నేనే
1 సమూయేలు 21:2

దావీదు–రాజు నాకు ఒక పని నిర్ణయించి–నేను నీ కాజ్ఞాపించి పంపిన పని యేదో అదెవనితోనైనను చెప్ప వద్దనెను; నేను నా పనివారిని ఒకానొక చోటికి వెళ్ల నిర్ణయించితిని;

1 సమూయేలు 21:13

కాబట్టి దావీదు వారి యెదుట తన చర్య మార్చుకొని వెఱ్ఱివానివలె నటించుచు, ద్వారపు తలుపుల మీద గీతలు గీయుచు, ఉమ్మి తన గడ్డము మీదికి కారనిచ్చుచు నుండెను. వారతని పట్టుకొనిపోగా అతడు పిచ్చిచేష్టలు చేయుచు వచ్చెను.

1 సమూయేలు 27:10

ఆకీషు–ఇప్పుడు మీరు దండెత్తి దేశములో జొరబడితిరా అని దావీదు నడుగగా దావీదు–యూదా దేశమునకును యెరహ్మెయేలీయుల దేశమునకును కేనీయుల దేశమునకును దక్షిణముగా మేము ఒక ప్రదేశములో జొరబడితిమనెను.

2 సమూయేలు 14:5

రాజు– నీకేమి కష్టము వచ్చెనని అడిగెను. అందుకు ఆమె –నేను నిజముగా విధవరాలను, నా పెనిమిటి చనిపోయెను;

యోబు గ్రంథము 13:7

దేవుని పక్షముగా మీరు అన్యాయ వాదనచేయుదురా?ఆయన పక్షముగా మీరు మోసములు పలుకుదురా?

యోబు గ్రంథము 13:8

ఆయనయెడల మీరు పక్షపాతము చూపుదురా?దేవుని పక్షమున మీరు వాదింతురా?

యోబు గ్రంథము 15:5

నీ మాటలవలన నీ పాపము తెలియబడుచున్నది.వంచకుల పలుకులు నీవు పలుకుచున్నావు.

సామెతలు 12:19

నిజమాడు పెదవులు నిత్యము స్థిరమైయుండును అబద్ధమాడు నాలుక క్షణమాత్రమే యుండును.

సామెతలు 12:22

అబద్దమాడు పెదవులు యెహోవాకు హేయములు సత్యవర్తనులు ఆయనకిష్టులు.

సామెతలు 30:8

వ్యర్థమైనవాటిని ఆబద్ధములను నాకు దూరముగానుంచుము పేదరికమునైనను ఐశ్వర్యమునైనను నాకు దయచేయకుము తగినంత ఆహారము నాకు అనుగ్రహింపుము.

జెకర్యా 8:16

మీరు చేయవలసిన కార్యము లేవనగా, ప్రతివాడు తన పొరుగు వానితో సత్యమే మాటలాడవలెను, సత్యమునుబట్టి సమాధానకరమైన న్యాయమునుబట్టి మీ గుమ్మములలో తీర్పు తీర్చవలెను.

రోమీయులకు 3:7

దేవునికి మహిమ కలుగునట్లు నా అసత్యము వలన దేవుని సత్యము ప్రబలిన యెడల నేనికను పాపి నైనట్టు తీర్పు పొందనేల?

రోమీయులకు 3:8

మేలు కలుగుటకు కీడు చేయుదమని మేము చెప్పుచున్నామని, కొందరు మమ్మును దూషించి చెప్పు ప్రకారము మేమెందుకు చెప్పరాదు? అట్టివారికి కలుగు శిక్షావిధి న్యాయమే.

ఎఫెసీయులకు 4:25

మనము ఒకరికొకరము అవయవములై యున్నాము గనుక మీరు అబద్ధమాడుట మాని ప్రతివాడును తన పొరుగువానితో సత్యమే మాటలాడవలెను.

కొలొస్సయులకు 3:9

ఒకనితో ఒకడు అబద్ధ మాడకుడి;ఏలయనగా ప్రాచీనస్వభావమును దాని క్రియలతో కూడ