యాజకత్వము
హెబ్రీయులకు 5:4

మరియు ఎవడును ఈ ఘనత తనకుతానే వహించుకొనడు గాని, అహరోను పిలువబడినట్టుగా దేవునిచేత పిలువబడినవాడై యీ ఘనతపొందును.

నిర్గమకాండము 28:1

మరియు నాకు యాజకత్వము చేయుటకై నీ సహోదరుడైన అహరోనును అతని కుమారులను, అనగా అహరోనును, అహరోను కుమారులైన నాదాబును, అబీహును, ఎలియాజరును ఈతామారును ఇశ్రాయేలీయులలోనుండి నీ యొద్దకు పిలిపింపుము.

సంఖ్యాకాండము 16:10

ఆయన నిన్నును నీతో లేవీయులైన నీ గోత్రపువారి నందరిని చేర్చుకొనెను గదా. అయితే మీరు యాజకత్వముకూడ కోరుచున్నారు.

సంఖ్యాకాండము 16:11

ఇందు నిమిత్తము నీవును నీ సమస్తసమాజమును యెహోవాకు విరోధముగా పోగైయున్నారు. అహరోను ఎవడు? అతనికి విరోధముగా మీరు సణుగనేల అనెను.

సంఖ్యాకాండము 17:3-10
3

లేవికఱ్ఱమీద అహరోను పేరు వ్రాయవలెను; ఏలయనగా పితరుల కుటుంబముల ప్రధానునికి ఒక్క కఱ్ఱయే యుండవలెను.

4

నేను మిమ్మును కలిసికొను ప్రత్యక్షపు గుడారములోని శాసనములయెదుట వాటిని ఉంచవలెను.

5

అప్పుడు నేను ఎవని ఏర్పరచుకొందునో వాని కఱ్ఱ చిగిరించును. ఇశ్రాయేలీయులు మీకు విరోధముగా సణుగుచుండు సణుగులు నాకు వినబడకుండ మాన్పివేయుదును.

6

కాబట్టి మోషే ఇశ్రాయేలీయులతో చెప్పగా వారి ప్రధానులందరు తమ తమ పితరుల కుటుంబములలో ఒక్కొక్క ప్రధానునికి ఒక్కొక్క కఱ్ఱ చొప్పున పండ్రెండు కఱ్ఱలను అతనికిచ్చిరి; అహరోను కఱ్ఱయు వారి కఱ్ఱల మధ్యనుండెను.

7

మోషే వారి కఱ్ఱలను సాక్ష్యపు గుడారములో యెహోవా సన్నిధిని ఉంచెను.

8

మరునాడు మోషే సాక్ష్యపు గుడారములోనికి వెళ్లి చూడగా లేవి కుటుంబపుదైన అహరోను కఱ్ఱ చిగిర్చి యుండెను. అది చిగిర్చి పువ్వులు పూసి బాదము పండ్లుగలదాయెను.

9

మోషే యెహోవా సన్నిధినుండి ఆ కఱ్ఱలన్నిటిని ఇశ్రాయేలీయులందరి యెదుటికి తేగా వారు వాటిని చూచి యొక్కొక్కడు ఎవరి కఱ్ఱను వారు తీసికొనిరి.

10

అప్పుడు యెహోవా మోషేతో ఇట్లనెను–తిరుగబడిన వారినిగూర్చి ఆనవాలుగా కాపాడబడునట్లు, అహరోను కఱ్ఱను మరల శాసనముల యెదుట ఉంచుము. వారు చావకుండునట్లు నాకు వినబడకుండ వారి సణుగులను కేవలము అణచి మాన్పివేసిన వాడవౌదువు.

సంఖ్యాకాండము 18:7

కాబట్టి నీవును నీ కుమారులును బలిపీఠపు పనులన్నిటి విషయములోను అడ్డతెరలోపలి దాని విషయములోను యాజకత్వము జరుపుచు సేవచేయవలెను. దయచేతనే మీ యాజకత్వపు సేవ నేను మీకిచ్చియున్నాను; అన్యుడు సమీపించినయెడల మరణశిక్ష నొందును.

