సంఘములవారికి
అపొస్తలుల కార్యములు 9:31

కావున యూదయ గలిలయ సమరయ దేశములందంతట సంఘము క్షేమాభివృద్ధినొందుచు సమాధానము కలిగియుండెను; మరియు ప్రభువునందు భయమును పరిశుద్ధాత్మ ఆదరణయు కలిగి నడుచుకొనుచు విస్తరించుచుండెను.

1 థెస్సలొనీకయులకు 2:14

అవును సహోదరులారా, మీరు యూదయలో క్రీస్తు యేసునందున్న దేవుని సంఘములను పోలి నడుచుకొనిన వారైతిరి. వారుయూదులవలన అనుభవించినట్టి శ్రమలే మీరును మీ సొంతదేశ

క్రీస్తునందున్న
రోమీయులకు 16:7
నాకు బంధువులును నా తోడి ఖైదీలునైన అంద్రొనీకుకును , యూనీయకును వందనములు ; వీరు అపొస్తలు లలో ప్రసిద్ధి కెక్కినవారై, నాకంటె ముందుగా క్రీస్తు నందున్నవారు .
1 కొరింథీయులకు 1:30

అయితే ఆయన మూలముగా మీరు క్రీస్తుయేసు నందున్నారు.

ఫిలిప్పీయులకు 1:1

ఫిలిప్పీలో ఉన్న క్రీస్తు యేసునందలి సకల పరిశుద్ధులకును అధ్యక్షులకును పరిచారకులకును క్రీస్తుయేసు దాసులైన పౌలును తిమోతియును శుభమని చెప్పి వ్రాయు నది.

1 థెస్సలొనీకయులకు 1:1

తండ్రియైన దేవునియందును ప్రభువైన యేసుక్రీస్తు నందును ఉన్న థెస్సలొనీకయుల సంఘమునకు పౌలును, సిల్వానును, తిమోతియును శుభమని చెప్పి వ్రాయునది. కృపయు సమాధానమును మీకు కలుగును గాక.

2 థెస్సలొనీకయులకు 1:1

మన తండ్రియైన దేవునియందును ప్రభువైన యేసు క్రీస్తునందును ఉన్న థెస్సలొనీకయుల సంఘమునకు పౌలును , సిల్వానును, తిమోతియును శుభమని చెప్పి వ్రాయునది.