
పని చేయువానికి జీతము ఋణమే గాని దానమని యెంచ బడదు .
పని చేయక , భక్తిహీనుని నీతిమంతునిగా తీర్చు వానియందు విశ్వాసముంచువానికి వాని విశ్వాసము నీతిగా ఎంచబడుచున్నది .
ధర్మశాస్త్ర సంబంధులు వారసులైన యెడల విశ్వాసము వ్యర్థమగును , వాగ్దానమును నిరర్థక మగును.
ఈ హేతువుచేతను ఆ వాగ్దానమును యావ త్సంతతికి , అనగా ధర్మశాస్త్రముగలవారికి మాత్రము కాక అబ్రాహామునకున్నట్టి విశ్వాసముగలవారికి కూడ దృఢము కావలెనని, కృప ననుసరించినదై యుండునట్లు , అది విశ్వాసమూలమైనదాయెను .
అట్లయితే మనమేమందుము ? నీతిని వెంటాడని అన్యజనులు నీతిని , అనగా విశ్వాస మూలమైన నీతిని పొందిరి ;
అయితే ఇశ్రాయేలు నీతికారణమైన నియమమును వెంటాడినను ఆ నియమమును అందుకొన లేదు ,
వారెందుకు అందుకొన లేదు ? వారు విశ్వాస మూలముగా కాక క్రియల మూలముగా నైనట్లు దానిని వెంటాడిరి .
ధర్మశాస్త్ర మూలమగు నీతిని నెరవేర్చు వాడు దాని వలననే జీవించునని మోషే వ్రాయుచున్నాడు .
అయితే విశ్వాస మూలమగు నీతి యీలాగు చెప్పుచున్నది -ఎవడు పరలోకము లోనికి ఎక్కిపోవును ? అనగా క్రీస్తును క్రిందికి తెచ్చుటకు;
అది కృపచేతనైన యెడల ఇకను క్రియల మూలమైనది కాదు ; కానియెడల కృప ఇకను కృప కాకపోవును .
మీరు నాకట్టడలను నా విధులను ఆచరింపవలెను. వాటిని గైకొనువాడు వాటివలన బ్రదుకును; నేను యెహోవాను.
నీ ఆజ్ఞలను విధులను ఒకడు ఆచరించిన యెడల వాటివలన వాడు బ్రదుకునుగదా. వారు మరల నీ ధర్మశాస్త్రము ననుసరించి నడుచునట్లు నీవు వారిమీద సాక్ష్యము పలికినను, వారు గర్వించి నీ ఆజ్ఞలకు లోబడక నీ విధుల విషయములో పాపులై నిన్ను తిరస్కరించి తమ మనస్సును కఠినపరచుకొని నీ మాటవినకపోయిరి.
వారికి నా కట్టడలను నియమించి నా విధులను వారికి తెలియజేసితిని . ఎవడైన వాటి ననుసరించినయెడల వాటినిబట్టి బ్రదుకును .
అయితే అరణ్యమందు ఇశ్రాయేలీయులు నామీద తిరుగుబాటు చేసి నా కట్టడల ననుస రింపక , తాము అనుసరించి బ్రదుకవలెనని నేనిచ్చిన విధులను తృణీకరించి , నేను నియమించిన విశ్రాంతిదినములను అపవిత్రపరచగా , అరణ్యమందు నా రౌద్రాగ్ని వారిమీద కుమ్మరించి వారిని నిర్మూలము చేయుదుననుకొంటిని .
అందుకాయన–మంచి కార్యమునుగూర్చి నన్నెందుకు అడుగుచున్నావు? మంచి వాడొక్కడే. నీవు జీవములో ప్రవేశింప గోరినయెడల ఆజ్ఞలను గైకొనుమని చెప్పెను. అతడు–ఏ ఆజ్ఞలని ఆయనను అడుగగా
ఇదిగో ఒకప్పుడు ధర్మశాస్త్రోపదేశకుడొకడు లేచి–బోధకుడా , నిత్యజీవమునకు వారసుడనగుటకు నేనేమి చేయవలెనని ఆయనను శోధించుచు అడిగెను .
అందుకాయన–ధర్మశాస్త్రమందేమి వ్రాయబడియున్నది ? నీవేమి చదువుచున్నావని అతని నడుగగా
అతడు–నీ దేవుడైన ప్రభువును నీ పూర్ణహృదయముతోను , నీ పూర్ణమనస్సుతోను , నీ పూర్ణ శక్తితోను , నీ పూర్ణ వివేకముతోను ప్రేమింపవలెననియు , నిన్నువలె నీ పొరుగువాని ప్రేమింపవలెననియు , వ్రాయబడియున్నాదని చెప్పెను.
అందుకాయన–నీవు సరిగా ఉత్తరమిచ్చితివి ; ఆలాగు చేయుము అప్పుడు జీవించెదవని అతనితో చెప్పెను .
ధర్మశాస్త్ర మూలమగు నీతిని నెరవేర్చు వాడు దాని వలననే జీవించునని మోషే వ్రాయుచున్నాడు .
అయితే విశ్వాస మూలమగు నీతి యీలాగు చెప్పుచున్నది -ఎవడు పరలోకము లోనికి ఎక్కిపోవును ? అనగా క్రీస్తును క్రిందికి తెచ్చుటకు;