సంఖ్యాకాండము 18:21-26
21

ఇదిగో లేవీయులు చేయు సేవకు, అనగా ప్రత్యక్షపు గుడారముయొక్క సేవకు నేను ఇశ్రాయేలీయులయొక్క దశమభాగములన్నిటిని వారికి స్వాస్థ్యముగా ఇచ్చితిని.

22

ఇశ్రాయేలీయులు పాపము తగిలి చావకుండునట్లు వారు ఇకమీదట ప్రత్యక్షపు గుడారమునకు రాకూడదు.

23

అయితే లేవీయులు ప్రత్యక్షపు గుడారముయొక్క సేవ చేసి, వారి సేవలోని దోషములకు తామే ఉత్తరవాదులై యుందురు. ఇశ్రాయేలీయుల మధ్యను వారికి స్వాస్థ్యమేమియు ఉండదు. ఇది మీ తరతరములకు నిత్యమైన కట్టడ.

24

అయితే ఇశ్రాయేలీయులు యెహోవాకు ప్రతిష్ఠార్పణముగా అర్పించు దశమభాగములను నేను లేవీయులకు స్వాస్థ్యముగా ఇచ్చితిని. అందుచేతను వారు ఇశ్రాయేలీయుల మధ్యను స్వాస్థ్యము సంపాదింపకూడదని వారితో చెప్పితిని.

25

మరియు యెహోవా మోషేకు ఈలాగు సెలవిచ్చెను

26

–నీవు లేవీయులతో ఇట్లనుము–నేను ఇశ్రాయేలీయులచేత మీకు స్వాస్థ్యముగా ఇప్పించిన దశమభాగమును మీరు వారియొద్ద పుచ్చుకొనునప్పుడు మీరు దానిలో, అనగా ఆ దశమభాగములో దశమభాగమును యెహోవాకు ప్రతిష్ఠార్పణముగా చెల్లింపవలెను.

పుచ్చుకొనుటకు
లేవీయకాండము 27:30-33
30

భూధాన్యములలోనేమి వృక్షఫలములోనేమి భూఫలములన్నిటిలో దశమభాగము యెహోవా సొమ్ము; అది యెహోవాకు ప్రతిష్ఠితమగును.

31

ఒకడు తాను చెల్లింపవలసిన దశమభాగములలో దేనినైనను విడిపింప గోరినయెడల దానిలో అయిదవవంతును దానితో కలుపవలెను.

32

గోవులలోనేగాని గొఱ్ఱమేకలలోనేగాని, కోలక్రింద నడుచునన్నిటిలో దశమభాగము ప్రతిష్ఠితమగును.

33

అది మంచిదో చెడ్డదో పరిశోధింపకూడదు, దాని మార్చకూడదు. దాని మార్చినయెడల అదియు దానికి మారుగా నిచ్చినదియు ప్రతిష్ఠితములగును; అట్టిదాని విడిపింపకూడదని చెప్పుము.

సంఖ్యాకాండము 18:26-32
26

–నీవు లేవీయులతో ఇట్లనుము–నేను ఇశ్రాయేలీయులచేత మీకు స్వాస్థ్యముగా ఇప్పించిన దశమభాగమును మీరు వారియొద్ద పుచ్చుకొనునప్పుడు మీరు దానిలో, అనగా ఆ దశమభాగములో దశమభాగమును యెహోవాకు ప్రతిష్ఠార్పణముగా చెల్లింపవలెను.

27

మీకు వచ్చు ప్రతిష్ఠార్పణము కళ్లపు పంటవలెను ద్రాక్షల తొట్టి ఫలమువలెను ఎంచవలెను.

28

అట్లు మీరు ఇశ్రాయేలీయులయొద్ద పుచ్చుకొను మీ దశమభాగములన్నిటిలో నుండి మీరు ప్రతిష్ఠార్పణమును యెహోవాకు చెల్లింపవలెను. దానిలో నుండి మీరు యెహోవాకు ప్రతిష్ఠించుఅర్పణమును యాజకుడైన అహరోనుకు ఇయ్యవలెను.

