నేను యోసేపును
మత్తయి 14:27

వెంటనే యేసు–ధైర్యము తెచ్చుకొనుడి; నేనే, భయపడకుడనివారితో చెప్పగా

అపొస్తలుల కార్యములు 7:13

వారు రెండవసారి వచ్చినప్పుడు యోసేపు తన అన్నదమ్ములకు తన్ను తెలియజేసికొనెను; అప్పుడు యోసేపు యొక్క వంశము ఫరోకు తెలియవచ్చెను.

అపొస్తలుల కార్యములు 9:5

–ప్రభువా, నీవెవడవని అతడడుగగా ఆయన–నేను నీవు హింసించుచున్న యేసును;

for they
యోబు గ్రంథము 4:5

అయితే ఇప్పుడు శ్రమ నీకు కలుగగా నీవు దుఃఖాక్రాంతుడవైతివి అది నీకు తగులగా నీవు కలవరపడుచున్నావు.

యోబు గ్రంథము 23:15

కావున ఆయన సన్నిధిని నేను కలవరపడుచున్నాను నేను ఆలోచించునప్పుడెల్ల ఆయనకు భయపడుచున్నాను.

జెకర్యా 12:10

దావీదు సంతతి వారిమీదను యెరూషలేము నివాసుల మీదను కరుణ నొందించు ఆత్మను విజ్ఞాపనచేయు ఆత్మను నేను కుమ్మరింపగా వారు తాము పొడిచిన నామీద దృష్టియుంచి, యొకడు తన యేక కుమారుని విషయమై దుఃఖించునట్లు,తన జ్యేష్ఠపుత్రుని విషయమై యొకడు ప్రలాపించునట్లు అతని విషయమై దుఃఖించుచు ప్రలాపింతురు.

మత్తయి 14:26

ఆయన సముద్రముమీద నడుచుట శిష్యులు చూచి తొందరపడి, భూతమని చెప్పుకొని భయముచేత కేకలువేసిరి.

మార్కు 6:50

అందరు ఆయనను చూచి తొందరపడగా, వెంటనే ఆయన వారిని పలుకరించి–ధైర్యము తెచ్చు కొనుడి, నేనే, భయపడకుడని చెప్పెను.

లూకా 5:8

సీమోను పేతురు అది చూచి, యేసు మోకాళ్లయెదుట సాగిలపడి–ప్రభువా, నన్నువిడిచి పొమ్ము, నేను పాపాత్ముడనని చెప్పెను.

లూకా 24:37

అయితే వారు దిగులుపడి భయాక్రాంతులై, భూతము తమకు కనబడెనని తలంచిరి.

లూకా 24:38

అప్పుడాయన–మీరెందుకు కలవరపడుచున్నారు? మీ హృదయములలో సందేహములు పుట్టనేల?

ప్రకటన 1:7

ఇదిగో ఆయన మేఘారూఢుడై వచ్చుచున్నాడు; ప్రతి నేత్రము ఆయనను చూచును, ఆయనను పొడిచినవారును చూచెదరు; భూజనులందరు ఆయనను చూచి రొమ్ముకొట్టుకొందురు; అవును ఆమేన్‌.