shall ye
యెహెజ్కేలు 6:9

మరియు నన్ను విసర్జించినవారి విశ్వాస ఘాతకమైన వ్యభిచార మనస్సును, విగ్రహముల ననుసరించిన వ్యభిచార దృష్టిని నేను మార్చి నాతట్టు తిరుగజేయగా, చెరపట్టబడినవారై శేషించినవారు అన్యజనులమధ్య నన్ను జ్ఞాపకము చేసికొని, తామనుసరించిన హేయకృత్యము లన్నిటినిబట్టి తాము చేసిన దుష్క్రియలను కనుగొని తమ్మును తామే అసహ్యించుకొనుచు

లేవీయకాండము 26:39-41
39

మీలో మిగిలినవారు మీ శత్రువుల దేశములలో తమ దోషములనుబట్టి క్షీణించిపోయెదరు. మరియు వారు తమమీదికి వచ్చిన తమ తండ్రుల దోషములనుబట్టి క్షీణించిపోయెదరు.

40

వారు నాకు విరోధముగా చేసిన తిరుగుబాటును తమ దోషమును తమ తండ్రుల దోషమును ఒప్పుకొని, తాము నాకు విరోధముగా నడిచితిమనియు

41

నేను తమకు విరోధముగా నడిచితిననియు, తమ శత్రువుల దేశములోనికి తమ్మును రప్పించితిననియు, ఒప్పుకొనినయెడల, అనగా లోబడని తమ హృదయములు లొంగి తాము చేసిన దోషమునకు ప్రతి దండనను అనుభవించితిమని ఒప్పుకొనినయెడల,

నెహెమ్యా 1:8-10
8

నీ సేవకుడైన మోషేతో నీవు సెలవిచ్చినమాటను జ్ఞాపకము తెచ్చుకొనుము; అదేదనగా మీరు అపరాధము చేసినయెడల జనులలోనికి మిమ్మును చెదరగొట్టుదును.

9

అయితే మీరు నావైపు తిరిగి నా ఆజ్ఞలను అనుసరించి నడిచినయెడల, భూదిగంతములవరకు మీరు తోలివేయబడినను అక్కడనుండి సహా మిమ్మునుకూర్చి, నా నామము ఉంచుటకు నేను ఏర్పరచుకొనిన స్థలమునకు మిమ్మును రప్పించెదనని నీవు సెలవిచ్చితివి గదా.

10

చిత్తగించుము, నీవు నీ మహా ప్రభావమును చూపి, నీ బాహుబలము చేత విడిపించిన నీ దాసులగు నీ జనులు వీరే.

హొషేయ 5:15

వారు మనస్సు త్రిప్పుకొని నన్ను వెదకు వరకు నేను తిరిగి నా స్థలము నకు పోవుదును; తమకు దురవస్థ సంభవింపగా వారు నన్ను బహు శీఘ్రముగా వెదకుదురు.

and ye shall
యెహెజ్కేలు 16:61-63
61

నీ అక్క చెల్లెండ్రు నీవు చేసిన నిబంధనలో పాలివారు కాకుండినను నేను వారిని నీకు కుమార్తెలుగా ఇయ్యబోవుచున్నాను. నీవు వారిని చేర్చుకొనునప్పుడు నీ వ్రవర్తన మనస్సునకు తెచ్చుకొని సిగ్గుపడుదువు.

62

నేను యెహోవానని నీవు తెలిసికొనునట్లు నేను నీతో నా నిబంధనను స్థిరపరచెదను.

63

నీవు చేసినది అంతటినిమిత్తము నేను ప్రాయశ్చిత్తము చేయగా దానిని మనస్సునకు తెచ్చుకొని సిగ్గుపడి సిగ్గుచేత నోరు మూసికొందువు; ఇదే యెహోవా వాక్కు.

యెహెజ్కేలు 36:31

అప్పుడు మీరు మీ దుష్‌ ప్రవర్తనను మీరు చేసిన దుష్‌క్రియలను మనస్సునకు తెచ్చుకొని, మీ దోషములను బట్టియు హేయక్రియలను బట్టియు మిమ్మును మీరు అసహ్యించుకొందురు.

యోబు గ్రంథము 42:6

కావున నన్ను నేను అసహ్యించుకొని, ధూళిలోను బూడిదెలోను పడి పశ్చాత్తాపపడుచున్నాను.

యిర్మీయా 31:18

నీవు నన్ను శిక్షించితివి, కాడికి అలవాటుకాని కోడె దెబ్బలకు లోబడునట్లుగా నేను శిక్షకు లోబడుచున్నాను, నీవు నా దేవుడవైన యెహోవావు, నీవు నా మనస్సును త్రిప్పిన యెడల నేను తిరుగుదును అని ఎఫ్రాయిము అంగలార్చు చుండగా నేను ఇప్పుడే వినుచున్నాను.

జెకర్యా 12:10-14
10

దావీదు సంతతి వారిమీదను యెరూషలేము నివాసుల మీదను కరుణ నొందించు ఆత్మను విజ్ఞాపనచేయు ఆత్మను నేను కుమ్మరింపగా వారు తాము పొడిచిన నామీద దృష్టియుంచి, యొకడు తన యేక కుమారుని విషయమై దుఃఖించునట్లు,తన జ్యేష్ఠపుత్రుని విషయమై యొకడు ప్రలాపించునట్లు అతని విషయమై దుఃఖించుచు ప్రలాపింతురు.

11

మెగిద్దోను లోయలో హదదిమ్మోనుదగ్గర జరిగిన ప్రలాపమువలెనే ఆ దినమున యెరూషలేములో బహుగా ప్రలాపము జరుగును.

12

దేశనివాసులందరు ఏ కుటుంబమునకు ఆ కుటుంబముగా ప్రలాపింతురు, దావీదు కుటుంబికులు ప్రత్యేకముగాను, వారి భార్యలు ప్రత్యేకముగాను, నాతాను కుటుంబికులు ప్రత్యేకముగాను, వారి భార్యలు ప్రత్యేకముగాను,

13

లేవి కుటుంబికులు ప్రత్యేకముగాను, వారి భార్యలు ప్రత్యేకముగాను, షిమీ కుటుంబికులు ప్రత్యేకముగాను, వారి భార్యలు ప్రత్యేకముగాను,

14

మిగిలిన వారిలో ప్రతి కుటుంబపువారు ప్రత్యేకముగాను, వారి భార్యలు ప్రత్యేకముగాను, ప్రలాపింతురు.

లూకా 18:13

అయితే సుంకరి దూరముగా నిలుచుండి, ఆకాశమువైపు కన్ను లెత్తుటకైనను ధైర్యముచాలక రొమ్ము కొట్టుకొనుచు– దేవా, పాపినైన నన్ను కరుణించుమని పలికెను.

2 కొరింథీయులకు 7:11

మీరు దేవుని చిత్తప్రకారము పొందిన యీ దుఃఖము ఎట్టి జాగ్రతను ఎట్టిదోషనివారణకైన ప్రతివాదమును ఎట్టి ఆగ్రహమును ఎట్టి భయమును ఎట్టి అభిలాషను ఎట్టి ఆసక్తిని ఎట్టి ప్రతిదండనను మీలో పుట్టించెనో చూడుడి. ఆ కార్యమునుగూర్చి సమస్త విషయములలోను మీరు నిర్దోషులైయున్నారని ఋజువుపరచుకొంటిరి.