ఇదిగో నేనున్నాను, నేనెవని యెద్దునైన తీసికొంటినా ? ఎవని గార్దభమునైన పట్టుకొంటినా ? ఎవనికైన అన్యాయము చేసితినా? ఎవనినైన బాధపెట్టితినా ? న్యాయము నాకు అగపడకుండ ఎవని యొద్దనైన లంచము పుచ్చుకొంటినా ? ఆలాగు చేసినయెడల యెహోవా సన్నిధిని ఆయన అభిషేకము చేయించిన వాని యెదుటను వాడు నా మీద సాక్ష్యము పలుకవలెను, అప్పుడు నేను మీ యెదుట దానిని మరల నిత్తుననెను.
అందుకు దావీదు -నేనేమి చేసితిని ? మాట మాత్రము పలికితినని చెప్పి
నీ దాసుడనైన నాకు ఒక ఉపకారము చేయవలెను ; ఏమనగా యెహోవా పేరట నీతో నిబంధన చేయుటకై నీవు నీ దాసుడనైన నన్ను రప్పించితివి ; నాయందు దోషమేమైన ఉండిన యెడల నీ తండ్రియొద్దకు నన్నెందుకు తోడుకొని పోదువు? నీవే నన్ను చంపుమని యోనాతానునొద్ద మనవి చేయగా
నా యేలినవాడు తన దాసుని ఈలాగు ఎందుకు తరుముచున్నాడు ? నేనేమి చేసితిని ? నావలన ఏ కీడు నీకు సంభవించును?
దావీదు -నీ దాసుడనైన నేను చేయబోవు కార్యము ఏదో అది నీవు ఇప్పుడు తెలిసికొందు వనెను . అందుకు ఆకీషు -ఆలాగైతే నిన్ను ఎప్పటికి నాకు సంరక్షకుడుగా నిర్ణయింతు ననెను .
హూషై యెహోవాయును ఈ జనులును ఇశ్రాయేలీయులందరును ఎవని కోరుకొందురో నేను అతని వాడనగుదును, అతనియొద్దనే యుందును.
మరియు నేనెవనికి సేవచేయవలెను? అతని కుమారుని సన్నిధిని నేను సేవచేయవలెను గదా? నీ తండ్రి సన్నిధిని నేను సేవచేసినట్లు నీ సన్నిధిని నేను సేవచేయుదునని అబ్షాలోమునొద్ద మనవి చేసెను.
చెడ్డ మాటలు పలుకకుండ నీ నాలుకను కపటమైన మాటలు పలుకకుండ నీ పెదవులను కాచుకొనుము.
కీడు చేయుట మాని మేలు చేయుము సమాధానము వెదకి దాని వెంటాడుము.
మమ్మును శోధనలోకి తేక దుష్టునినుండి1 మమ్మును తప్పించుము.