29

మీకియ్యబడు వాటన్నిటిలో ప్రశస్తమైన దానిలోనుండి యెహోవాకు ప్రతిష్ఠించు ప్రతి అర్పణమును, అనగా దాని ప్రతిష్ఠితభాగమును దానిలోనుండి ప్రతిష్ఠింపవలెను

30

మరియు నీవు వారితో మీరు దానిలోనుండి ప్రశస్తభాగమును అర్పించిన తరువాత మిగిలినది కళ్లపువచ్చుబడివలెను ద్రాక్షతొట్టి వచ్చుబడివలెను లేవీయులదని యెంచవలెను.

31

మీరును మీ కుటుంబికులును ఏ స్థలమందైనను దానిని తినవచ్చును; ఏలయనగా ప్రత్యక్షపు గుడారములో మీరు చేయు సేవకు అది మీకు జీతము.

32

మీరు దానిలోనుండి ప్రశస్తభాగమును అర్పించిన తరువాత దానినిబట్టి పాప శిక్షను భరింపకుందురు; మీరు చావకుండునట్లు ఇశ్రాయేలీయుల ప్రతిష్ఠితమైనవాటిని అపవిత్రపరచకూడదని చెప్పుము.

2 దినవృత్తాంతములు 31:4-6
4

మరియు యెహోవా ధర్మశాస్త్రమును బట్టి యాజకులును లేవీయులును ధైర్యము వహించి తమ పని జరుపుకొనునట్లు ఎవరి భాగములను వారికి ఇయ్యవలసినదని యెరూషలేములో కాపురమున్న జనులకు అతడు ఆజ్ఞాపించెను.

5

ఆ యాజ్ఞ వెల్లడియగుటతోడనే ఇశ్రాయేలీయులు ప్రథమఫలములైన ధాన్య ద్రాక్షారసములను నూనెను తేనెను సస్యఫలములను విస్తారముగా తీసికొని వచ్చిరి. సమస్తమైన వాటిలోనుండియు పదియవ వంతులను విస్తారముగా తీసికొని వచ్చిరి.

6

యూదా పట్టణములలో కాపురమున్న ఇశ్రాయేలువారును యూదావారును ఎద్దులలోను గొఱ్ఱలలోను పదియవవంతును, తమ దేవుడైన యెహోవాకు ప్రతిష్ఠితములైన వస్తువులలో పదియవ వంతును తీసికొని వచ్చి కుప్పలుగా కూర్చిరి.

నెహెమ్యా 13:10

మరియు లేవీయులకు రావలసిన పాళ్లు వారికి అందకపోవుటచేత సేవచేయు లేవీయులును గాయకులును తమ పొలములకు పారిపోయిరని తెలిసికొని

పుట్టినను
హెబ్రీయులకు 7:10

ఏలాగనగా మెల్కీసెదెకు అతని పితరుని కలిసికొనినప్పుడు లేవి తన పితరుని గర్భములో ఉండెను.

ఆదికాండము 35:11

మరియు దేవుడు–నేను సర్వశక్తిగల దేవుడను; నీవు ఫలించి అభివృద్ధి పొందుము. జనమును జనముల సమూహమును నీవలన కలుగును; రాజులును నీ గర్భవాసమున పుట్టెదరు.

ఆదికాండము 46:26

యాకోబు కోడండ్రను వినాయించి అతని గర్భవాసమున పుట్టి యాకోబుతో ఐగుప్తునకు వచ్చిన వారందరు అరువది ఆరుగురు.

నిర్గమకాండము 1:5

అప్పటికి యోసేపు ఐగుప్తులో ఉండెను.

1 రాజులు 8:19

అయినను నీవు మందిరమును కట్టించకూడదు; నీ నడుములోనుండి పుట్టబోవు నీ కుమారుడు నా నామఘనతకు ఒక మందిరమును కట్టించును.