lie
యెషయా 5:11

మద్యము త్రాగుదమని వేకువనే లేచి ద్రాక్షారసము తమకు మంట పుట్టించు వరకు చాల రాత్రివరకు పానముచేయువారికి శ్రమ.

యెషయా 5:12

వారు సితారా స్వరమండల తంబుర సన్నాయిలను వాయించుచు ద్రాక్షారసము త్రాగుచు విందు చేయుదురుగాని యెహోవా పని యోచింపరు ఆయన హస్తకృత్యములను లక్ష్యపెట్టరు.

యెషయా 22:13

రేపు చచ్చిపోదుము గనుక తిందము త్రాగుదము అని చెప్పి, యెడ్లను వధించుచు గొఱ్ఱలను కోయుచు మాంసము తినుచు ద్రాక్షారసము త్రాగుచు మీరు

లూకా 16:19

ధనవంతు డొకడుం డెను. అతడు ఊదారంగు బట్టలును సన్నపు నార వస్త్రములును ధరించుకొని ప్రతి దినము బహుగా సుఖపడుచుండువాడు.

రోమీయులకు 13:13

అల్లరితోకూడిన ఆటపాటలైనను మత్తయినను లేకయు, కామవిలాసములైనను పోకిరిచేష్టలైనను లేకయు, కలహమైనను మత్సరమైనను లేకయు, పగటి యందు నడుచుకొన్నట్టు మర్యాదగా నడుచుకొందము.

రోమీయులకు 13:14

మెట్టుకు ప్రభువైన యేసు క్రీస్తును ధరించుకొనినవారై, శరీరేచ్ఛలను నెరవేర్చుకొనుటకు శరీరము విషయమై ఆలోచన చేసికొనకుడి .

యాకోబు 5:5

మీరు భూమిమీద సుఖముగా జీవించి భోగాసక్తులై వధదినమునందు మీ హృదయములను పోషించుకొంటిరి.

stretch themselves upon their couches
1 సమూయేలు 25:36-38
36

అబీగయీలు తిరిగి నాబాలు నొద్దకు రాగా, రాజులు విందుచేసినట్లు అతడు ఇంటిలో విందుచేసి, త్రాగుచు బహు సంతోషించుచు మత్తుగానుండెను గనుక తెల్లవారు వరకు ఆమె అతనితో కొద్ది గొప్ప మరేమియు చెప్పక ఊరకుండెను.

37

ఉదయమున నాబాలునకు మత్తు తగ్గియున్నప్పుడు అతని భార్య అతనితో ఆ సంగతులను తెలియజెప్పగా భయముచేత అతని గుండె పగిలెను, అతడు రాతివలె బిగిసికొనిపోయెను.

38

పది దినములైన తరువాత యెహోవా నాబాలును మొత్తగా అతడు చనిపోయెను.

కీర్తనల గ్రంథము 73:7

క్రొవ్వుచేత వారి కన్నులు మెరకలైయున్నవి వారి హృదయాలోచనలు బయటికి కానవచ్చుచున్నవి

లూకా 12:19

నా ప్రాణముతో– ప్రాణమా, అనేక సంవత్సరములకు,విస్తారమైన ఆస్తి నీకు సమకూర్చబడియున్నది; సుఖించుము, తినుము, త్రాగుము, సంతోషించుమని చెప్పుకొందునను కొనెను.

లూకా 12:20

అయితే దేవుడు–వెఱ్ఱివాడా, యీ రాత్రి నీ ప్రాణము నడుగుచున్నారు; నీవు సిద్ధపరచినవి ఎవనివగునని ఆతనితో చెప్పెను.