అప్పుడు సమూయేలు -జను లందరిలో యెహోవా ఏర్పరచి నవానిని మీరు చూచితిరా ? జను లందరిలో అతనివంటివాడొకడును లేడని చెప్పగా , జను లందరు బొబ్బలు పెట్టుచు-రాజు చిరంజీవి యగుగాక అని కేకలువేసిరి .
జను లందరు గిల్గాలునకు వచ్చి గిల్గాలులో యెహోవా సన్నిధిని సమాధానబలులను అర్పించి , యెహోవా సన్నిధిని సౌలునకు పట్టాభిషేకము చేసిరి. సౌలును ఇశ్రాయేలీయు లందరును అక్కడ బహుగా సంతోషించిరి .
చిత్తగించుము , నీవు వృద్ధుడవు , నీ కుమారులు నీ ప్రవర్తనవంటి ప్రవర్తన గలవారు కారు గనుక, సకల జనుల మర్యాదచొప్పున మాకు ఒక రాజును నియమింపుము , అతడు మాకు న్యాయము తీర్చునని అతనితో అనిరి .
మూడు దినముల క్రిందట తప్పిపోయిన నీ గార్దభములనుగూర్చి విచార పడకుము , అవి దొరికినవి . ఇశ్రాయేలీయుల అభీష్టము ఎవరియందున్నది ? నీ యందును నీ తండ్రి యింటి వారియందును గదా అనెను.
కాగా కోపము తెచ్చుకొని నీకు రాజును నియమించితిని ; క్రోధముకలిగి అతని కొట్టివేయుచున్నాను .
ఆ తరువాత వారు రాజు కావలెనని కోరగా దేవుడు బెన్యామీను గోత్రీయుడును కీషు కుమారుడునైన సౌలును వారికి నలువది ఏండ్ల వరకు దయచేసెను.