యెహోవా
1 సమూయేలు 7:12

అప్పుడు సమూయేలు ఒక రాయి తీసి మిస్పాకును షేనుకును మధ్య దానిని నిలిపి -యింతవరకు యెహోవా మనకు సహాయము చేసెనని చెప్పి దానికి ఎబెనెజరు అను పేరు పెట్టెను.

కీర్తనల గ్రంథము 11:1

యెహోవా శరణుజొచ్చియున్నాను పక్షివలె, నీ కొండకు పారిపొమ్ము అని మీరు నాతో చెప్పుట యేల?

కీర్తనల గ్రంథము 18:16

ఉన్నతస్థలమునుండి చెయ్యి చాపి ఆయన నన్ను పట్టుకొనెను నన్ను పట్టుకొని మహా జలరాసులలోనుండి తీసెను.

కీర్తనల గ్రంథము 18:17

బలవంతులగు పగవారు నన్ను ద్వేషించువారు నాకంటె బలిష్టులైయుండగా వారి వశమునుండి ఆయన నన్ను రక్షించెను.

కీర్తనల గ్రంథము 63:7

నీవు నాకు సహాయకుడవైయుంటివి నీ రెక్కల చాటున శరణుజొచ్చి ఉత్సాహధ్వని చేసెదను.

కీర్తనల గ్రంథము 77:11

యెహోవా చేసిన కార్యములను,పూర్వము జరిగిన నీ ఆశ్చర్యకార్యములను నేను మనస్సునకు తెచ్చుకొందును

కీర్తనల గ్రంథము 138:3

నేను మొఱ్ఱపెట్టిన దినమున నీవు నాకు ఉత్తరమిచ్చితివి. నా ప్రాణములో త్రాణ పుట్టించి నన్ను ధైర్యపరచితివి.

కీర్తనల గ్రంథము 138:7

నేను ఆపదలలో చిక్కుబడియున్నను నీవు నన్ను బ్రదికించెదవు నా శత్రువుల కోపమునుండి నన్ను రక్షించుటకై నీవు నీచేయి చాపెదవు నీ కుడిచేయి నన్ను రక్షించును.

కీర్తనల గ్రంథము 138:8

యెహోవా నా పక్షమున కార్యము సఫలముచేయును. యెహోవా, నీ కృప నిరంతరముండును నీ చేతికార్యములను విడిచిపెట్టకుము.

2 కొరింథీయులకు 1:9

మరియు మృతులను లేపు దేవునియందేగాని, మాయందే మేము నమి్మక యుంచకుండునట్లు మరణమగుదుమను నిశ్చయము మామట్టుకు మాకు కలిగియుండెను.

2 కొరింథీయులకు 1:10

ఆయన అట్టి గొప్పమరణము నుండి మమ్మును తప్పించెను, ఇక ముందుకును తప్పించును. మరియు మాకొరకు ప్రార్థనచేయుటవలన మీరు కూడ సహాయము చేయుచుండగా, ఆయన ఇక ముందుకును మమ్మును తప్పించునని ఆయనయందు నిరీక్షణ గలవారమై యున్నాము.

2 తిమోతికి 4:17

అయితే నా ద్వారా సువార్త పూర్ణముగా ప్రకటింపబడు నిమిత్తమును, అన్యజనులందరును దాని విను నిమిత్తమును, ప్రభువు నా ప్రక్క నిలిచి నన్ను బలపరచెను గనుక నేను సింహము నోట నుండి తప్పింపబడితిని.

2 తిమోతికి 4:18

ప్రభువు ప్రతి దుష్కార్యమునుండి నన్ను తప్పించి తన పరలోక రాజ్యమునకు చేరునట్లు నన్ను రక్షించును. యుగయుగములు ఆయనకు మహిమ కలుగును గాక, ఆమేన్‌.

పొమ్ము
1 సమూయేలు 20:13

అయితే నా తండ్రి నీకు కీడుచేయ నుద్దేశించుచున్నాడని నేను తెలిసికొనినయెడల దాని నీకు తెలియజేసి నీవు క్షేమముగా వెళ్లునట్లు నిన్ను పంపివేయనియెడల యెహోవా నాకు గొప్ప అపాయము కలుగజేయుగాక. యెహోవా నా తండ్రికి తోడుగా ఉండి నట్లు నీకును తోడుగా ఉండునుగాక.

1 సమూయేలు 24:19

ఒకనికి తన శత్రువు దొరికిన యెడల మేలుచేసి పంపివేయునా? ఈ దినమున నీవు నాకు చేసిన దానిని బట్టి యెహోవా ప్రతిగా నీకు మేలు చేయునుగాక.

1 సమూయేలు 26:25

అందుకు సౌలు దావీదా నాయనా, నీవు ఆశీర్వాదము పొందుదువు గాక; నీవు ఘనకార్యములను పూనుకొని విజయము నొందుదువుగాక అని దావీదుతో అనెను. అప్పుడు దావీదు తన మార్గమున వెళ్లిపోయెను, సౌలును తన స్థలమునకు తిరిగి వచ్చెను.

2 సమూయేలు 10:12

అప్పుడు –ధైర్యము తెచ్చుకొమ్ము, మన జనులను మన దేవుని పట్టణములను తలంచుకొని ధైర్యము తెచ్చుకొందము, తన దృష్టికి ఏది యనుకూలమో యెహోవా దానిని చేయునుగాక అని అబీషైతో చెప్పి

1దినవృత్తాంతములు 22:11

నా కుమారుడా, యెహోవా నీకు తోడుగా ఉండునుగాక; నీవు వర్ధిల్లి నీ దేవుడైన యెహోవా నిన్నుగూర్చి సెలవిచ్చిన ప్రకారముగా ఆయనకు మందిరమును కట్టించుదువుగాక.

1దినవృత్తాంతములు 22:16

లెక్కింపలేనంత బంగారమును వెండియు ఇత్తడియు ఇనుమును నీకు ఉన్నవి; కాబట్టి నీవు పని పూనుకొనుము, యెహోవా నీకు తోడుగా ఉండును గాక.