సమస్త జనములను ఇనుపదండముతో ఏలనైయున్న యొక మగశిశువును ఆమె కనగా, ఆమె శిశువు దేవునియొద్దకును ఆయన సింహాసనము నొద్దకును కొనిపోబడెను.
జనములను కొట్టుటకై ఆయన నోటనుండి వాడిగల ఖడ్గము బయలువెడలుచున్నది. ఆయన యినుపదండముతో వారిని ఏలును; ఆయనే సర్వాధికారియగు దేవుని తీక్షణమైన ఉగ్రత అను మద్యపుతొట్టి త్రొక్కును.
నన్ను అడుగుము, జనములను నీకు స్వాస్థ్యముగాను భూమిని దిగంతములవరకు సొత్తుగాను ఇచ్చెదను.
ఇనుపదండముతో నీవు వారిని నలుగగొట్టెదవు కుండను పగులగొట్టినట్టు వారిని ముక్క చెక్కలుగా పగులగొట్టెదవు
వారు పాతాళములో మందగా కూర్చబడుదురు మరణము వారికి కాపరియైయుండును ఉదయమున యథార్థవంతులు వారి నేలుదురు వారి స్వరూపములు నివాసములేనివై పాతాళములో క్షయమైపోవును.
భక్తులు ఘనతనొంది ప్రహర్షించుదురు గాక వారు సంతోషభరితులై తమ పడకలమీద ఉత్సాహ గానము చేయుదురు గాక.
వారినోట దేవునికి చేయబడు ఉత్సాహస్తోత్రములున్నవి.
అన్యజనులకు ప్రతిదండన చేయుటకును ప్రజలను శిక్షించుటకును
గొలుసులతో వారి రాజులను ఇనుప సంకెళ్లతో వారి ఘనులను బంధించుటకును
విధింపబడిన తీర్పు వారిమీద నడుపుటకును వారి చేతిలో రెండంచులుగల ఖడ్గమున్నది. ఆయన భక్తులకందరికి ఘనత యిదే యెహోవాను స్తుతించుడి.
ఆ మహావృద్ధుడు వచ్చి మహోన్నతుని పరిశుద్ధుల విషయములో తీర్పు తీర్చు వరకు ఆలాగు జరుగును గాని సమయము వచ్చినప్పుడు ఆ పరిశుద్ధులు రాజ్యము నేలుదురను సంగతి నేను గ్రహించితిని.
సమస్తమును నా తండ్రిచేత నా కప్పగింపబడి యున్నది. తండ్రిగాక యెవడును కుమారుని ఎరుగడు; కుమారుడు గాకను, కుమారు డెవనికి ఆయనను బయలుపరచ నుద్దేశించునో వాడు గాకను మరి ఎవడును తండ్రిని ఎరుగడు.
గనుక నాతండ్రి నాకు రాజ్యమును నియమించినట్టుగా నా రాజ్యములో నా బల్లయొద్ద అన్నపానములు పుచ్చుకొని,
తండ్రీ, నేనెక్కడ ఉందునో అక్కడ నీవు నాకు అనుగ్రహించిన వారును నాతోకూడ ఉండవలె ననియు, నీవు నాకు అనుగ్రహించిన నా మహిమను వారు చూడవలెననియు కోరుచున్నాను. జగత్తు పునాది వేయబడక మునుపే నీవు నన్ను ప్రేమించితివి.