
నా సేవకుడైన దావీదును నేను కనుగొనియున్నాను నా పరిశుద్ధతైలముతో అతనినభిషేకించియున్నాను .
ఆ దినమున వారు యెహోవా సన్నిధిని బహు సంతోషముతో అన్నపానములు పుచ్చుకొనిరి. దావీదు కుమారుడైన సొలొమోనునకు రెండవసారి పట్టాభిషేకముచేసి, యెహోవా సన్నిధిని అతని అధిపతిగాను సాదోకును యాజకునిగాను అభిషేకించిరి.
ఏలయనగా ఈ దినమున అతడు పోయి విస్తారమైన యెడ్లను క్రొవ్విన దూడలను గొఱ్ఱలను బలిగా అర్పించి రాజకుమారులనందరిని సైన్యాధిపతులను యాజకుడైన అబ్యాతారును పిలిపింపగా వారు వాని సముఖములో అన్నపానములు పుచ్చుకొనుచు రాజైన అదోనీయా చిరంజీవియగునుగాక అని పలుకుచున్నారు.
అప్పుడు సమూయేలు -జను లందరిలో యెహోవా ఏర్పరచి నవానిని మీరు చూచితిరా ? జను లందరిలో అతనివంటివాడొకడును లేడని చెప్పగా , జను లందరు బొబ్బలు పెట్టుచు-రాజు చిరంజీవి యగుగాక అని కేకలువేసిరి .
అప్పుడు యాజకుడు రాజ కుమారుని బయటకు తోడుకొనిపోయి అతని తలమీద కిరీటము పెట్టి , ధర్మశాస్త్రగ్రంథమును అతని చేతికిచ్చిన తరువాత వారు అతని పట్టాభిషిక్తునిగా చేసి చప్పట్లుకొట్టి రాజు చిరంజీవియగునుగాకని చాటించిరి .
అప్పుడు వారు రాజకుమారుని బయటికి తోడుకొని వచ్చి, అతనిమీద కిరీటముంచి, ధర్మశాస్త్ర గ్రంథమును అతని చేతికిచ్చి అతనికి పట్టాభిషేకము చేసిరి; యెహోయాదాయును అతని కుమారులును అతనిని అభిషేకించి రాజు చిరంజీవియగునుగాక యనిరి.
ప్రవేశస్థలముదగ్గరనున్న అతనికి ఏర్పాటైన స్తంభమునొద్ద రాజు నిలువబడియుండుటయు, అధిపతులును బూరలు ఊదువారును రాజునొద్దనుండుటయు, దేశపు జనులందరును సంతోషించుచు బూరలతో నాదములు చేయుచుండుటయు, గాయకులును వాద్యములతో స్తుతిపాటలు పాడుచుండుటయు చూచి వస్త్రములు చింపుకొని ద్రోహము ద్రోహమని అరచెను.